శ్రీమద్భగవద్గీత - 214: 05వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 214: Chap. 05, Ver. 10
🌹. శ్రీమద్భగవద్గీత - 214 / Bhagavad-Gita - 214 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 10 🌴
10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వా కరోతి య: |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ||
🌷. తాత్పర్యం :
ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు.
🌷. భాష్యము :
ఇచ్చట “బ్రాహ్మణి” యనగా “కృష్ణభక్తిరసభావనమునందు” అని అర్థము. “ప్రధానము” అని పిలువబడును భౌతికజగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనమై యున్నది. “సర్వం హి ఏతత్ బ్రహ్మ”(మాండూక్యోపనిషత్తు 2), “తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే” (ముండకోపనిషత్తు 1.2.10) అను వేదమంత్రములు మరియు “మమ యోనిర్ మహద్బ్రహ్మ” (భగవద్గీత 14.3) అను భగవద్గీతావాక్యము జగత్తు నందలి సర్వము బ్రహ్మస్వరూపమని తెలుపుచున్నది. అనగా జగమునందలి విషయములు తమకు కారణమైన బ్రహ్మము కన్నను భిన్నముగా ప్రదర్శితమగుచున్నను వాస్తవమునాకు బ్రహ్మమునకు అభిన్నములై యున్నవి.
ప్రతిదియు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికి సంబంధించినదే కావున అవియన్నియును అతనికే చెందియున్నవని ఈశోపనిషత్తు నందు తెలుపబడినది. సర్వము శ్రీకృష్ణునకే చెందినదనియు, శ్రీకృష్ణుడే సర్వమునకు యజమానియనియు, తత్కారణముగా సమస్తమును ఆ భగవానుని సేవయందే నియుక్తము కావించవలెననియు తెలిసినవాడు తన పుణ్యపాపకర్మల ఫలములతో సంబంధము లేకుండును. ఒక నిర్దుష్ట కార్యార్థమై భగావానునిచే ఒసగిబడియున్నందున భౌతికదేహమును సైతము కృష్ణభక్తిభావన యందు నియోగింపవలెను. అట్టి సమయమున నీటి యందున్నను తడి గాని తామరాకు వలె దేహము పాపకర్మఫలములకు అతీతమగును.
“మయి సర్వాణి కర్మాణి సన్న్యస్య – నీ కర్మలనన్నింటిని నాకు అర్పింపుము” అని శ్రీకృష్ణభగవానుడు తృతీయాధ్యాయమున(3.30) పలికి యుండెను. సారంశమేమనగా కృష్ణభక్తిభావనము లేనివాడు దేహేంద్రియభావనలో వర్తించగా, కృష్ణభక్తిపరాయణుడు దేహము కృష్ణుని సొత్తు గనుక దానిని అతని సేవ యందే నియోగించవలెనను జ్ఞానముతో వర్తించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 214 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 10 🌴
10. brahmaṇy ādhāya karmāṇi saṅgaṁ tyaktvā karoti yaḥ
lipyate na sa pāpena padma-patram ivāmbhasā
🌷 Translation :
One who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water.
🌹 Purport :
Here brahmaṇi means in Kṛṣṇa consciousness. The material world is a sum total manifestation of the three modes of material nature, technically called the pradhāna. The Vedic hymns sarvaṁ hy etad brahma (Māṇḍūkya Upaniṣad 2), tasmād etad brahma nāma rūpam annaṁ ca jāyate (Muṇḍaka Upaniṣad 1.1.9), and, in the Bhagavad-gītā (14.3), mama yonir mahad brahma indicate that everything in the material world is a manifestation of Brahman; and although the effects are differently manifested, they are nondifferent from the cause.
In the Īśopaniṣad it is said that everything is related to the Supreme Brahman, or Kṛṣṇa, and thus everything belongs to Him only. One who knows perfectly well that everything belongs to Kṛṣṇa, that He is the proprietor of everything and that, therefore, everything is engaged in the service of the Lord, naturally has nothing to do with the results of his activities, whether virtuous or sinful. Even one’s material body, being a gift of the Lord for carrying out a particular type of action, can be engaged in Kṛṣṇa consciousness.
It is then beyond contamination by sinful reactions, exactly as the lotus leaf, though remaining in the water, is not wet. The Lord also says in the Gītā (3.30), mayi sarvāṇi karmāṇi sannyasya: “Resign all works unto Me [Kṛṣṇa].” The conclusion is that a person without Kṛṣṇa consciousness acts according to the concept of the material body and senses, but a person in Kṛṣṇa consciousness acts according to the knowledge that the body is the property of Kṛṣṇa and should therefore be engaged in the service of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2019