శ్రీమద్భగవద్గీత - 204: 04వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 204: Chap. 04, Ver. 42
🌹. శ్రీమద్భగవద్గీత - 204 / Bhagavad-Gita - 204 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 42 🌴
42. తస్మాదజ్ఞానసంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మన: |
ఛిత్వైనం సంశయం యోగమాతి ష్ఠోత్తిష్ట భారత ||
🌷. తాత్పర్యం :
కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారతా! యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!
🌷. భాష్యము :
ఈ అధ్యాయమున ఉపదేశింపబడిన యోగపద్ధతి సనాతనయోగము (జీవునిచే నిర్వహింపబడు నిత్యకర్మలు) అని పిలువబడును. ఈ యోగవిధానము రెండువిధములైన యజ్ఞకర్మలను కూడియుండును. అందు ఒకటి ద్రవ్యమయయజ్ఞమని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మయైనటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయయజ్ఞము ఆత్మానుభవముతో సంధింపబడనిచో అది భౌతికకర్మగా పరిణమించును. కాని అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక ఉద్దేశ్యముతో (భక్తియోగమునందు) నిర్వహించువాడు పూర్ణయజ్ఞమును కావించినవాడగును.
ఇక మనము ఆధ్యాత్మిక కర్మలను గూర్చి తెలిసికొనుట (స్వీయస్థితి) కాగా, రెండవది దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మికజ్ఞానమునందలి ఈ రెండు ముఖ్యవిభాగవములను సులభముగా అవగతము చేసికొనగలడు. అట్టివానికి ఆత్మ శ్రీకృష్ణభగవానుని దివ్యకర్మలను సులభముగా అవగతము చేసికొనగలడు కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభములో భగవానుని దివ్యకర్మలు అతని చేతనే చర్చించబడియున్నవి.
అట్టి గీతోపదేశమును అవగాహన చేసికొనలేనివాడు శ్రద్ధారహితునిగను మరియు భగవానునిచే ఒసగబడిన కొద్దిపాటి స్వాతంత్ర్యమును దుర్వినియోగాపరచినవాడుగను భావింపబడును. అట్టి ఉపదేశము లభించిన పిమ్మటయు సత్, చిత్, జ్ఞానస్వరూపునిగా శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వమును తెలిసికొనలేనివాడు నిక్కముగా గొప్ప మూర్ఖుడే. అట్టి అజ్ఞానము కృష్ణభక్తిభావన యందలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు.
శ్రీమధ్భగవద్గీత యందలి “దివ్యజ్ఞానము” అను చతుర్థాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 204 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 42 🌴
42. tasmād ajñāna-sambhūtaṁ hṛt-sthaṁ jñānāsinātmanaḥ
chittvainaṁ saṁśayaṁ yogam ātiṣṭhottiṣṭha bhārata
🌷 Translation :
Therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bhārata, stand and fight.
🌹 Purport :
The yoga system instructed in this chapter is called sanātana-yoga, or eternal activities performed by the living entity. This yoga has two divisions of sacrificial actions: one is called sacrifice of one’s material possessions, and the other is called knowledge of self, which is pure spiritual activity. If sacrifice of one’s material possessions is not dovetailed for spiritual realization, then such sacrifice becomes material. But one who performs such sacrifices with a spiritual objective, or in devotional service, makes a perfect sacrifice. When we come to spiritual activities, we find that these are also divided into two: namely, understanding of one’s own self (or one’s constitutional position), and the truth regarding the Supreme Personality of Godhead.
One who follows the path of Bhagavad-gītā as it is can very easily understand these two important divisions of spiritual knowledge. For him there is no difficulty in obtaining perfect knowledge of the self as part and parcel of the Lord. And such understanding is beneficial, for such a person can easily understand the transcendental activities of the Lord. In the beginning of this chapter, the transcendental activities of the Lord were discussed by the Supreme Lord Himself. One who does not understand the instructions of the Gītā is faithless, and is to be considered to be misusing the fragmental independence awarded to him by the Lord. In spite of such instructions, one who does not understand the real nature of the Lord as the eternal, blissful, all-knowing Personality of Godhead is certainly fool number one. Ignorance can be removed by gradual acceptance of the principles of Kṛṣṇa consciousness.
Thus end the Bhaktivedanta Purports to the Fourth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Transcendental Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
20 Nov 2019