శ్రీమద్భగవద్గీత - 197: 04వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 197: Chap. 04, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 197 / Bhagavad-Gita - 197 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 35 🌴

35. యద్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |
యేన భూతాన్య శేషాణి ద్రక్ష్య స్యాత్మన్యథో మయి ||


🌷. తాత్పర్యం :

ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్తజీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మొహమునకు గురికావు.


🌷. భాష్యము :

జీవులందరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశలని ఎరుగగలుగుటయే ఆత్మదర్శియైన మహాత్ముని(ఉన్నది ఉన్నట్లుగా గాంచగలిగిన సత్యదర్శి) నుండి జ్ఞానమును పొందుట వలన కలిగెడి ఫలితమై యున్నది. కృష్ణుని నుండి విడివడియున్న స్థితి యొక్క భావనయే మాయ(మా – కాదు, యా – ఇది) యనబడును. అయినను కొందరు మాకు కృష్ణునితో సంబంధము లేదనియు, అతడు కేవలము ఒక చారిత్రాత్మకపురుషుడు మాత్రమే యనియు మరియు పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మమే యనియు భావింతురు. కాని వాస్తవమునాకు భగవద్గీత యందు తెలుపబడిన రీతిగా నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని శరీరకాంతియై యున్నది. పూర్ణపురుషోత్తమునిగా శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమైయున్నాడు.

శ్రీకృష్ణుడే సమస్త కారణములకు కారణమైన దేవదేవుడని బ్రహ్మసంహిత యందు స్పష్టముగా తెలుపబడినది. లక్షలాదిగానున్న అవతారములన్నియును అతని భిన్నవిస్తారములై యున్నవి. అదే విధముగా జీవులు సైతము ఆ శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి వివిధ విస్తారములందు తన మూలస్థితిని కోల్పోవునని మయావాద తత్త్వవేత్తలు తప్పుగా భావింతురు.

వాస్తవమునకు అట్టి భావనము కేవలము భౌతికమైనది. దేనినైనను ముక్కలుగా విభజించినచో అది తన మూలరూపమును కోల్పోవుననుట ఈ భౌతికజగత్తు యొక్క అనుభవమై యున్నది. కాని పరతత్త్వమనగా ఒకటిని ఒకటితో కలుపగా ఒకటిగా నుండునదనియు మరియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటిగనే నిలుచునటువంటిదనియు వారు ఎరుగజాలరు. కాని ఆధ్యాత్మికజగము సమస్తము ఏ రీతిగానే ఉండును.

పరతత్త్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మాయచే కప్పబడి మనము కృష్ణుని నుండి వేరనెడి భావనను కలిగియుందుము. మనము శ్రీకృష్ణుని నుండి విదివదిన అంశలమైనను అతని నుండి భిన్నులము కాము. జీవుల దేహభేదములు మాయయేగాని వాస్తావము కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 197 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 35 🌴


35. yaj jñātvā na punar moham evaṁ yāsyasi pāṇḍava
yena bhūtāny aśeṣāṇi drakṣyasy ātmany atho mayi


🌷 Translation :

Having obtained real knowledge from a self-realized soul, you will never fall again into such illusion, for by this knowledge you will see that all living beings are but part of the Supreme, or, in other words, that they are Mine.

🌹 Purport :

The result of receiving knowledge from a self-realized soul, or one who knows things as they are, is learning that all living beings are parts and parcels of the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa. The sense of an existence separate from Kṛṣṇa is called māyā (mā – not, yā – this).

Some think that we have nothing to do with Kṛṣṇa, that Kṛṣṇa is only a great historical personality and that the Absolute is the impersonal Brahman. Factually, as it is stated in the Bhagavad-gītā, this impersonal Brahman is the personal effulgence of Kṛṣṇa. Kṛṣṇa, as the Supreme Personality of Godhead, is the cause of everything. In the Brahma-saṁhitā it is clearly stated that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the cause of all causes. Even the millions of incarnations are only His different expansions.

Similarly, the living entities are also expansions of Kṛṣṇa. The Māyāvādī philosophers wrongly think that Kṛṣṇa loses His own separate existence in His many expansions. This thought is material in nature. We have experience in the material world that a thing, when fragmentally distributed, loses its own original identity. But the Māyāvādī philosophers fail to understand that absolute means that one plus one is equal to one, and that one minus one is also equal to one. This is the case in the absolute world.

For want of sufficient knowledge in the absolute science, we are now covered with illusion, and therefore we think that we are separate from Kṛṣṇa. Although we are separated parts of Kṛṣṇa, we are nevertheless not different from Him. The bodily difference of the living entities is māyā, or not actual fact.

🌹 🌹 🌹 🌹 🌹


13 Nov 2019