శ్రీమద్భగవద్గీత - 199: 04వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 199: Chap. 04, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 199 / Bhagavad-Gita - 199 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 37 🌴

37. యథైధాంసి సమిద్ధో(గ్నిర్భస్మసాత్ కురుతేర్జున |
జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ||



🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలముల నన్నింటిని బూడిదగా చేసివేయును.


🌷. భాష్యము :

ఆత్మ, పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణజ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనే గాక పుణ్యకర్మఫలములను కూడా భస్మీపాటలము కావించును. కలుగబోవు ఫలము, ఫలవంతమగుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచితఫలమనుచు కర్మఫలము లందు అనేక స్థితులు కలవు. కాని జీవుని నిజస్థితి యొక్క జ్ఞానము సమస్తమును భస్మము చేయగలదు.

మనుజుడు జ్ఞానవంతుడైనపుడు సంచిత, ప్రారబ్దాది సర్వకర్మఫలములు నశించిపోవును. కనుకనే బృహదారణ్యకోపనిషత్తు (4.4.22) నందు “ఉభే ఉహైవైష ఏతే తరత్వమృత: సాధ్వసాధూనీ – పుణ్య, పాపకర్మఫలములు రెండింటిని మనుజుడు అధిగమించును” అని తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 199 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 4 - Jnana Yoga - 37 🌴

37. yathaidhāṁsi samiddho ’gnir bhasma-sāt kurute ’rjuna
jñānāgniḥ sarva-karmāṇi bhasma-sāt kurute tathā



🌷 Translation :

As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.


🌹 Purport :

Perfect knowledge of self and Superself and of their relationship is compared herein to fire. This fire not only burns up all reactions to impious activities, but also all reactions to pious activities, turning them to ashes. There are many stages of reaction: reaction in the making, reaction fructifying, reaction already achieved, and reaction a priori.

But knowledge of the constitutional position of the living entity burns everything to ashes. When one is in complete knowledge, all reactions, both a priori and a posteriori, are consumed. In the Vedas (Bṛhad-āraṇyaka Upaniṣad 4.4.22) it is stated, ubhe uhaivaiṣa ete taraty amṛtaḥ sādhv-asādhūnī: “One overcomes both the pious and impious reactions of work.”

🌹 🌹 🌹 🌹 🌹


15 Nov 2019