శ్రీమద్భగవద్గీత - 215: 05వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 215: Chap. 05, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 215 / Bhagavad-Gita - 215 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 11 🌴

11. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి |
యోగిన: కర్మ కుర్వన్తి సజ్ఞం త్యక్త్వాత్మశుద్ధయే


🌷. తాత్పర్యం :

యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు.

🌷. భాష్యము :

యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయైనను భౌతికకల్మషము నుండి పవిత్రమగును. అనగా కృష్ణభక్తిపరాయణుడు ఒనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబోవు. కనుకనే సదాచారములని పిలువబడు పవిత్రకర్మలను కృష్ణభక్తిభావన యందు నిలిచి సులభముగా నిర్వహింపవచ్చును. భక్తిరసామృతసింధువు (1.2.187) నందు ఈ విషయమును రూపగోస్వామిని ఇట్లు వివరించియుండిరి.


ఈహా యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిరా |
నిఖిలాస్వపి అవస్థాసూ జీవన్ముక్త: స ఉచ్యతే

“దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే కృష్ణభక్తిరసభావన యందు వర్తించెడివాడు(కృష్ణ సేవానురక్తుడు) పలు నామమాత్ర లౌకికకర్మల యందు నియుక్తుడైనప్పటికిని భౌతికజగమున ముక్తపురుషుడే యగును.” దేహాత్మభావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనది కాదనియు అతడు సంపూర్ణముగా నెరుగును.

తాను కృష్ణునికి చెందినవాడు కనుక తన దేహము సైతము కృష్ణునిదే యని అతడు భావించును. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము మొదలగు సమస్తమును కృష్ణుని సేవ యందే వినియోగించుటచే అతడు శీఘ్రమే కృష్ణునితో సన్నిహితత్వమును పొందును. కృష్ణునితో అతడు ఏకత్వమును కలిగియుండి, దేహాత్మభావనము వంటివి కలిగించు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. ఇదియే కృష్ణభక్తిరసభావనమందలి పూర్ణత్వస్థితియై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 215 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 11 🌴

11. kāyena manasā buddhyā kevalair indriyair api
yoginaḥ karma kurvanti saṅgaṁ tyaktvātma-śuddhaye


🌷 Translation :

The yogīs, abandoning attachment, act with body, mind, intelligence and even with the senses, only for the purpose of purification.

🌹 Purport :

When one acts in Kṛṣṇa consciousness for the satisfaction of the senses of Kṛṣṇa, any action, whether of the body, mind, intelligence or even the senses, is purified of material contamination. There are no material reactions resulting from the activities of a Kṛṣṇa conscious person.

Therefore purified activities, which are generally called sad-ācāra, can be easily performed by acting in Kṛṣṇa consciousness. Śrī Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu (1.2.187) describes this as follows:


īhā yasya harer dāsye karmaṇā manasā girā
nikhilāsv apy avasthāsu jīvan-muktaḥ sa ucyate

“A person acting in Kṛṣṇa consciousness (or, in other words, in the service of Kṛṣṇa) with his body, mind, intelligence and words is a liberated person even within the material world, although he may be engaged in many so-called material activities.”

He has no false ego, for he does not believe that he is this material body, or that he possesses the body. He knows that he is not this body and that this body does not belong to him. He himself belongs to Kṛṣṇa, and the body too belongs to Kṛṣṇa. When he applies everything produced of the body, mind, intelligence, words, life, wealth, etc. – whatever he may have within his possession – to Kṛṣṇa’s service, he is at once dovetailed with Kṛṣṇa. He is one with Kṛṣṇa and is devoid of the false ego that leads one to believe that he is the body, etc. This is the perfect stage of Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 213: 05వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 213: Chap. 05, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 213 / Bhagavad-Gita - 213 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 09 🌴

09. ప్రలవన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||


🌷. తాత్పర్యం :

మాట్లాడునప్పుడు, గ్రహించునప్పుడు, విసర్జించునప్పుడు, కనులుతెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించు చున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగి యుండును.


🌷. భాష్యము :

చూచుట మరియు వినుట వంటి కర్మలు జ్ఞానసముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట మొదలగు ఇంద్రియకర్మలచే ఎన్నడును ప్రభావితుడు కాడు.

అట్టి భక్తుడు తాను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనని ఎరిగి యుండుటచే ఆ భగవానుని సేవ తప్ప అన్యకార్యమును చేయకుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 213 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 09 🌴

09. pralapan visṛjan gṛhṇann unmiṣan nimiṣann api
indriyāṇīndriyārtheṣu vartanta iti dhārayan


🌷 Translation :

Because while speaking, evacuating, receiving, or opening or closing his eyes, he always knows that only the material senses are engaged with their objects and that he is aloof from them.

🌹 Purport :

Activities such as seeing and hearing are actions of the senses meant for receiving knowledge, whereas moving, speaking, evacuating, etc., are actions of the senses meant for work. A Kṛṣṇa conscious person is never affected by the actions of the senses.

He cannot perform any act except in the service of the Lord because he knows that he is the eternal servitor of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 214: 05వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 214: Chap. 05, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 214 / Bhagavad-Gita - 214 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 10 🌴

10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వా కరోతి య: |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ||

🌷. తాత్పర్యం :

ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు.

🌷. భాష్యము :

ఇచ్చట “బ్రాహ్మణి” యనగా “కృష్ణభక్తిరసభావనమునందు” అని అర్థము. “ప్రధానము” అని పిలువబడును భౌతికజగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనమై యున్నది. “సర్వం హి ఏతత్ బ్రహ్మ”(మాండూక్యోపనిషత్తు 2), “తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే” (ముండకోపనిషత్తు 1.2.10) అను వేదమంత్రములు మరియు “మమ యోనిర్ మహద్బ్రహ్మ” (భగవద్గీత 14.3) అను భగవద్గీతావాక్యము జగత్తు నందలి సర్వము బ్రహ్మస్వరూపమని తెలుపుచున్నది. అనగా జగమునందలి విషయములు తమకు కారణమైన బ్రహ్మము కన్నను భిన్నముగా ప్రదర్శితమగుచున్నను వాస్తవమునాకు బ్రహ్మమునకు అభిన్నములై యున్నవి.

ప్రతిదియు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికి సంబంధించినదే కావున అవియన్నియును అతనికే చెందియున్నవని ఈశోపనిషత్తు నందు తెలుపబడినది. సర్వము శ్రీకృష్ణునకే చెందినదనియు, శ్రీకృష్ణుడే సర్వమునకు యజమానియనియు, తత్కారణముగా సమస్తమును ఆ భగవానుని సేవయందే నియుక్తము కావించవలెననియు తెలిసినవాడు తన పుణ్యపాపకర్మల ఫలములతో సంబంధము లేకుండును. ఒక నిర్దుష్ట కార్యార్థమై భగావానునిచే ఒసగిబడియున్నందున భౌతికదేహమును సైతము కృష్ణభక్తిభావన యందు నియోగింపవలెను. అట్టి సమయమున నీటి యందున్నను తడి గాని తామరాకు వలె దేహము పాపకర్మఫలములకు అతీతమగును.

“మయి సర్వాణి కర్మాణి సన్న్యస్య – నీ కర్మలనన్నింటిని నాకు అర్పింపుము” అని శ్రీకృష్ణభగవానుడు తృతీయాధ్యాయమున(3.30) పలికి యుండెను. సారంశమేమనగా కృష్ణభక్తిభావనము లేనివాడు దేహేంద్రియభావనలో వర్తించగా, కృష్ణభక్తిపరాయణుడు దేహము కృష్ణుని సొత్తు గనుక దానిని అతని సేవ యందే నియోగించవలెనను జ్ఞానముతో వర్తించును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 214 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 10 🌴

10. brahmaṇy ādhāya karmāṇi saṅgaṁ tyaktvā karoti yaḥ
lipyate na sa pāpena padma-patram ivāmbhasā



🌷 Translation :

One who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water.

🌹 Purport :

Here brahmaṇi means in Kṛṣṇa consciousness. The material world is a sum total manifestation of the three modes of material nature, technically called the pradhāna. The Vedic hymns sarvaṁ hy etad brahma (Māṇḍūkya Upaniṣad 2), tasmād etad brahma nāma rūpam annaṁ ca jāyate (Muṇḍaka Upaniṣad 1.1.9), and, in the Bhagavad-gītā (14.3), mama yonir mahad brahma indicate that everything in the material world is a manifestation of Brahman; and although the effects are differently manifested, they are nondifferent from the cause.

