శ్రీమద్భగవద్గీత - 191: 04వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 191: Chap. 04, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 191 / Bhagavad-Gita - 191 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 29 🌴


29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే(పానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణా: |
అపరే నియతాహారా: ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి

🌷. తాత్పర్యం :

ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి, శ్వాసను సంపూర్ణముగా బంధించి, అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు.

🌷. భాష్యము :

శ్వాసను నియమించునట్టి ఈ యోగాపద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగపద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగమునందలి ప్రారంభదశలో ఆచరింపబడును. ఇంద్రియనిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మికానుభవ పురోగతి కొరకు ఈ విధానములన్నియును ఉద్దేశింపబడినవి. దేహమునందలి వాయువులను నియమించి, వాటిని వాటి విరుద్ధదశలో ప్రసరింపజేయుట ఈ యోగపద్ధతి యందు యత్నింపబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, ప్రాణవాయువు ఊర్థ్వముగా ప్రసరించును.

ఈ రెండు వాయువులు విరుద్ధదశలలో ప్రసరించి, చివరికి పురాకమందు తటస్థము నొందురీతిగా ప్రాణాయామయోగి యత్నించును. ఉచ్చ్వాసమును నిశ్వాసమునందు అర్పించుట యనుననిది రేచకము. ప్రాణాపానవాయుల చలనము సంపూర్ణముగా స్తంభించినప్పుడు మనుజుడు కుంభకయోగమునందు ఉన్నట్లుగా తెలుపబడును. అట్టి కుంభకయోగము ద్వారా ఆధ్యాత్మికజీవన సంపూర్ణత్వమునకై మనుజుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. బుద్ధిమంతుడైన యోగి మరొకజన్మకై వేచియుండక ఈ జన్మమునందే పూర్ణత్వమును సాధించుట యందు అనురక్తుడై యుండును.

దాని కొరకై యోగి కుంభకయోగము ద్వారా జీవనపరిమాణమును అనేక సంవత్సరములు వృద్ధిచేసికొనును. కాని కృష్ణభక్తిభావన యందున్న భక్తుడు సదా శ్రీకృష్ణభగవానుని దివ్యసేవ యందు నిలిచియున్నందున అప్రయత్నముగా ఇంద్రియములపై నియమమును కలిగియే యుండును. సదా కృష్ణుని సేవలో నియుక్తములై యున్నందున అతని ఇంద్రియములు ఇతర కర్మలలో నిలుచు అవకాశముండదు. అట్టి భక్తుడు దేహత్యాగానంతరము సహజముగా శ్రీకృష్ణుని ధామమునకే పోవును గనుక జీవితపరిమాణమును పొడిగించు యత్నములు ఎన్నడును చేయడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 191 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 29 🌴

29. apāne juhvati prāṇaṁ prāṇe ’pānaṁ tathāpare
prāṇāpāna-gatī ruddhvā prāṇāyāma-parāyaṇāḥ
apare niyatāhārāḥ prāṇān prāṇeṣu juhvati



🌷 Translation :

Still others, who are inclined to the process of breath restraint to remain in trance, practice by offering the movement of the outgoing breath into the incoming, and the incoming breath into the outgoing, and thus at last remain in trance, stopping all breathing. Others, curtailing the eating process, offer the outgoing breath into itself as a sacrifice.

🌹 Purport :

This system of yoga for controlling the breathing process is called prāṇāyāma, and in the beginning it is practiced in the haṭha-yoga system through different sitting postures. All of these processes are recommended for controlling the senses and for advancement in spiritual realization. This practice involves controlling the airs within the body so as to reverse the directions of their passage. The apāna air goes downward, and the prāṇa air goes up. The prāṇāyāma-yogī practices breathing the opposite way until the currents are neutralized into pūraka, equilibrium. Offering the exhaled breath into the inhaled breath is called recaka. When both air currents are completely stopped, one is said to be in kumbhaka-yoga.

By practice of kumbhaka-yoga, one can increase the duration of life for perfection in spiritual realization. The intelligent yogī is interested in attaining perfection in one life, without waiting for the next. For by practicing kumbhaka-yoga, the yogīs increase the duration of life by many, many years. A Kṛṣṇa conscious person, however, being always situated in the transcendental loving service of the Lord, automatically becomes the controller of the senses. His senses, being always engaged in the service of Kṛṣṇa, have no chance of becoming otherwise engaged. So at the end of life, he is naturally transferred to the transcendental plane of Lord Kṛṣṇa; consequently he makes no attempt to increase his longevity.

🌹 🌹 🌹 🌹 🌹


7 Nov 2019