శ్రీమద్భగవద్గీత - 198: 04వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 198: Chap. 04, Ver. 36


🌹. శ్రీమద్భగవద్గీత - 198 / Bhagavad-Gita - 198 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 36 🌴


36. అపి చేదసి పాపేభ్య: సర్వేభ్య: పాపకృత్తమ: |
సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి ||


🌷. తాత్పర్యం :

ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో దుఃఖసముద్రమును దాటగలవు.


🌷. భాష్యము :

శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితిని మనుజుడు సరిగా అవగతము చేసికొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞానసాగరమునందు జరిగెడి జీవనసంఘర్షణ నుండి అతనిని శీఘ్రమే ఉద్ధరించును. ఈ భౌతికజగత్తు కొన్నిమార్లు అజ్ఞానసాగరమును, మరికొన్నిమార్లు దావానములతో చుట్టబడిన అరణ్యముగను వర్ణింపబడును.

సముద్రమునందు ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను ప్రాణరక్షణము కష్టమే; ఎవరేని వచ్చి అతనిని సముద్రము నుండి లేవదీసి రక్షించినచో అట్టివానిని గొప్పరక్షకుడని భావింపవచ్చును. దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి స్వీకరింపబడిన పూర్ణజ్ఞానము ముక్తికి మార్గమై యున్నది. అట్టి కృష్ణభక్తిరసభావన యనెడి నౌక సరళమైనను మహోన్నతమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 198 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 36 🌴



36. api ced asi pāpebhyaḥ sarvebhyaḥ pāpa-kṛt-tamaḥ
sarvaṁ jñāna-plavenaiva vṛjinaṁ santariṣyasi


🌷 Translation :

Even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge you will be able to cross over the ocean of miseries.


🌹 Purport :

Proper understanding of one’s constitutional position in relationship to Kṛṣṇa is so nice that it can at once lift one from the struggle for existence which goes on in the ocean of nescience. This material world is sometimes regarded as an ocean of nescience and sometimes as a blazing forest.

In the ocean, however expert a swimmer one may be, the struggle for existence is very severe. If someone comes forward and lifts the struggling swimmer from the ocean, he is the greatest savior. Perfect knowledge, received from the Supreme Personality of Godhead, is the path of liberation. The boat of Kṛṣṇa consciousness is very simple, but at the same time the most sublime.

🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2019