In the Īśopaniṣad it is said that everything is related to the Supreme Brahman, or Kṛṣṇa, and thus everything belongs to Him only. One who knows perfectly well that everything belongs to Kṛṣṇa, that He is the proprietor of everything and that, therefore, everything is engaged in the service of the Lord, naturally has nothing to do with the results of his activities, whether virtuous or sinful. Even one’s material body, being a gift of the Lord for carrying out a particular type of action, can be engaged in Kṛṣṇa consciousness.

It is then beyond contamination by sinful reactions, exactly as the lotus leaf, though remaining in the water, is not wet. The Lord also says in the Gītā (3.30), mayi sarvāṇi karmāṇi sannyasya: “Resign all works unto Me [Kṛṣṇa].” The conclusion is that a person without Kṛṣṇa consciousness acts according to the concept of the material body and senses, but a person in Kṛṣṇa consciousness acts according to the knowledge that the body is the property of Kṛṣṇa and should therefore be engaged in the service of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


29 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 212: 05వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 212: Chap. 05, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 212 / Bhagavad-Gita - 212 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 🌴

08. నైవ కించిత్ కరోమీతి యక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్స్వపన్ శ్వపన్ ||


🌷. తాత్పర్యం :

దివ్యచైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును.

🌷. భాష్యము :

కృష్ణభక్తిభావనలో నున్నటువంటివాడు శుద్ధస్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడియుండు ఎటువంటి కర్మలతో సంబంధమును కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో అతడు నిలిచియుండుటచే అందులకు కారణము.

దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవస్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతికభావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తిభావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తిపరాయణుడు ఇంద్రియకర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 212 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 08 🌴

08. naiva kiñcit karomīti yukto manyeta tattva-vit
paśyañ śṛṇvan spṛśañ jighrann aśnan gacchan svapañ śvasan



🌷 Translation :

A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping and breathing, always knows within himself that he actually does nothing at all.

🌹 Purport :

A person in Kṛṣṇa consciousness is pure in his existence, and consequently he has nothing to do with any work which depends upon five immediate and remote causes: the doer, the work, the situation, the endeavor and fortune. This is because he is engaged in the loving transcendental service of Kṛṣṇa. Although he appears to be acting with his body and senses, he is always conscious of his actual position, which is spiritual engagement.

In material consciousness, the senses are engaged in sense gratification, but in Kṛṣṇa consciousness the senses are engaged in the satisfaction of Kṛṣṇa’s senses. Therefore, the Kṛṣṇa conscious person is always free, even though he appears to be engaged in affairs of the senses.

🌹 🌹 🌹 🌹 🌹

28 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 211: 05వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 211: Chap. 05, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴

07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||



🌷. తాత్పర్యం :

భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.


🌷. భాష్యము :

కృష్ణభక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తి భావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును.

“అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున (ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి.

అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 211 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴

07. yoga-yukto viśuddhātmā vijitātmā jitendriyaḥ
sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate



🌷 Translation :

One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.

🌹 Purport :

One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body.

One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present.

Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work.

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 210: 05వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 210: Chap. 05, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 06 🌴

06. సన్న్యాసస్తు మాహాబాహో దుఃఖమాప్తుమయోగత: |
యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్ఛతి ||


🌷. తాత్పర్యం :

భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.


🌷. భాష్యము :

సన్న్యాసుల యందు(సన్న్యాసాశ్రమము నందున్నవారు) రెండు తరగతులవారు కలరు. మయావాద సన్న్యాసులు సాంఖ్యతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుండగా, వైష్ణవసన్న్యాసులు వేదాంతసూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవతతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుందురు. మయావాదులు సైతము వేదాంతసూత్రములను అధ్యయనము చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు వ్రాసిన శారీరికభాష్యమనెడి తమ స్వంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు.

భాగవతధర్మము నందు భక్తులు “పాంచరాత్రిక” విధానము ద్వారా భగవానుని భక్తియుక్తసేవ యందు నెలకొనియుందురు. కనుకనే భాగవతధర్మము ననుసరించు వైష్ణవసన్న్యాసులు భగవానుని దివ్యసేవ యందు పలురకములైన కర్మలను కలిగియుందురు. భౌతికకర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భాగవత్సేవ కొరకై పలువిధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు, వేదాంతాధ్యయనము నందు, మనోకల్పనల యందు మునిగియుండెడి మయావాద సన్న్యాసులు అట్టి దివ్యసేవా మధురిమను అనుభవింపలేరు.

అతిదీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసికకల్పనల యెడ విసుగుచెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కాని సరియైన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసికకల్పనలు మరియు కృత్రిమమైన నిరాకారభావపు వ్యాఖ్యానములు మయావాద సంన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవసన్న్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము ననుభవించుచు అంత్యమున భగవద్ధామమును చేరుదుమనెడి అభయమును కలిగియుందురు.

కాని మాయావాద సన్న్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభవమార్గము నుండి పతనము నొంది భౌతికకలాపములేయైన ధర్మకార్యములు మరియు పరహితముల వంటి లౌకికకర్మలలో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశమేమనగా ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనెడి మనోకల్పనల యందే నియుక్తులై యుండు మాయావాద సన్న్యాసుల కన్నను కృష్ణ భక్తిరస భావిత కర్మల యందు నియుక్తులైనవారు సరియైన స్థితిలో నెలకొనినట్టివారు. అయినను మయావాద సన్న్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తిభావనకు పొందగలరు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 210 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 06 🌴

06. sannyāsas tu mahā-bāho duḥkham āptum ayogataḥ
yoga-yukto munir brahma na cireṇādhigacchati


🌷 Translation :

Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the Supreme without delay.


🌹 Purport :

There are two classes of sannyāsīs, or persons in the renounced order of life. The Māyāvādī sannyāsīs are engaged in the study of Sāṅkhya philosophy, whereas the Vaiṣṇava sannyāsīs are engaged in the study of Bhāgavatam philosophy, which affords the proper commentary on the Vedānta-sūtras. The Māyāvādī sannyāsīs also study the Vedānta-sūtras, but use their own commentary, called Śārīraka-bhāṣya, written by Śaṅkarācārya.

The students of the Bhāgavata school are engaged in the devotional service of the Lord, according to pāñcarātrikī regulations, and therefore the Vaiṣṇava sannyāsīs have multiple engagements in the transcendental service of the Lord. The Vaiṣṇava sannyāsīs have nothing to do with material activities, and yet they perform various activities in their devotional service to the Lord. But the Māyāvādī sannyāsīs, engaged in the studies of Sāṅkhya and Vedānta and speculation, cannot relish the transcendental service of the Lord. Because their studies become very tedious, they sometimes become tired of Brahman speculation, and thus they take shelter of the Bhāgavatam without proper understanding.

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 209: 05వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 209: Chap. 05, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 209 / Bhagavad-Gita - 209 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 05 🌴

05. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ య: పశ్యతి స పశ్యతి ||


🌷. తాత్పర్యం :

సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థదృష్టి కలిగిన వాడగును.

🌷. భాష్యము :

జీవితపు చరమలక్ష్యమును కనుగొనుటయే తత్త్వపరిశోధనల ముఖ్యప్రయోజనమై యున్నది. జీవిత ముఖ్యలక్ష్యము ఆత్మానుభవమైనందున ఈ రెండుమార్గముల యందలి నిర్ణయములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్యతత్త్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతికజగత్తుయొక్క అంశ కాదనియు, పూర్ణుడైన పరమాత్ముని అంశమేననియు మనుజుడు నిర్ధారణకు వచ్చును. శుద్ధాత్మకు భౌతికజగత్తుతో సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నియును కృష్ణపరములుగా నుండవలెననియు అంతట మనుజుడు తెలిసికొనగలుగును. అట్టి భావనలో అతడు కర్మనొనరించినచో తన నిజస్థితి యందు నిలిచినవాడే కాగలడు.

మొదటి పద్ధతియైన సాంఖ్యములో మనుజుడు భౌతికపదార్థము నుండి విడివడవలసియుండగా, రెండవ పద్ధతియైన భక్తియోగమునందు కృష్ణభక్తిరసభావితకర్మల యందు సంపూర్ణముగా మగ్నుడు కావలసియుండును. బాహ్యమునాకు ఒకదాని యందు అసంగత్వము ఇంకొక దాని యందు సంగత్వము గోచరించినను వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమే అయియున్నవి. భౌతికత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని యెడ అనురక్తి ఏకమేననెడి విషయమును గాంచగలిగినవాడు యథార్థదృష్టిని పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 209 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 05 🌴

05. yat sāṅkhyaiḥ prāpyate sthānaṁ tad yogair api gamyate
ekaṁ sāṅkhyaṁ ca yogaṁ ca yaḥ paśyati sa paśyati



🌷 Translation :

One who knows that the position reached by means of analytical study can also be attained by devotional service, and who therefore sees analytical study and devotional service to be on the same level, sees things as they are.


