శ్రీమద్భగవద్గీత - 188: 04వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 188: Chap. 04, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 188 / Bhagavad-Gita - 188 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 26 🌴

26. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||


🌷. తాత్పర్యం :

కొందరు (నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు) శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్నియందు హోమము చేయగా, మరికొందరు (నియమితులైన గృహస్థులు) ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్ని యందు అర్పింతురు.


🌷. భాష్యము :

బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యను నాలుగు ఆశ్రమముల వారందరును ఉత్తమయోగులు లేదా ఆధ్యాత్మికులు కావలసియున్నది. మానవజన్మ జంతువు వలె ఇంద్రియభోగానుభవము పొందుట కొరకు కానందున మనుజుడు క్రమముగా ఆధ్యాత్మిమికజీవనమందు పరిపూర్ణుడయ్యెడి విధముగా నాలుగు ఆశ్రమములు ఏర్పాటు చేయబడియున్నవి. బ్రహ్మచారులు గురువాశ్రయములో ఇంద్రియభోగము నుండి విడివడుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు యత్నింతురు. శ్రవణమనునది అవగాహన కొరకు మూలసూత్రము గనుక బ్రహ్మచారి కేవలము కృష్ణపరములగు వచనములనే శ్రవణము చేయును.

అనగా అతడు శ్రీకృష్ణభగవానుని లీలల శ్రవణ, కీర్తనములందు సంపూర్ణముగా నిమగ్నుడై యుండును (హరేర్నామాను కీర్తనమ్). హరినామకీర్తనమును (హరేకృష్ణ మాహామంత్రము) మాత్రమే శ్రవణము చేయుచు అతడు ఇతర లౌకిక శబ్దముల నుండి విడివడియుండును. అదే విధముగా ఇంద్రియభోగమునకు అనుమతి కలిగియున్న గృహస్థులు కుడా అట్టి అనుమతిని అతి నియమముతో నిర్యహింతురు.

మైథునభోగము, మత్తుపదార్థముల స్వీకారము, మాంసభక్షణము లనునవి మానవుల సాధారణ నైజములు. కాని నియమితుడైన గృహస్థుడు అపరిమిత మైథునభోగమునందు మరియు ఇతర ఇంద్రియభోగములందు మగ్నుడు కాకుండును. మైథునజీవనము నియమించునది కావుననే ధర్మసమ్మతమైన వివాహము నాగరికసమాజము నందు వ్యాప్తి నొందియున్నది. నియమితుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనము కొరకు తన సాధారణ స్వభావమైన ఇంద్రియప్రీతిని అట్టి నియమితమైన సంగత్వరహిత మైథునజీవనము కూడా ఒక విధమైన యజ్ఞమే అయియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 188 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 26 🌴


26. śrotrādīnīndriyāṇy anye saṁyamāgniṣu juhvati
śabdādīn viṣayān anya indriyāgniṣu juhvati



🌷 Translation :

Some [the unadulterated brahmacārīs] sacrifice the hearing process and the senses in the fire of mental control, and others [the regulated householders] sacrifice the objects of the senses in the fire of the senses.


🌹 Purport :

The members of the four divisions of human life, namely the brahmacārī, the gṛhastha, the vānaprastha and the sannyāsī, are all meant to become perfect yogīs or transcendentalists. Since human life is not meant for our enjoying sense gratification like the animals, the four orders of human life are so arranged that one may become perfect in spiritual life. The brahmacārīs, or students under the care of a bona fide spiritual master, control the mind by abstaining from sense gratification.

A brahmacārī hears only words concerning Kṛṣṇa consciousness; hearing is the basic principle for understanding, and therefore the pure brahmacārī engages fully in harer nāmānukīrtanam – chanting and hearing the glories of the Lord. He restrains himself from the vibrations of material sounds, and his hearing is engaged in the transcendental sound vibration of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa. Similarly, the householders, who have some license for sense gratification, perform such acts with great restraint.

Sex life, intoxication and meat-eating are general tendencies of human society, but a regulated householder does not indulge in unrestricted sex life and other sense gratification. Marriage on the principles of religious life is therefore current in all civilized human society because that is the way for restricted sex life. This restricted, unattached sex life is also a kind of yajña because the restricted householder sacrifices his general tendency toward sense gratification for higher, transcendental life.

🌹 🌹 🌹 🌹 🌹


4 Nov 2019