శ్రీమద్భగవద్గీత - 195: 04వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 195: Chap. 04, Ver. 33


🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 33 🌴

33. శ్రేయాన్ ద్రవ్యమాయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||



🌷. తాత్పర్యం :

ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.


🌷. భాష్యము :

సంపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్ద్వారా భౌతికక్లేశముల నుండి బయటపడి అంత్యమున శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు (కృష్ణభక్తిరసభావనము) నియుక్తమగుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. అయినను ఈ యజ్ఞములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. దానిని ప్రతియొక్కరు తప్పక ఎరుగవలెను.

అదియే మన కర్త యొక్క శ్రద్ధ ననుసరించి యజ్ఞములు వివిధరూపములను దాల్చుచుండును. కర్తకు గల శ్రద్ధ దివ్యజ్ఞానస్థితికి చేరినప్పుడు, అట్టి కర్త జ్ఞానరహితముగా కేవలము తన సంపత్తులను త్యాగము చేయువాని కన్నను శ్రేష్టుడుగా గుర్తింపబడును. ఏలయన జ్ఞానప్రాప్తి కలుగనపుడు యజ్ఞములు భౌతికపరధికే చెంది ఎట్టి ఆధ్యాత్మికలాభమును గూర్చకుండును. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానపు ఉత్కృష్టస్థితియైన కృష్ణభక్తిరసభావనగా మార్పుచెందును.

జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతికకర్మలే కాగలవు. కాని అవి జ్ఞానస్థితికి చేరినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థాయికి చేరగలవు. ఈ యజ్ఞములు వాటి ఉద్దేశ్యముల ననుసరించి కొన్నిమార్లు కర్మకాండగా( కామ్యకర్మములు), మరికొన్నిమార్లు జ్ఞానకాండగా (పరమాత్మాన్వేషణ జ్ఞానము) పిలువబడును. వాటి అంతిమలక్ష్యము జ్ఞానమే యగుట అత్యంత శ్రేష్టము.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 195 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 33 🌴

33. śreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ paran-tapa
sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate



🌷 Translation :

O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pṛthā, all sacrifices of work culminate in transcendental knowledge.


🌹 Purport :

The purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to gain release from material miseries and, ultimately, to engage in loving transcendental service to the Supreme Lord (Kṛṣṇa consciousness). Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer.

When one’s faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material possessions without such knowledge, for without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit.

Real knowledge culminates in Kṛṣṇa consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform. Depending on differences in consciousness, sacrificial activities are sometimes called karma-kāṇḍa (fruitive activities) and sometimes jñāna-kāṇḍa (knowledge in the pursuit of truth). It is better when the end is knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


11 Nov 2019