🌹 Purport :

The real purpose of philosophical research is to find the ultimate goal of life. Since the ultimate goal of life is self-realization, there is no difference between the conclusions reached by the two processes. By Sāṅkhya philosophical research one comes to the conclusion that a living entity is not a part and parcel of the material world but of the supreme spirit whole. Consequently, the spirit soul has nothing to do with the material world; his actions must be in some relation with the Supreme.

When he acts in Kṛṣṇa consciousness, he is actually in his constitutional position. In the first process, Sāṅkhya, one has to become detached from matter, and in the devotional yoga process one has to attach himself to the work of Kṛṣṇa consciousness. Factually, both processes are the same, although superficially one process appears to involve detachment and the other process appears to involve attachment. Detachment from matter and attachment to Kṛṣṇa are one and the same. One who can see this sees things as they are.

🌹 🌹 🌹 🌹 🌹


25 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 208: 05వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 208: Chap. 05, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 208 / Bhagavad-Gita - 208 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 04 🌴

04. సాంఖ్యయోగౌ పృథాగ్బాలా: ప్రవదన్తి న పణ్డితా: |
ఏకమప్యాస్థిత: సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||


🌷. తాత్పర్యం :

కేవలము అజ్ఞానులే భక్తియోగమును (కర్మయోగము) భౌతికజగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు(సాంఖ్యమునకు) భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు.

🌷. భాష్యము :

ఆత్మ ఉనికిని తెలిసికొనుటయే భౌతికజగమును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనముయొక్క లక్ష్యమై యున్నది. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగమునకు ఆత్మయై యున్నాడు. శ్రీకృష్ణభగవానునకు ఒనరింపబడు భక్తి ఆ పరమాత్మకు కూర్చబడు సేవయే కాగలదు. ఒక పద్ధతి చెట్టు ములమును కనుగొను విధానము కాగా, ఇంకొక పద్ధతి ఆ మూలమునకు నీరుపోయుట వంటిది.

నిజమైన సాంఖ్యజ్ఞాన అధ్యయనపరుడు భౌతికజగత్తునకు మూలమైన విష్ణువును తెలిసికొని పూర్ణజ్ఞానముతో అతని సేవ యందు నియుక్తుడగును. అనగా వాస్తవమునకు ఈ రెండు మార్గముల లక్ష్యము విష్ణువేయైనందున రెండింటిలో భేదమేమియును లేదు. అంతిమ ప్రయోజనమును తెలియనివారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు ఏకము కావని పలుకుదురు. కాని పండితుడైనవాడు మాత్రము ఈ రెండుమార్గముల యొక్క ఏకమాత్ర ప్రయోజనమును సంపూర్ణముగా ఎరిగియుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 208 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 04 🌴

04. sāṅkhya-yogau pṛthag bālāḥ pravadanti na paṇḍitāḥ
ekam apy āsthitaḥ samyag ubhayor vindate phalam


🌷 Translation :

Only the ignorant speak of devotional service [karma-yoga] as being different from the analytical study of the material world [Sāṅkhya]. Those who are actually learned say that he who applies himself well to one of these paths achieves the results of both


🌹 Purport :

The aim of the analytical study of the material world is to find the soul of existence. The soul of the material world is Viṣṇu, or the Supersoul. Devotional service to the Lord entails service to the Supersoul. One process is to find the root of the tree, and the other is to water the root.

The real student of Sāṅkhya philosophy finds the root of the material world, Viṣṇu, and then, in perfect knowledge, engages himself in the service of the Lord. Therefore, in essence, there is no difference between the two because the aim of both is Viṣṇu. Those who do not know the ultimate end say that the purposes of Sāṅkhya and karma-yoga are not the same, but one who is learned knows the unifying aim in these different processes.

🌹 🌹 🌹 🌹 🌹


24 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 207: 05వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 207: Chap. 05, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 207 / Bhagavad-Gita - 207 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 03 🌴


03. జ్ఞేయ: స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ ప్రముచ్యతే ||

🌷. తాత్పర్యం :

కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకికబంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైనవాడు కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనందున నిత్యసన్న్యాసియై యున్నాడు. శ్రీకృష్ణునితో తనకు గల నిత్యసంబంధమున తన నిజస్థితి ఎరిగియున్న కారణముగా భక్తియుతసేవకు అంకితుడై యుండు అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై యుండును. శ్రీ కృష్ణుడు పూర్ణుడనియు మరియు తాని అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా నెరిగియుండును. అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణరీతిని సరియై యున్నందున సమగ్రజ్ఞానమై యున్నది.

అంశలు ఏనాడును పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వమనెడి భావనము ఎన్నడును సరియైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగనే సమానుడు గాని పరిమాణరీతిని కాదనెడి నిజమైన ఆధ్యాత్మికజ్ఞానము కోరికలు, చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సు నందు ద్వంద్వములు పొడసూపవు. ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతికజగమునందును ముక్తుడై యుండగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 207 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 03 🌴


03. jñeyaḥ sa nitya-sannyāsī yo na dveṣṭi na kāṅkṣati
nirdvandvo hi mahā-bāho sukhaṁ bandhāt pramucyate

🌷 Translation :

One who neither hates nor desires the fruits of his activities is known to be always renounced. Such a person, free from all dualities, easily overcomes material bondage and is completely liberated, O mighty-armed Arjuna.

🌹 Purport :

One who is fully in Kṛṣṇa consciousness is always a renouncer because he feels neither hatred nor desire for the results of his actions. Such a renouncer, dedicated to the transcendental loving service of the Lord, is fully qualified in knowledge because he knows his constitutional position in his relationship with Kṛṣṇa. He knows fully well that Kṛṣṇa is the whole and that he is part and parcel of Kṛṣṇa.

Such knowledge is perfect because it is qualitatively and quantitatively correct. The concept of oneness with Kṛṣṇa is incorrect because the part cannot be equal to the whole. Knowledge that one is one in quality yet different in quantity is correct transcendental knowledge leading one to become full in himself, having nothing to aspire to or lament over. There is no duality in his mind because whatever he does, he does for Kṛṣṇa. Being thus freed from the platform of dualities, he is liberated – even in this material world.

🌹 🌹 🌹 🌹 🌹


23 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 206: 05వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 206: Chap. 05, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 206 / Bhagavad-Gita - 206 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 02 🌴



02. శ్రీ భగవానువాచ

సన్న్యాస: కర్మయోగాశ్చ ని:శ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు సమాధానమొసగెను; కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మపరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది.


🌷. భాష్యము :

కామ్యకర్మలు (ఇంద్రియప్రీతిని కోరునటువంటి) భవబంధమునకు కారణములై యున్నవి. దేహసౌఖ్యము పెంపొందించుకొను ఉద్దేశ్యముతో కర్మల నొనరించునంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. శ్రీమద్భాగవతము(5.5.4-6) ఈ విషయమునే ఇట్లు నిర్ధారణ చేసినది.

“ఇంద్రియప్రీతి యెడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుతదేహము గత కర్మఫలముగా లభించినదే యని తెలిసికొనజాలడు. ఈ దేహము ఆశాశ్వతమైనను ఉన్నంతకాలము జీవుని అది అనేకరకములుగా భాధించును. కనుక ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట సరియైనది కాదు. మనుజడు తన నిజస్థితి గూర్చి ప్రశ్నించనంతకాలము జీవితములో పరాజయమును పొందినట్లుగా భావింపబడును. అతడు తన నిజస్థితిని ఎరుగనంతవరకు ఇంద్రియప్రీతికై ఫలముల నాశించి కర్మ యందు వర్తించవలసివచ్చును. అట్టి ఇంద్రియభోగానుభవ భావములో నున్నంతకాలము అతడు వివిధయోనుల యందు పరిభ్రమించవలసినదే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను ఏదియో ఒక విధముగా ప్రతియొక్కరు వాసుదేవుని భక్తియుతసేవ యెడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవ్వరైనను భవబంధము నుండి ముక్తిని పొందు అవకాశమును పొందగలరు.”

కావున జ్ఞానమొక్కటే(నేను దేహమున గాక ఆత్మననెడి జ్ఞానము) ముక్తికి సరిపోదు. అట్టి జ్ఞానముతో పాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధము నుండి తప్పించుకొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కాని కృష్ణభక్తిరసభావనమునందు ఒనరింపబడు కర్మ కామ్యకర్మ వంటిది కాదు. పూర్ణజ్ఞానముతో ఒనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృడవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణభక్తిభావన లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట యనునది బద్ధజీవుని హృదయమును పవిత్రము చేయజాలదు. హృదయము పవిత్రము కానంతవరకు మనుజుడు కామ్యభావనలో కర్మలను ఒనరింపవలసి వచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 206 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 02 🌴



02. śrī-bhagavān uvāca

sannyāsaḥ karma-yogaś ca niḥśreyasa-karāv ubhau
tayos tu karma-sannyāsā karma-yogo viśiṣyate


🌷 Translation :

The Personality of Godhead replied: The renunciation of work and work in devotion are both good for liberation. But, of the two, work in devotional service is better than renunciation of work.

