శ్రీమద్భగవద్గీత - 207: 05వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 207: Chap. 05, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 207 / Bhagavad-Gita - 207 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 03 🌴


03. జ్ఞేయ: స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ ప్రముచ్యతే ||

🌷. తాత్పర్యం :

కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకికబంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైనవాడు కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనందున నిత్యసన్న్యాసియై యున్నాడు. శ్రీకృష్ణునితో తనకు గల నిత్యసంబంధమున తన నిజస్థితి ఎరిగియున్న కారణముగా భక్తియుతసేవకు అంకితుడై యుండు అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై యుండును. శ్రీ కృష్ణుడు పూర్ణుడనియు మరియు తాని అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా నెరిగియుండును. అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణరీతిని సరియై యున్నందున సమగ్రజ్ఞానమై యున్నది.

అంశలు ఏనాడును పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వమనెడి భావనము ఎన్నడును సరియైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగనే సమానుడు గాని పరిమాణరీతిని కాదనెడి నిజమైన ఆధ్యాత్మికజ్ఞానము కోరికలు, చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సు నందు ద్వంద్వములు పొడసూపవు. ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతికజగమునందును ముక్తుడై యుండగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 207 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 03 🌴


03. jñeyaḥ sa nitya-sannyāsī yo na dveṣṭi na kāṅkṣati
nirdvandvo hi mahā-bāho sukhaṁ bandhāt pramucyate

🌷 Translation :

One who neither hates nor desires the fruits of his activities is known to be always renounced. Such a person, free from all dualities, easily overcomes material bondage and is completely liberated, O mighty-armed Arjuna.

🌹 Purport :

One who is fully in Kṛṣṇa consciousness is always a renouncer because he feels neither hatred nor desire for the results of his actions. Such a renouncer, dedicated to the transcendental loving service of the Lord, is fully qualified in knowledge because he knows his constitutional position in his relationship with Kṛṣṇa. He knows fully well that Kṛṣṇa is the whole and that he is part and parcel of Kṛṣṇa.

Such knowledge is perfect because it is qualitatively and quantitatively correct. The concept of oneness with Kṛṣṇa is incorrect because the part cannot be equal to the whole. Knowledge that one is one in quality yet different in quantity is correct transcendental knowledge leading one to become full in himself, having nothing to aspire to or lament over. There is no duality in his mind because whatever he does, he does for Kṛṣṇa. Being thus freed from the platform of dualities, he is liberated – even in this material world.

🌹 🌹 🌹 🌹 🌹


23 Nov 2019