శ్రీమద్భగవద్గీత - 189: 04వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 189: Chap. 04, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 189 / Bhagavad-Gita - 189 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 27 🌴

27. సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||



🌷. తాత్పర్యం :

ఇంద్రియ,మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియకర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు.


🌷. భాష్యము :

పతంజలిచే సృష్టింపబడిన యోగపద్దతి ఇచ్చట తెలుపబడినది. పతంజలి యోగసూత్రములందు ఆత్మ “ప్రత్యగాత్మ” గా మరియు “పరాగాత్మ”గా పిలువబడును. ఇంద్రియభోగముతో సంగత్వము కలిగియున్నంతవరకు పరాగాత్మగా పిలువబడు ఆత్మ, అట్టి ఇంద్రియభోగము నుండి విడివడినంతనే ప్రత్యగాత్మగా పిలువబడును.

అట్టి ఆత్మ దేహమునందు పదిరకములైన వాయువులచే ప్రభావితమగుచుండును. ఈ విషయము ప్రాణాయామము ద్వారా తెలియగలదు. ఏ విధముగా దేహమందలి వాయువులు నియమింపబడి భౌతికసంగత్వము నుండి ఆత్మ శుధ్ధిపడుటకు దోహదము కాగలవో తెలిపెడి పద్ధతిని మనుజునకు ఈ పతంజలి యోగసిద్ధాంతము ఉపదేశించును. ఈ యోగసిద్దాంతము ప్రకారము ప్రత్యగాత్మయే చివరి లక్ష్యము.

అట్టి ప్రత్యగాత్మ భౌతికకర్మల నుండి విరమింపబడును. కర్ణములు శ్రవణమునందు, చక్షువులు దృశ్యమునందు, నాసిక ఘ్రాణమునందు, జిహ్వ రుచియందు, హస్తములు స్పర్శయందు లగ్నమయ్యెడి విధముగా ఇంద్రియములు ఇంద్రియార్థములందు లగ్నమై ఆత్మకు అన్యమైన కార్యములందు పాల్గొనును.

అవియన్నియు ప్రాణవాయువు కార్యములుగా పిలువబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, వ్యానవాయువు సంకోచ, వ్యాకోచములకు కారణమగును. సమానవాయువు సమానత్వము కొరకు కాగా, ఉదానవాయువు ఊర్ధ్వముగా ప్రసరించును. మనుజుడు జ్ఞానవంతుడైనపుదు వీటినన్నింటిని ఆత్మానుభవ అన్వేషణలో నియుక్తము కావించును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 189 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 27 🌴

27. sarvāṇīndriya-karmāṇi prāṇa-karmāṇi cāpare
ātma-saṁyama-yogāgnau juhvati jñāna-dīpite


🌷 Translation :

Others, who are interested in achieving self-realization through control of the mind and senses, offer the functions of all the senses, and of the life breath, as oblations into the fire of the controlled mind.


🌹 Purport :

The yoga system conceived by Patañjali is referred to herein. In the Yoga-sūtra of Patañjali, the soul is called pratyag-ātmā and parāg-ātmā. As long as the soul is attached to sense enjoyment it is called parāg-ātmā, but as soon as the same soul becomes detached from such sense enjoyment it is called pratyag-ātmā.

The soul is subjected to the functions of ten kinds of air at work within the body, and this is perceived through the breathing system. The Patañjali system of yoga instructs one on how to control the functions of the body’s air in a technical manner so that ultimately all the functions of the air within become favorable for purifying the soul of material attachment. According to this yoga system, pratyag-ātmā is the ultimate goal.

This pratyag-ātmā is withdrawn from activities in matter. The senses interact with the sense objects, like the ear for hearing, eyes for seeing, nose for smelling, tongue for tasting, and hand for touching, and all of them are thus engaged in activities outside the self. They are called the functions of the prāṇa-vāyu. The apāna-vāyu goes downwards, vyāna-vāyu acts to shrink and expand, samāna-vāyu adjusts equilibrium, udāna-vāyu goes upwards – and when one is enlightened, one engages all these in searching for self-realization.

🌹 🌹 🌹 🌹 🌹


5 Nov 2019