🌹 Purport :

Fruitive activities (seeking sense gratification) are cause for material bondage. As long as one is engaged in activities aimed at improving the standard of bodily comfort, one is sure to transmigrate to different types of bodies, thereby continuing material bondage perpetually.

“People are mad after sense gratification, and they do not know that this present body, which is full of miseries, is a result of one’s fruitive activities in the past. Although this body is temporary, it is always giving one trouble in many ways. Therefore, to act for sense gratification is not good. One is considered to be a failure in life as long as he makes no inquiry about his real identity. As long as he does not know his real identity, he has to work for fruitive results for sense gratification, and as long as one is engrossed in the consciousness of sense gratification one has to transmigrate from one body to another.

Although the mind may be engrossed in fruitive activities and influenced by ignorance, one must develop a love for devotional service to Vāsudeva. Only then can one have the opportunity to get out of the bondage of material existence.” Therefore, jñāna (or knowledge that one is not this material body but spirit soul) is not sufficient for liberation. One has to act in the status of spirit soul, otherwise there is no escape from material bondage.


Continues..

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 205: 05వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 205: Chap. 05, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 205 / Bhagavad-Gita - 205 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 01 🌴


01. అర్జున ఉవాచ

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్సితమ్ ||

🌷. తాత్పర్యం :

అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.

🌷. భాష్యము :

భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసికకల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయు చున్నాడు. ప్రకృతికి పరముగా నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునాకు మానసికకల్పనల కన్నును సులభమైన మార్గమై యున్నది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది.

ఏ విధముగా ఆత్మ అట్టి భవబంధము నుండి బుద్ధియోగము(భక్తియోగము) ద్వారా ముక్తినొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఒనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. అయినను పూర్ణజ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తియుతకర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కిచెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురుచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను.

జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియప్రీతికర కర్మలనన్నింటిని విరమించుట యని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మనొనరించుచున్నదో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికిని పొత్తు కుదరదు కనుక సన్న్యాసముగా (జ్ఞానపూర్వక త్యాగము) అన్నిరకముల నుండి విడివడియుండుట యని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో ససమానమని అర్జునుడు అవగతము చేసికొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తానూ కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మనొనరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 205 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 01 🌴


01. arjuna uvāca

sannyāsaṁ karmaṇāṁ kṛṣṇa punar yogaṁ ca śaṁsasi
yac chreya etayor ekaṁ tan me brūhi su-niścitam


🌷 Translation :

Arjuna said: O Kṛṣṇa, first of all You ask me to renounce work, and then again You recommend work with devotion. Now will You kindly tell me definitely which of the two is more beneficial?

🌹 Purport :

In this Fifth Chapter of the Bhagavad-gītā, the Lord says that work in devotional service is better than dry mental speculation. Devotional service is easier than the latter because, being transcendental in nature, it frees one from reaction. In the Second Chapter, preliminary knowledge of the soul and its entanglement in the material body were explained.

How to get out of this material encagement by buddhi-yoga, or devotional service, was also explained therein. In the Third Chapter, it was explained that a person who is situated on the platform of knowledge no longer has any duties to perform. And in the Fourth Chapter the Lord told Arjuna that all kinds of sacrificial work culminate in knowledge. However, at the end of the Fourth Chapter, the Lord advised Arjuna to wake up and fight, being situated in perfect knowledge. Therefore, by simultaneously stressing the importance of both work in devotion and inaction in knowledge, Kṛṣṇa has perplexed Arjuna and confused his determination. Arjuna understands that renunciation in knowledge involves cessation of all kinds of work performed as sense activities.

But if one performs work in devotional service, then how is work stopped? In other words, he thinks that sannyāsa, or renunciation in knowledge, should be altogether free from all kinds of activity, because work and renunciation appear to him to be incompatible. He appears not to have understood that work in full knowledge is nonreactive and is therefore the same as inaction. He inquires, therefore, whether he should cease work altogether or work with full knowledge.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 204: 04వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 204: Chap. 04, Ver. 42


🌹. శ్రీమద్భగవద్గీత - 204 / Bhagavad-Gita - 204 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 42 🌴

42. తస్మాదజ్ఞానసంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మన: |
ఛిత్వైనం సంశయం యోగమాతి ష్ఠోత్తిష్ట భారత ||



🌷. తాత్పర్యం :

కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారతా! యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!


🌷. భాష్యము :

ఈ అధ్యాయమున ఉపదేశింపబడిన యోగపద్ధతి సనాతనయోగము (జీవునిచే నిర్వహింపబడు నిత్యకర్మలు) అని పిలువబడును. ఈ యోగవిధానము రెండువిధములైన యజ్ఞకర్మలను కూడియుండును. అందు ఒకటి ద్రవ్యమయయజ్ఞమని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మయైనటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయయజ్ఞము ఆత్మానుభవముతో సంధింపబడనిచో అది భౌతికకర్మగా పరిణమించును. కాని అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక ఉద్దేశ్యముతో (భక్తియోగమునందు) నిర్వహించువాడు పూర్ణయజ్ఞమును కావించినవాడగును.

ఇక మనము ఆధ్యాత్మిక కర్మలను గూర్చి తెలిసికొనుట (స్వీయస్థితి) కాగా, రెండవది దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మికజ్ఞానమునందలి ఈ రెండు ముఖ్యవిభాగవములను సులభముగా అవగతము చేసికొనగలడు. అట్టివానికి ఆత్మ శ్రీకృష్ణభగవానుని దివ్యకర్మలను సులభముగా అవగతము చేసికొనగలడు కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభములో భగవానుని దివ్యకర్మలు అతని చేతనే చర్చించబడియున్నవి.

అట్టి గీతోపదేశమును అవగాహన చేసికొనలేనివాడు శ్రద్ధారహితునిగను మరియు భగవానునిచే ఒసగబడిన కొద్దిపాటి స్వాతంత్ర్యమును దుర్వినియోగాపరచినవాడుగను భావింపబడును. అట్టి ఉపదేశము లభించిన పిమ్మటయు సత్, చిత్, జ్ఞానస్వరూపునిగా శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వమును తెలిసికొనలేనివాడు నిక్కముగా గొప్ప మూర్ఖుడే. అట్టి అజ్ఞానము కృష్ణభక్తిభావన యందలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు.

శ్రీమధ్భగవద్గీత యందలి “దివ్యజ్ఞానము” అను చతుర్థాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 204 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 42 🌴


42. tasmād ajñāna-sambhūtaṁ hṛt-sthaṁ jñānāsinātmanaḥ
chittvainaṁ saṁśayaṁ yogam ātiṣṭhottiṣṭha bhārata


🌷 Translation :

Therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bhārata, stand and fight.


🌹 Purport :

The yoga system instructed in this chapter is called sanātana-yoga, or eternal activities performed by the living entity. This yoga has two divisions of sacrificial actions: one is called sacrifice of one’s material possessions, and the other is called knowledge of self, which is pure spiritual activity. If sacrifice of one’s material possessions is not dovetailed for spiritual realization, then such sacrifice becomes material. But one who performs such sacrifices with a spiritual objective, or in devotional service, makes a perfect sacrifice. When we come to spiritual activities, we find that these are also divided into two: namely, understanding of one’s own self (or one’s constitutional position), and the truth regarding the Supreme Personality of Godhead.

One who follows the path of Bhagavad-gītā as it is can very easily understand these two important divisions of spiritual knowledge. For him there is no difficulty in obtaining perfect knowledge of the self as part and parcel of the Lord. And such understanding is beneficial, for such a person can easily understand the transcendental activities of the Lord. In the beginning of this chapter, the transcendental activities of the Lord were discussed by the Supreme Lord Himself. One who does not understand the instructions of the Gītā is faithless, and is to be considered to be misusing the fragmental independence awarded to him by the Lord. In spite of such instructions, one who does not understand the real nature of the Lord as the eternal, blissful, all-knowing Personality of Godhead is certainly fool number one. Ignorance can be removed by gradual acceptance of the principles of Kṛṣṇa consciousness.

