శ్రీమద్భగవద్గీత - 206: 05వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 206: Chap. 05, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 206 / Bhagavad-Gita - 206 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 02 🌴



02. శ్రీ భగవానువాచ

సన్న్యాస: కర్మయోగాశ్చ ని:శ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు సమాధానమొసగెను; కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మపరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది.


🌷. భాష్యము :

కామ్యకర్మలు (ఇంద్రియప్రీతిని కోరునటువంటి) భవబంధమునకు కారణములై యున్నవి. దేహసౌఖ్యము పెంపొందించుకొను ఉద్దేశ్యముతో కర్మల నొనరించునంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. శ్రీమద్భాగవతము(5.5.4-6) ఈ విషయమునే ఇట్లు నిర్ధారణ చేసినది.

“ఇంద్రియప్రీతి యెడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుతదేహము గత కర్మఫలముగా లభించినదే యని తెలిసికొనజాలడు. ఈ దేహము ఆశాశ్వతమైనను ఉన్నంతకాలము జీవుని అది అనేకరకములుగా భాధించును. కనుక ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట సరియైనది కాదు. మనుజడు తన నిజస్థితి గూర్చి ప్రశ్నించనంతకాలము జీవితములో పరాజయమును పొందినట్లుగా భావింపబడును. అతడు తన నిజస్థితిని ఎరుగనంతవరకు ఇంద్రియప్రీతికై ఫలముల నాశించి కర్మ యందు వర్తించవలసివచ్చును. అట్టి ఇంద్రియభోగానుభవ భావములో నున్నంతకాలము అతడు వివిధయోనుల యందు పరిభ్రమించవలసినదే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను ఏదియో ఒక విధముగా ప్రతియొక్కరు వాసుదేవుని భక్తియుతసేవ యెడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవ్వరైనను భవబంధము నుండి ముక్తిని పొందు అవకాశమును పొందగలరు.”

కావున జ్ఞానమొక్కటే(నేను దేహమున గాక ఆత్మననెడి జ్ఞానము) ముక్తికి సరిపోదు. అట్టి జ్ఞానముతో పాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధము నుండి తప్పించుకొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కాని కృష్ణభక్తిరసభావనమునందు ఒనరింపబడు కర్మ కామ్యకర్మ వంటిది కాదు. పూర్ణజ్ఞానముతో ఒనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృడవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణభక్తిభావన లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట యనునది బద్ధజీవుని హృదయమును పవిత్రము చేయజాలదు. హృదయము పవిత్రము కానంతవరకు మనుజుడు కామ్యభావనలో కర్మలను ఒనరింపవలసి వచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 206 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 02 🌴



02. śrī-bhagavān uvāca

sannyāsaḥ karma-yogaś ca niḥśreyasa-karāv ubhau
tayos tu karma-sannyāsā karma-yogo viśiṣyate


🌷 Translation :

The Personality of Godhead replied: The renunciation of work and work in devotion are both good for liberation. But, of the two, work in devotional service is better than renunciation of work.

🌹 Purport :

Fruitive activities (seeking sense gratification) are cause for material bondage. As long as one is engaged in activities aimed at improving the standard of bodily comfort, one is sure to transmigrate to different types of bodies, thereby continuing material bondage perpetually.

“People are mad after sense gratification, and they do not know that this present body, which is full of miseries, is a result of one’s fruitive activities in the past. Although this body is temporary, it is always giving one trouble in many ways. Therefore, to act for sense gratification is not good. One is considered to be a failure in life as long as he makes no inquiry about his real identity. As long as he does not know his real identity, he has to work for fruitive results for sense gratification, and as long as one is engrossed in the consciousness of sense gratification one has to transmigrate from one body to another.

Although the mind may be engrossed in fruitive activities and influenced by ignorance, one must develop a love for devotional service to Vāsudeva. Only then can one have the opportunity to get out of the bondage of material existence.” Therefore, jñāna (or knowledge that one is not this material body but spirit soul) is not sufficient for liberation. One has to act in the status of spirit soul, otherwise there is no escape from material bondage.


Continues..

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2019