🌹. శ్రీమద్భగవద్గీత - 186 / Bhagavad-Gita - 186 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 24 🌴
24. బ్రహ్మార్పణ బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ||
🌷. తాత్పర్యం :
కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొందితీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమేయైనటువంటి ఆధ్యాత్మికకర్మల యందు అతడు తత్పరుడై యుండుటచే అందులకు కారణము.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందలి కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మికగమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. కృష్ణభక్తి యందు పలుకార్యములు గలవు. అవియన్నియు రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణభక్తిభావన యందలి సిద్ధాంతము తెలుపబడినది. భౌతికత్వమున బద్దుడైన బద్ధజీవి భౌతికభావన యందే కర్మనొనరింప వలసి వచ్చినను ఏదియో ఒక విధముగా దాని నుండి అతడు ముక్తుడు కావాలసియున్నది. ఆ విధముగా బద్ధజీవుడు భౌతికభావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణభక్తిరసభావనము.
ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణుప్రీత్యర్థమై ఒనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతికజగమునందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై (కృష్ణభక్తిభావన యందు) నిర్వహింపబడునో అంట అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. “బ్రహ్మము” అనగా ఆధ్యాత్మికమని భావము. శ్రీకృష్ణభగవానుడే పరబ్రహ్మము. అతని దివ్యశరీరకాంతియే ఆధ్యాత్మికతెజమైన “బ్రహ్మజ్యోతి”గా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి యందే నిలిచియుండును.
కాని అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియభోగముచే కప్పుబడినప్పుడు భౌతికమని తెలియబడును. అట్టి భౌతికతెర కృష్ణభక్తిభావనచే శీఘ్రమే తొలాగబడుచున్నందున ఆ భావన యందు అర్పణము చేయబడునది, అట్టి అర్పణము స్వీకరించునది, అర్పణవిధానము, అర్పణము చేయువాడు, దాని ఫలములన్నియును బ్రహ్మమే(పరతత్త్వమే) అయియున్నవి.
మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికము కాగా, బ్రహ్మమునకు అనుసంధానము కావింపబడిన భౌతికపదార్థము ఆధ్యాత్మిక గుణము తిరిగి పొందును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 186 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 24 🌴
24. brahmārpaṇaṁ brahma havir brahmāgnau brahmaṇā hutam
brahmaiva tena gantavyaṁ brahma-karma-samādhinā
🌷 Translation :
A person who is fully absorbed in Kṛṣṇa consciousness is sure to attain the spiritual kingdom because of his full contribution to spiritual activities, in which the consummation is absolute and that which is offered is of the same spiritual nature.
🌹 Purport :
How activities in Kṛṣṇa consciousness can lead one ultimately to the spiritual goal is described here. There are various activities in Kṛṣṇa consciousness, and all of them will be described in the following verses. But, for the present, just the principle of Kṛṣṇa consciousness is described. A conditioned soul, entangled in material contamination, is sure to act in the material atmosphere, and yet he has to get out of such an environment. The process by which the conditioned soul can get out of the material atmosphere is Kṛṣṇa consciousness.
The materially absorbed conditioned soul can be cured by Kṛṣṇa consciousness as set forth here in the Gītā. This process is generally known as yajña, or activities (sacrifices) simply meant for the satisfaction of Viṣṇu, or Kṛṣṇa.
The more the activities of the material world are performed in Kṛṣṇa consciousness, or for Viṣṇu only, the more the atmosphere becomes spiritualized by complete absorption. The word brahma (Brahman) means “spiritual.” The Lord is spiritual, and the rays of His transcendental body are called brahma-jyotir, His spiritual effulgence. Everything that exists is situated in that brahma-jyotir, but when the jyotir is covered by illusion (māyā) or sense gratification, it is called material.
This material veil can be removed at once by Kṛṣṇa consciousness; thus the offering for the sake of Kṛṣṇa consciousness, the consuming agent of such an offering or contribution, the process of consumption, the contributor and the result are – all combined together – Brahman, or the Absolute Truth. The Absolute Truth covered by māyā is called matter.
🌹 🌹 🌹 🌹 🌹
2 Nov 2019