Thus end the Bhaktivedanta Purports to the Fourth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Transcendental Knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


20 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 203: 04వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 203: Chap. 04, Ver. 41


🌹. శ్రీమద్భగవద్గీత - 203 / Bhagavad-Gita - 203 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 41 🌴

41. యోగసన్న్యస్తకర్మాణాం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ ||


🌷. తాత్పర్యం :

కర్మఫలముల నన్నింటిని త్యచించి భక్తియోగము నందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములు నశించి యున్నవాడు వాస్తవముగా ఆత్మ యందే స్థితుడైనట్టి వాడు. ఓ ధనంజయా! ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు.


🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తెలుపబడినరీతిగా భగవద్గీతోపదేశమును అనుసరించువాడు దివ్యజ్ఞానము ద్వారా సర్వసంశయముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో భగవానుని అంశరూపమున అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందినవాడే యగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మబంధమునకు అతీతుడైయుండును.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 203 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 41 🌴

41. yoga-sannyasta-karmāṇaṁ jñāna-sañchinna-saṁśayam
ātmavantaṁ na karmāṇi nibadhnanti dhanañ-jaya



🌷 Translation :

One who acts in devotional service, renouncing the fruits of his actions, and whose doubts have been destroyed by transcendental knowledge, is situated factually in the self. Thus he is not bound by the reactions of work, O conqueror of riches.


🌹 Purport :

One who follows the instruction of the Bhagavad-gītā, as it is imparted by the Lord, the Personality of Godhead Himself, becomes free from all doubts by the grace of transcendental knowledge. He, as a part and parcel of the Lord, in full Kṛṣṇa consciousness, is already established in self-knowledge. As such, he is undoubtedly above bondage to action.

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 202: 04వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 202: Chap. 04, Ver. 40


🌹. శ్రీమద్భగవద్గీత - 202 / Bhagavad-Gita - 202 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 40 🌴

40. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన: ||


🌷. తాత్పర్యం :

శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైనవారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.


🌷. భాష్యము :

అధికారికములు మరియు ప్రామాణికములు అగు పెక్కు శాస్తములలో భగవద్గీత శ్రేష్ఠమైనది. జంతుప్రాయులైన మనుజులకు శాస్త్రములందు శ్రద్ధకాని, జ్ఞానము కాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రముల యెడ కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్రవచనములపై సంపూర్ణ విశ్వాసముండదు.

మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల యెడ శ్రద్ధను కలిగియున్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని, అతనిని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనులు మరియు సంశయాత్ములైనవారు ఎన్నడును పురోభివృద్ధిని పొందలేరు. దైవమునందు, అతని వచనమునందు శ్రద్ధలేనివారు ఇహపరములందు ఎట్టి శుభమును బడయజాలరు. కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమములను పాటించుచు జ్ఞానస్థాయికి ఎదుగవలెను.

కేవలము అట్టి జ్ఞానమే ఆధ్యాత్మికావగాహనపు దివ్యస్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్థులకు ఆధ్యాత్మికరంగమునందు ఎట్టి స్థానము లేదు. కనుక ప్రతియొక్కరు పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యల అడుగుజాడల ననుసరించి విజయమును సాధింపవలెను.


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 202 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 40 🌴

40. ajñaś cāśraddadhānaś ca saṁśayātmā vinaśyati
nāyaṁ loko ’sti na paro na sukhaṁ saṁśayātmanaḥ



🌷 Translation :

But ignorant and faithless persons who doubt the revealed scriptures do not attain God consciousness; they fall down. For the doubting soul there is happiness neither in this world nor in the next.

🌹 Purport :

Out of many standard and authoritative revealed scriptures, the Bhagavad-gītā is the best. Persons who are almost like animals have no faith in, or knowledge of, the standard revealed scriptures; and some, even though they have knowledge of, or can cite passages from, the revealed scriptures, have actually no faith in these words.

And even though others may have faith in scriptures like Bhagavad-gītā, they do not believe in or worship the Personality of Godhead, Śrī Kṛṣṇa. Such persons cannot have any standing in Kṛṣṇa consciousness. They fall down. Out of all the above-mentioned persons, those who have no faith and are always doubtful make no progress at all. Men without faith in God and His revealed word find no good in this world, nor in the next. For them there is no happiness whatsoever.

One should therefore follow the principles of revealed scriptures with faith and thereby be raised to the platform of knowledge. Only this knowledge will help one become promoted to the transcendental platform of spiritual understanding. In other words, doubtful persons have no status whatsoever in spiritual emancipation. One should therefore follow in the footsteps of great ācāryas who are in the disciplic succession and thereby attain success.

🌹 🌹 🌹 🌹 🌹


18 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 201: 04వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 201: Chap. 04, Ver. 39


🌹. శ్రీమద్భగవద్గీత - 201 / Bhagavad-Gita - 201 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 39 🌴

39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర: సంయతేన్ద్రియ: |
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||



🌷. తాత్పర్యం :

దివ్యజ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును పొందుట అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు దృఢమైన విశ్వాసము కలిగిన మనుజునికి అట్టి కృష్ణభక్తిభావనా జ్ఞానము లభించగలదు. కృష్ణభక్తిభావన యందు కేవలము వర్తించుట చేతనే సంపూర్ణత్వము సిద్ధించునని భావించువాడు శ్రద్ధావంతుడనబడును.

భక్తియుతసేవ నొనరించుట ద్వారా మరియు హృదయమాలిన్యమును తొలగించు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అను మాహామంత్రమును జపకీర్తనములు చేయుట ద్వారా అట్టి శ్రద్ధ ప్రాప్తించగలదు. వీనితోపాటుగా అతడు ఇంద్రియములను సైతము నిగ్రహించవలెను. శ్రీకృష్ణుని యెడ శ్రద్ధను కలిగి ఇంద్రియనియమమును పాటించువాడు కృష్ణభక్తి రసభావన జ్ఞానము నందు పూర్ణత్వమును ఏమాత్రము జాగులేక సులభముగా పొందగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 201 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 39 🌴

39. śraddhāvāḻ labhate jñānaṁ tat-paraḥ saṁyatendriyaḥ
jñānaṁ labdhvā parāṁ śāntim acireṇādhigacchati


🌷 Translation :

A faithful man who is dedicated to transcendental knowledge and who subdues his senses is eligible to achieve such knowledge, and having achieved it he quickly attains the supreme spiritual peace.


🌹 Purport :

Such knowledge in Kṛṣṇa consciousness can be achieved by a faithful person who believes firmly in Kṛṣṇa. One is called a faithful man who thinks that simply by acting in Kṛṣṇa consciousness he can attain the highest perfection.

This faith is attained by the discharge of devotional service and by chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, which cleanses one’s heart of all material dirt. Over and above this, one should control the senses. A person who is faithful to Kṛṣṇa and who controls the senses can easily attain perfection in the knowledge of Kṛṣṇa consciousness without delay.

🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 200: 04వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 200: Chap. 04, Ver. 38



🌹. శ్రీమద్భగవద్గీత - 200 / Bhagavad-Gita - 200 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 38 🌴

38. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధ: కాలేనాత్మని విన్దతి ||


🌷. తాత్పర్యం :

ఈ జగము నందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. సకల యోగముల పక్వఫలమైన ఆ జ్ఞానమును భక్తియోగాభ్యాసము నందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమమున తన యందే అనుభవించును.


🌷. భాష్యము :

దివ్యజ్ఞానమును గూర్చి పలుకునపుడు ఆధ్యాత్మిక అవగాహనతోనే మనము ఆ కార్యమును చేయుదురు. అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును లేదా దివ్యజ్ఞానము కన్నను పవిత్రమైనది మరియు ఉన్నతమైనది వేరొక్కటి లేదు. అజ్ఞానము బంధమునాకు కారణము కాగా, అట్టి జ్ఞానము ముక్తికి కారణమై యున్నది. అదియే భక్తియోగ పక్వఫలము.

అట్టి దివ్యజ్ఞానము నందు స్థితిని పొందినవాడు శాంతిని తన యందే అనుభవించుటచే దాని కొరకు బాహ్యమున వెదుక నవసరము కలుగదు. అనగా జ్ఞానము మరియు శాంతి యనునవి చివరకు కృష్ణభక్తిరసభావనగానే పరిణమించును. ఇదియే భగద్గీత యొక్క తుదివాక్యము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 200 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 4 - Jnana Yoga - 38 🌴

38. na hi jñānena sadṛśaṁ pavitram iha vidyate
tat svayaṁ yoga-saṁsiddhaḥ kālenātmani vindati



🌷 Translation :

In this world, there is nothing so sublime and pure as transcendental knowledge. Such knowledge is the mature fruit of all mysticism. And one who has become accomplished in the practice of devotional service enjoys this knowledge within himself in due course of time.


