శ్రీమద్భగవద్గీత - 216: 05వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 216: Chap. 05, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 216 / Bhagavad-Gita - 216 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 12 🌴

12. యుక్త: కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్ |
అయుక్త: కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||


🌷. తాత్పర్యం :

స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మఫలము యెడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మనుజుడు బద్ధుడగును.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావితుడు మరియు దేహభావన యందున్నవాడు అనెడి ఇరువురి నడుమగల భేదమేమనగా మొదటివాడు కృష్ణునితో సదా కూడియుండగా, రెండవవాడు తన కర్మఫలము యెడ ఆసక్తుడై యుండును. కృష్ణుని యెడ ఆసక్తుడై యుండి కేవలము అతని కొరకే కర్మనొనరించువాడు నిక్కముగా ముక్తపురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యెడ ఎటువంటి చింతను కలిగియుండడు. ద్వైతభావనలో అనగా పరతత్త్వము యొక్క జ్ఞానరాహిత్యముతో కర్మనొనరించుటయే కర్మఫలముల యెడ చింతకు కారణమని శ్రీమధ్భాగవతము నందు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము.

అట్టి శ్రీకృష్ణుని భక్తి యందు ద్వైతభావనము లేదు. సర్వము సర్వశుభకరుడైన శ్రీకృష్ణుని శక్తిఫలమే అయినందున కృష్ణపరకర్మలన్నియును ఆధ్యాత్మికతను సంతరించుకొని దివ్యములు మరియు భౌతికప్రభావరహితములును అయియున్నవి. కనుకనే కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణశాంతితో నిండియుండును. కాని ఇంద్రియప్రీతి కొరకు లాభగణనలో మునిగినవాడు అట్టి శాంతిని పొందలేడు. అనగా కృష్ణునికి అన్యముగా వేరేదియును లేదనెడి అవగాహనయే శాంతికి మరియు అభయత్వమునకు ఆధారమై యున్నది. ఇదియే కృష్ణభక్తిరసభావన యందలి రహస్యము.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 216 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 12 🌴

12. yuktaḥ karma-phalaṁ tyaktvā śāntim āpnoti naiṣṭhikīm
ayuktaḥ kāma-kāreṇa phale sakto nibadhyate


🌷 Translation :

The steadily devoted soul attains unadulterated peace because he offers the result of all activities to Me; whereas a person who is not in union with the Divine, who is greedy for the fruits of his labor, becomes entangled.

🌹 Purport :

The difference between a person in Kṛṣṇa consciousness and a person in bodily consciousness is that the former is attached to Kṛṣṇa whereas the latter is attached to the results of his activities. The person who is attached to Kṛṣṇa and works for Him only is certainly a liberated person, and he has no anxiety over the results of his work.

In the Bhāgavatam, the cause of anxiety over the result of an activity is explained as being one’s functioning in the conception of duality, that is, without knowledge of the Absolute Truth. Kṛṣṇa is the Supreme Absolute Truth, the Personality of Godhead. In Kṛṣṇa consciousness, there is no duality. All that exists is a product of Kṛṣṇa’s energy, and Kṛṣṇa is all good.

Therefore, activities in Kṛṣṇa consciousness are on the absolute plane; they are transcendental and have no material effect. One is therefore filled with peace in Kṛṣṇa consciousness. But one who is entangled in profit calculation for sense gratification cannot have that peace. This is the secret of Kṛṣṇa consciousness – realization that there is no existence besides Kṛṣṇa is the platform of peace and fearlessness.

🌹 🌹 🌹 🌹 🌹


1 Dec 2019