శ్రీమద్భగవద్గీత - 193: 04వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 193: Chap. 04, Ver. 31
🌹. శ్రీమద్భగవద్గీత -193 / Bhagavad-Gita - 193 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 31 🌴
31. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్య: కురుసత్తమ |
🌷. తాత్పర్యం :
ఓ కురువంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకముగాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?
🌷. భాష్యము :
జీవుడు ఎటువంటి భౌతికస్థితి యందున్నప్పటికిని తన నిజస్థితి యెడ జ్ఞానరహితుడైన యుండును. అనగా పాపజన్మల ఫలముల వలననే భౌతికజగమునందు అస్తిత్వము కలుగుచున్నది. అజ్ఞానము పాపజన్మకు కారణము కాగ, పాపజీవనము మనుజుడు భౌతికత్వమున కొనసాగుటకు కారణమగుచున్నది.
అట్టి భవబంధము నుండి ముక్తిని సాధించుటకు మానవజన్మ యొక్కటే సరియైన మార్గమే యున్నది. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియభోగము, అంత్యమున దుర్భరస్థితి నుండి సంపూర్ణముగా విముక్తి యనెడి మార్గములను చూపుట ద్వారా మనలకు ఒక అవకాశము నొసగుచున్నది.
ధర్మమార్గము (ఇంతవరకు తెలుపబడిన వివిధయజ్ఞ నిర్వహణములు) మన సర్వ ఆర్ధిక పరిస్థితులను అప్రయత్నముగా చక్కబరచగలదు. జనాభివృద్ధి అధికముగా నున్నను యజ్ననిర్వాహణము ద్వారా సమృద్ధిగాగా ఆహారము, పాలు ఆదివి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పడు ఇంద్రియభోగానుభవ భావన కలుగును. కనుకనే వేదములు నియమిత భోగానుభవము కొరకై పవిత్ర వివాహపద్ధతిని నిర్దేశించుచున్నవి.
తద్ద్వార మనుజుడు క్రమముగా భౌతికబంధము నుండి ముక్తుడై ఉన్నతస్థితిని చేరును. అట్టి ముక్తస్థితి యందలి సంపూర్ణత్వమే భగవానునితో సాహచర్యము. పూర్వము వివరించినట్లు అటువంటి సంపూర్ణత్వము యజ్ఞనిర్వాహణము ద్వారానే లభించగలదు. అట్లు వేదములు తెలిపినరీతిగా యజ్ఞమును నిర్వహించుట యందు మనుజడు అనురక్తుడు కానిచో ఈ జన్మమునందైనను సుఖమయ జీవనము ఊహింపలేడు.
ఇక వేరే దేహముతో ఇంకొక లోకమునందు సౌఖ్యమును గూర్చి తెలుపుదనేమున్నది? వివిధయజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును గూర్చుటకు స్వర్గలోకములందు వివిధప్రమాణములలో భౌతికసుఖములు గలవు. కాని కృష్ణభక్తిని చేయుట ద్వారా ఆధ్యాత్మికలోకమును పొందుటయే మానవునికి అత్యంత ఉత్కృష్టమైన ఆనందమై యున్నది. కనుకనే కృష్ణభక్తిరసభావనము సర్వభవక్లేశములకు దివ్యమైన పరిష్కారమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 193 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 31 🌴
31. nāyaṁ loko ’sty ayajñasya kuto ’nyaḥ kuru-sattama
🌷 Translation :
O best of the Kuru dynasty, without sacrifice one can never live happily on this planet or in this life: what then of the next?
🌹 Purport :
Whatever form of material existence one is in, one is invariably ignorant of his real situation. In other words, existence in the material world is due to the multiple reactions to our sinful lives. Ignorance is the cause of sinful life, and sinful life is the cause of one’s dragging on in material existence. The human form of life is the only loophole by which one may get out of this entanglement. The Vedas, therefore, give us a chance for escape by pointing out the paths of religion, economic comfort, regulated sense gratification and, at last, the means to get out of the miserable condition entirely.
The path of religion, or the different kinds of sacrifice recommended above, automatically solves our economic problems. By performance of yajña we can have enough food, enough milk, etc. – even if there is a so-called increase of population. When the body is fully supplied, naturally the next stage is to satisfy the senses. The Vedas prescribe, therefore, sacred marriage for regulated sense gratification.
Thereby one is gradually elevated to the platform of release from material bondage, and the highest perfection of liberated life is to associate with the Supreme Lord. Perfection is achieved by performance of yajña (sacrifice). Now, if a person is not inclined to perform yajña according to the Vedas, how can he expect a happy life even in this body, and what to speak of another body on another planet?
There are different grades of material comforts in different heavenly planets, and in all cases there is immense happiness for persons engaged in different kinds of yajña. But the highest kind of happiness that a man can achieve is to be promoted to the spiritual planets by practice of Kṛṣṇa consciousness. Is therefore the solution to all the problems of material existence
🌹 🌹 🌹 🌹 🌹
9 Nov 2019