🌹 Purport :

When we speak of transcendental knowledge, we do so in terms of spiritual understanding. As such, there is nothing so sublime and pure as transcendental knowledge. Ignorance is the cause of our bondage, and knowledge is the cause of our liberation.

This knowledge is the mature fruit of devotional service, and when one is situated in transcendental knowledge, he need not search for peace elsewhere, for he enjoys peace within himself. In other words, this knowledge and peace culminate in Kṛṣṇa consciousness. That is the last word in the Bhagavad-gītā.

🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 199: 04వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 199: Chap. 04, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 199 / Bhagavad-Gita - 199 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 37 🌴

37. యథైధాంసి సమిద్ధో(గ్నిర్భస్మసాత్ కురుతేర్జున |
జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ||



🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలముల నన్నింటిని బూడిదగా చేసివేయును.


🌷. భాష్యము :

ఆత్మ, పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణజ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనే గాక పుణ్యకర్మఫలములను కూడా భస్మీపాటలము కావించును. కలుగబోవు ఫలము, ఫలవంతమగుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచితఫలమనుచు కర్మఫలము లందు అనేక స్థితులు కలవు. కాని జీవుని నిజస్థితి యొక్క జ్ఞానము సమస్తమును భస్మము చేయగలదు.

మనుజుడు జ్ఞానవంతుడైనపుడు సంచిత, ప్రారబ్దాది సర్వకర్మఫలములు నశించిపోవును. కనుకనే బృహదారణ్యకోపనిషత్తు (4.4.22) నందు “ఉభే ఉహైవైష ఏతే తరత్వమృత: సాధ్వసాధూనీ – పుణ్య, పాపకర్మఫలములు రెండింటిని మనుజుడు అధిగమించును” అని తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 199 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 4 - Jnana Yoga - 37 🌴

37. yathaidhāṁsi samiddho ’gnir bhasma-sāt kurute ’rjuna
jñānāgniḥ sarva-karmāṇi bhasma-sāt kurute tathā



🌷 Translation :

As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.


🌹 Purport :

Perfect knowledge of self and Superself and of their relationship is compared herein to fire. This fire not only burns up all reactions to impious activities, but also all reactions to pious activities, turning them to ashes. There are many stages of reaction: reaction in the making, reaction fructifying, reaction already achieved, and reaction a priori.

But knowledge of the constitutional position of the living entity burns everything to ashes. When one is in complete knowledge, all reactions, both a priori and a posteriori, are consumed. In the Vedas (Bṛhad-āraṇyaka Upaniṣad 4.4.22) it is stated, ubhe uhaivaiṣa ete taraty amṛtaḥ sādhv-asādhūnī: “One overcomes both the pious and impious reactions of work.”

🌹 🌹 🌹 🌹 🌹


15 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 198: 04వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 198: Chap. 04, Ver. 36


🌹. శ్రీమద్భగవద్గీత - 198 / Bhagavad-Gita - 198 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 36 🌴


36. అపి చేదసి పాపేభ్య: సర్వేభ్య: పాపకృత్తమ: |
సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి ||


🌷. తాత్పర్యం :

ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో దుఃఖసముద్రమును దాటగలవు.


🌷. భాష్యము :

శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితిని మనుజుడు సరిగా అవగతము చేసికొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞానసాగరమునందు జరిగెడి జీవనసంఘర్షణ నుండి అతనిని శీఘ్రమే ఉద్ధరించును. ఈ భౌతికజగత్తు కొన్నిమార్లు అజ్ఞానసాగరమును, మరికొన్నిమార్లు దావానములతో చుట్టబడిన అరణ్యముగను వర్ణింపబడును.

సముద్రమునందు ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను ప్రాణరక్షణము కష్టమే; ఎవరేని వచ్చి అతనిని సముద్రము నుండి లేవదీసి రక్షించినచో అట్టివానిని గొప్పరక్షకుడని భావింపవచ్చును. దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి స్వీకరింపబడిన పూర్ణజ్ఞానము ముక్తికి మార్గమై యున్నది. అట్టి కృష్ణభక్తిరసభావన యనెడి నౌక సరళమైనను మహోన్నతమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 198 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 36 🌴



36. api ced asi pāpebhyaḥ sarvebhyaḥ pāpa-kṛt-tamaḥ
sarvaṁ jñāna-plavenaiva vṛjinaṁ santariṣyasi


🌷 Translation :

Even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge you will be able to cross over the ocean of miseries.


🌹 Purport :

Proper understanding of one’s constitutional position in relationship to Kṛṣṇa is so nice that it can at once lift one from the struggle for existence which goes on in the ocean of nescience. This material world is sometimes regarded as an ocean of nescience and sometimes as a blazing forest.

In the ocean, however expert a swimmer one may be, the struggle for existence is very severe. If someone comes forward and lifts the struggling swimmer from the ocean, he is the greatest savior. Perfect knowledge, received from the Supreme Personality of Godhead, is the path of liberation. The boat of Kṛṣṇa consciousness is very simple, but at the same time the most sublime.

🌹 🌹 🌹 🌹 🌹


14 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 197: 04వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 197: Chap. 04, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 197 / Bhagavad-Gita - 197 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 35 🌴

35. యద్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |
యేన భూతాన్య శేషాణి ద్రక్ష్య స్యాత్మన్యథో మయి ||


🌷. తాత్పర్యం :

ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్తజీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మొహమునకు గురికావు.


🌷. భాష్యము :

జీవులందరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశలని ఎరుగగలుగుటయే ఆత్మదర్శియైన మహాత్ముని(ఉన్నది ఉన్నట్లుగా గాంచగలిగిన సత్యదర్శి) నుండి జ్ఞానమును పొందుట వలన కలిగెడి ఫలితమై యున్నది. కృష్ణుని నుండి విడివడియున్న స్థితి యొక్క భావనయే మాయ(మా – కాదు, యా – ఇది) యనబడును. అయినను కొందరు మాకు కృష్ణునితో సంబంధము లేదనియు, అతడు కేవలము ఒక చారిత్రాత్మకపురుషుడు మాత్రమే యనియు మరియు పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మమే యనియు భావింతురు. కాని వాస్తవమునాకు భగవద్గీత యందు తెలుపబడిన రీతిగా నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని శరీరకాంతియై యున్నది. పూర్ణపురుషోత్తమునిగా శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమైయున్నాడు.

శ్రీకృష్ణుడే సమస్త కారణములకు కారణమైన దేవదేవుడని బ్రహ్మసంహిత యందు స్పష్టముగా తెలుపబడినది. లక్షలాదిగానున్న అవతారములన్నియును అతని భిన్నవిస్తారములై యున్నవి. అదే విధముగా జీవులు సైతము ఆ శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి వివిధ విస్తారములందు తన మూలస్థితిని కోల్పోవునని మయావాద తత్త్వవేత్తలు తప్పుగా భావింతురు.

వాస్తవమునకు అట్టి భావనము కేవలము భౌతికమైనది. దేనినైనను ముక్కలుగా విభజించినచో అది తన మూలరూపమును కోల్పోవుననుట ఈ భౌతికజగత్తు యొక్క అనుభవమై యున్నది. కాని పరతత్త్వమనగా ఒకటిని ఒకటితో కలుపగా ఒకటిగా నుండునదనియు మరియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటిగనే నిలుచునటువంటిదనియు వారు ఎరుగజాలరు. కాని ఆధ్యాత్మికజగము సమస్తము ఏ రీతిగానే ఉండును.

పరతత్త్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మాయచే కప్పబడి మనము కృష్ణుని నుండి వేరనెడి భావనను కలిగియుందుము. మనము శ్రీకృష్ణుని నుండి విదివదిన అంశలమైనను అతని నుండి భిన్నులము కాము. జీవుల దేహభేదములు మాయయేగాని వాస్తావము కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 197 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 35 🌴


35. yaj jñātvā na punar moham evaṁ yāsyasi pāṇḍava
yena bhūtāny aśeṣāṇi drakṣyasy ātmany atho mayi


🌷 Translation :

Having obtained real knowledge from a self-realized soul, you will never fall again into such illusion, for by this knowledge you will see that all living beings are but part of the Supreme, or, in other words, that they are Mine.

🌹 Purport :

The result of receiving knowledge from a self-realized soul, or one who knows things as they are, is learning that all living beings are parts and parcels of the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa. The sense of an existence separate from Kṛṣṇa is called māyā (mā – not, yā – this).

