శ్రీమద్భగవద్గీత - 202: 04వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 202: Chap. 04, Ver. 40


🌹. శ్రీమద్భగవద్గీత - 202 / Bhagavad-Gita - 202 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 40 🌴

40. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన: ||


🌷. తాత్పర్యం :

శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైనవారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.


🌷. భాష్యము :

అధికారికములు మరియు ప్రామాణికములు అగు పెక్కు శాస్తములలో భగవద్గీత శ్రేష్ఠమైనది. జంతుప్రాయులైన మనుజులకు శాస్త్రములందు శ్రద్ధకాని, జ్ఞానము కాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రముల యెడ కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్రవచనములపై సంపూర్ణ విశ్వాసముండదు.

మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల యెడ శ్రద్ధను కలిగియున్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని, అతనిని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనులు మరియు సంశయాత్ములైనవారు ఎన్నడును పురోభివృద్ధిని పొందలేరు. దైవమునందు, అతని వచనమునందు శ్రద్ధలేనివారు ఇహపరములందు ఎట్టి శుభమును బడయజాలరు. కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమములను పాటించుచు జ్ఞానస్థాయికి ఎదుగవలెను.

కేవలము అట్టి జ్ఞానమే ఆధ్యాత్మికావగాహనపు దివ్యస్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్థులకు ఆధ్యాత్మికరంగమునందు ఎట్టి స్థానము లేదు. కనుక ప్రతియొక్కరు పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యల అడుగుజాడల ననుసరించి విజయమును సాధింపవలెను.


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 202 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 40 🌴

40. ajñaś cāśraddadhānaś ca saṁśayātmā vinaśyati
nāyaṁ loko ’sti na paro na sukhaṁ saṁśayātmanaḥ



🌷 Translation :

But ignorant and faithless persons who doubt the revealed scriptures do not attain God consciousness; they fall down. For the doubting soul there is happiness neither in this world nor in the next.

🌹 Purport :

Out of many standard and authoritative revealed scriptures, the Bhagavad-gītā is the best. Persons who are almost like animals have no faith in, or knowledge of, the standard revealed scriptures; and some, even though they have knowledge of, or can cite passages from, the revealed scriptures, have actually no faith in these words.

And even though others may have faith in scriptures like Bhagavad-gītā, they do not believe in or worship the Personality of Godhead, Śrī Kṛṣṇa. Such persons cannot have any standing in Kṛṣṇa consciousness. They fall down. Out of all the above-mentioned persons, those who have no faith and are always doubtful make no progress at all. Men without faith in God and His revealed word find no good in this world, nor in the next. For them there is no happiness whatsoever.

One should therefore follow the principles of revealed scriptures with faith and thereby be raised to the platform of knowledge. Only this knowledge will help one become promoted to the transcendental platform of spiritual understanding. In other words, doubtful persons have no status whatsoever in spiritual emancipation. One should therefore follow in the footsteps of great ācāryas who are in the disciplic succession and thereby attain success.

🌹 🌹 🌹 🌹 🌹


18 Nov 2019