Some think that we have nothing to do with Kṛṣṇa, that Kṛṣṇa is only a great historical personality and that the Absolute is the impersonal Brahman. Factually, as it is stated in the Bhagavad-gītā, this impersonal Brahman is the personal effulgence of Kṛṣṇa. Kṛṣṇa, as the Supreme Personality of Godhead, is the cause of everything. In the Brahma-saṁhitā it is clearly stated that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the cause of all causes. Even the millions of incarnations are only His different expansions.

Similarly, the living entities are also expansions of Kṛṣṇa. The Māyāvādī philosophers wrongly think that Kṛṣṇa loses His own separate existence in His many expansions. This thought is material in nature. We have experience in the material world that a thing, when fragmentally distributed, loses its own original identity. But the Māyāvādī philosophers fail to understand that absolute means that one plus one is equal to one, and that one minus one is also equal to one. This is the case in the absolute world.

For want of sufficient knowledge in the absolute science, we are now covered with illusion, and therefore we think that we are separate from Kṛṣṇa. Although we are separated parts of Kṛṣṇa, we are nevertheless not different from Him. The bodily difference of the living entities is māyā, or not actual fact.

🌹 🌹 🌹 🌹 🌹


13 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 196: 04వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 196: Chap. 04, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 196 / Bhagavad-Gita - 196 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 34 🌴


34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శిన: ||


🌷. తాత్పర్యం :

గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము. ఆత్మదర్శులు తత్త్వదర్శనము చేసినవారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు.


🌷. భాష్యము :

ఆత్మానుభవమార్గమును నిస్సందేహముగా కటినమైనదికఠినమైనది. కనుకనే తన నుండియే వచ్చిన గురుపరంపరలోని ఆధ్యాత్మికగురువు దరిచేరుమని శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించుచున్నాడు. పరంపరా సిద్ధాంతమును పాటింపక ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యులు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే ఆది ఆధ్యాత్మికాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలో నున్నవాడే ఆ ఆదిదేవుని ఉపదేశమును యథాతథముగా తన శిష్యులకు తెలియజేయగలడు.

స్వీయపధ్ధతిని సృష్టించుట ద్వారా ఎవ్వరును ఆధ్యాత్మికానుభవమును పొందలేరు (మూర్ఖులైన కపటులకు అది మోజు వంటిది). “ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణితం” అని శ్రీమద్భాగవతము (6.3.19) తెలుపుచున్నది. అనగా ధర్మము భగవానుని చేతనే స్వయముగా మార్గమునకు చేర్చజాలవు.

అదే విధముగా ఎవ్వరినీ సంప్రదింపక స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవ్వరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతియొక్కరు జ్ఞానమును పొందుటకు తప్పక గురువును సంతృప్తి పరచుటయే ఆధ్యాత్మికజీవన పురోభివృద్ధికి రహస్యము. ప్రశ్నలు మరియు శరణాగతి మరియు సేవ లేనిదే గురువుకు వేయబడు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు.

ప్రతియొక్కరు గురుపరీక్షలో జయమును సాధింపవలెను. శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన గురుదేవుడు అప్రయత్నముగా అతనికి నిజమైన ఆధ్యాత్మికావగాహనను ప్రదానము చేయగలడు. గ్రుడ్డిగా అనుసరించుట మరియు అర్థరహిత ప్రశ్నలు వేయుట రెండును ఈ శ్లోకమునందు నిరసింపబడినవి.

ప్రతి యొక్కరు గురువు నుండి అణుకవతో శ్రవణము చేయుటయే గాక, అణుకువ, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను సైతము పొందవలసియున్నది. ఆధ్యాత్మికగురువు తన ప్రవృత్తిరీత్యా శిష్యుని యెడ కరుణను కలిగియుండును. కనుక శిష్యుడు అణుకవతో సదా సేవచేయు సిద్ధపడినపుడు అతని జ్ఞానసముపార్జనము మరియు పరిప్రశ్నలు పూర్ణత్వము నొందగలవు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 196 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 34 🌴

34. tad viddhi praṇipātena paripraśnena sevayā
upadekṣyanti te jñānaṁ jñāninas tattva-darśinaḥ



🌷 Translation :

Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service unto him. The self-realized souls can impart knowledge unto you because they have seen the truth.


🌹 Purport :

The path of spiritual realization is undoubtedly difficult. The Lord therefore advises us to approach a bona fide spiritual master in the line of disciplic succession from the Lord Himself. No one can be a bona fide spiritual master without following this principle of disciplic succession.

The Lord is the original spiritual master, and a person in the disciplic succession can convey the message of the Lord as it is to his disciple. No one can be spiritually realized by manufacturing his own process, as is the fashion of the foolish pretenders. The Bhāgavatam (6.3.19) says, dharmaṁ tu sākṣād bhagavat-praṇītam: the path of religion is directly enunciated by the Lord. Therefore, mental speculation or dry arguments cannot help lead one to the right path.

Nor by independent study of books of knowledge can one progress in spiritual life. One has to approach a bona fide spiritual master to receive the knowledge. Such a spiritual master should be accepted in full surrender, and one should serve the spiritual master like a menial servant, without false prestige. Satisfaction of the self-realized spiritual master is the secret of advancement in spiritual life. Inquiries and submission constitute the proper combination for spiritual understanding.

Unless there is submission and service, inquiries from the learned spiritual master will not be effective. One must be able to pass the test of the spiritual master, and when he sees the genuine desire of the disciple, he automatically blesses the disciple with genuine spiritual understanding.


🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 195: 04వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 195: Chap. 04, Ver. 33


🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 33 🌴

33. శ్రేయాన్ ద్రవ్యమాయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||



🌷. తాత్పర్యం :

ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.


🌷. భాష్యము :

సంపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్ద్వారా భౌతికక్లేశముల నుండి బయటపడి అంత్యమున శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు (కృష్ణభక్తిరసభావనము) నియుక్తమగుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. అయినను ఈ యజ్ఞములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. దానిని ప్రతియొక్కరు తప్పక ఎరుగవలెను.

అదియే మన కర్త యొక్క శ్రద్ధ ననుసరించి యజ్ఞములు వివిధరూపములను దాల్చుచుండును. కర్తకు గల శ్రద్ధ దివ్యజ్ఞానస్థితికి చేరినప్పుడు, అట్టి కర్త జ్ఞానరహితముగా కేవలము తన సంపత్తులను త్యాగము చేయువాని కన్నను శ్రేష్టుడుగా గుర్తింపబడును. ఏలయన జ్ఞానప్రాప్తి కలుగనపుడు యజ్ఞములు భౌతికపరధికే చెంది ఎట్టి ఆధ్యాత్మికలాభమును గూర్చకుండును. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానపు ఉత్కృష్టస్థితియైన కృష్ణభక్తిరసభావనగా మార్పుచెందును.

జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతికకర్మలే కాగలవు. కాని అవి జ్ఞానస్థితికి చేరినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థాయికి చేరగలవు. ఈ యజ్ఞములు వాటి ఉద్దేశ్యముల ననుసరించి కొన్నిమార్లు కర్మకాండగా( కామ్యకర్మములు), మరికొన్నిమార్లు జ్ఞానకాండగా (పరమాత్మాన్వేషణ జ్ఞానము) పిలువబడును. వాటి అంతిమలక్ష్యము జ్ఞానమే యగుట అత్యంత శ్రేష్టము.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 195 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 33 🌴

33. śreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ paran-tapa
sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate



🌷 Translation :

O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pṛthā, all sacrifices of work culminate in transcendental knowledge.


🌹 Purport :

The purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to gain release from material miseries and, ultimately, to engage in loving transcendental service to the Supreme Lord (Kṛṣṇa consciousness). Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer.

When one’s faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material possessions without such knowledge, for without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit.

Real knowledge culminates in Kṛṣṇa consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform. Depending on differences in consciousness, sacrificial activities are sometimes called karma-kāṇḍa (fruitive activities) and sometimes jñāna-kāṇḍa (knowledge in the pursuit of truth). It is better when the end is knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


11 Nov 2019




శ్రీమద్భగవద్గీత - 194: 04వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 194: Chap. 04, Ver. 32


🌹. శ్రీమద్భగవద్గీత - 194 / Bhagavad-Gita - 194 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 32 🌴

32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||


🌷. తాత్పర్యం :

ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియు వివిధకర్మల నుండి ఉద్బవించినవి. వానిని యథార్థరూపములో ఎరుగట ద్వారా నీవు ముక్తిని పొందగలవు.

🌷. భాష్యము :

ఇంతవరకు చర్చింపబడినటువంటి వివిధయజ్ఞములు వివిధకర్తలకు అనుగుణముగా వేదములందు తెలుపబడియున్నవి. మానవుల దేహాత్మభావనలో సంపూర్ణముగా మగ్నులై యుందురు.

కావున మనుజుడు దేహముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని కర్మనొనరించు రీతిగా యజ్ఞములు నిర్ణయింపబడినవి. కాని అంత్యమున దేహము నుండి ముక్తిని పొందుట కొరకే అవియన్నియును నిర్దేశింపబడియున్నవి. ఈ విషయము శ్రీకృష్ణభగవానుని చేతనే స్వయముగా ఇచ్చట నిర్ధారితమైనది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 194 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 32 🌴

32. evaṁ bahu-vidhā yajñā vitatā brahmaṇo mukhe
karma-jān viddhi tān sarvān evaṁ jñātvā vimokṣyase



🌷 Translation :

All these different types of sacrifice are approved by the Vedas, and all of them are born of different types of work. Knowing them as such, you will become liberated.


🌹 Purport :

Different types of sacrifice, as discussed above, are mentioned in the Vedas to suit the different types of worker. Because men are so deeply absorbed in the bodily concept, these sacrifices are so arranged that one can work either with the body, with the mind or with the intelligence. But all of them are recommended for ultimately bringing about liberation from the body. This is confirmed by the Lord herewith from His own mouth.

🌹 🌹 🌹 🌹 🌹


10 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 193: 04వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 193: Chap. 04, Ver. 31





🌹. శ్రీమద్భగవద్గీత -193 / Bhagavad-Gita - 193 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 31 🌴


31. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్య: కురుసత్తమ |

🌷. తాత్పర్యం :

ఓ కురువంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకముగాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?


🌷. భాష్యము :

జీవుడు ఎటువంటి భౌతికస్థితి యందున్నప్పటికిని తన నిజస్థితి యెడ జ్ఞానరహితుడైన యుండును. అనగా పాపజన్మల ఫలముల వలననే భౌతికజగమునందు అస్తిత్వము కలుగుచున్నది. అజ్ఞానము పాపజన్మకు కారణము కాగ, పాపజీవనము మనుజుడు భౌతికత్వమున కొనసాగుటకు కారణమగుచున్నది.

అట్టి భవబంధము నుండి ముక్తిని సాధించుటకు మానవజన్మ యొక్కటే సరియైన మార్గమే యున్నది. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియభోగము, అంత్యమున దుర్భరస్థితి నుండి సంపూర్ణముగా విముక్తి యనెడి మార్గములను చూపుట ద్వారా మనలకు ఒక అవకాశము నొసగుచున్నది.

ధర్మమార్గము (ఇంతవరకు తెలుపబడిన వివిధయజ్ఞ నిర్వహణములు) మన సర్వ ఆర్ధిక పరిస్థితులను అప్రయత్నముగా చక్కబరచగలదు. జనాభివృద్ధి అధికముగా నున్నను యజ్ననిర్వాహణము ద్వారా సమృద్ధిగాగా ఆహారము, పాలు ఆదివి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పడు ఇంద్రియభోగానుభవ భావన కలుగును. కనుకనే వేదములు నియమిత భోగానుభవము కొరకై పవిత్ర వివాహపద్ధతిని నిర్దేశించుచున్నవి.

తద్ద్వార మనుజుడు క్రమముగా భౌతికబంధము నుండి ముక్తుడై ఉన్నతస్థితిని చేరును. అట్టి ముక్తస్థితి యందలి సంపూర్ణత్వమే భగవానునితో సాహచర్యము. పూర్వము వివరించినట్లు అటువంటి సంపూర్ణత్వము యజ్ఞనిర్వాహణము ద్వారానే లభించగలదు. అట్లు వేదములు తెలిపినరీతిగా యజ్ఞమును నిర్వహించుట యందు మనుజడు అనురక్తుడు కానిచో ఈ జన్మమునందైనను సుఖమయ జీవనము ఊహింపలేడు.

ఇక వేరే దేహముతో ఇంకొక లోకమునందు సౌఖ్యమును గూర్చి తెలుపుదనేమున్నది? వివిధయజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును గూర్చుటకు స్వర్గలోకములందు వివిధప్రమాణములలో భౌతికసుఖములు గలవు. కాని కృష్ణభక్తిని చేయుట ద్వారా ఆధ్యాత్మికలోకమును పొందుటయే మానవునికి అత్యంత ఉత్కృష్టమైన ఆనందమై యున్నది. కనుకనే కృష్ణభక్తిరసభావనము సర్వభవక్లేశములకు దివ్యమైన పరిష్కారమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 193 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 31 🌴


31. nāyaṁ loko ’sty ayajñasya kuto ’nyaḥ kuru-sattama


🌷 Translation :

O best of the Kuru dynasty, without sacrifice one can never live happily on this planet or in this life: what then of the next?


🌹 Purport :

Whatever form of material existence one is in, one is invariably ignorant of his real situation. In other words, existence in the material world is due to the multiple reactions to our sinful lives. Ignorance is the cause of sinful life, and sinful life is the cause of one’s dragging on in material existence. The human form of life is the only loophole by which one may get out of this entanglement. The Vedas, therefore, give us a chance for escape by pointing out the paths of religion, economic comfort, regulated sense gratification and, at last, the means to get out of the miserable condition entirely.

The path of religion, or the different kinds of sacrifice recommended above, automatically solves our economic problems. By performance of yajña we can have enough food, enough milk, etc. – even if there is a so-called increase of population. When the body is fully supplied, naturally the next stage is to satisfy the senses. The Vedas prescribe, therefore, sacred marriage for regulated sense gratification.

Thereby one is gradually elevated to the platform of release from material bondage, and the highest perfection of liberated life is to associate with the Supreme Lord. Perfection is achieved by performance of yajña (sacrifice). Now, if a person is not inclined to perform yajña according to the Vedas, how can he expect a happy life even in this body, and what to speak of another body on another planet?

There are different grades of material comforts in different heavenly planets, and in all cases there is immense happiness for persons engaged in different kinds of yajña. But the highest kind of happiness that a man can achieve is to be promoted to the spiritual planets by practice of Kṛṣṇa consciousness. Is therefore the solution to all the problems of material existence

🌹 🌹 🌹 🌹 🌹


9 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 192: 04వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 192: Chap. 04, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 192 / Bhagavad-Gita - 192 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 30 🌴


30. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా: |
యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ ||


🌷. తాత్పర్యం :

యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధిపది, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.


🌷. భాష్యము :

ఇంతవరకు తెలిపిన వివిధ యజ్ఞముల (ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగయజ్ఞము) వివరణను బట్టి ఇంద్రియనిగ్రహమే వాటన్నింటి మూలలక్ష్యమని అవగతమగుచున్నది. ఇంద్రియభోగానుభవమే భవబంధమునకు మూలకారణమై యున్నందున భోగానుభవముకు పరమైన స్థితి యందు నిలువనిదే ఎవ్వరును నిత్యమును మరియు జ్ఞానానందపూర్ణమును అగు నిత్యస్థితికి ఉద్దరింపబడు అవకాశము లేదు. అట్టి స్థితి నిత్యాకాశమునందు (పరబ్రహ్మాకాశము నందు) కలదు.

ఇంతవరకు తెలుపబడిన యజ్ఞములన్నియును భౌతికజీవనపు పాపఫలముల నుండి శుద్ధిపడుటకు మనుజునకు తోడ్పడును. ఇట్టి పురోగతి ద్వారా అతడు జీవితమునందు ఆనందమయుడు మరియు వైభవోపేతుడగుటయే గాక అంత్యమున నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా కాని లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుని సాహచర్యమును పొందుట ద్వారా కాని నిత్యమైన భగవద్ధామమున ప్రవేశింపగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 192 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 30 🌴

30. sarve ’py ete yajña-vido yajña-kṣapita-kalmaṣāḥ
yajña-śiṣṭāmṛta-bhujo yānti brahma sanātanam


🌷 Translation :

All these performers who know the meaning of sacrifice become cleansed of sinful reactions, and, having tasted the nectar of the results of sacrifices, they advance toward the supreme eternal atmosphere.


🌹 Purport :

From the foregoing explanation of different types of sacrifice (namely sacrifice of one’s possessions, study of the Vedas or philosophical doctrines, and performance of the yoga system), it is found that the common aim of all is to control the senses. Sense gratification is the root cause of material existence; therefore, unless and until one is situated on a platform apart from sense gratification, there is no chance of being elevated to the eternal platform of full knowledge, full bliss and full life.

This platform is in the eternal atmosphere, or Brahman atmosphere. All the above-mentioned sacrifices help one to become cleansed of the sinful reactions of material existence. By this advancement in life, not only does one become happy and opulent in this life, but also, at the end, he enters into the eternal kingdom of God, either merging into the impersonal Brahman or associating with the Supreme Personality of Godhead, Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


8 Nov 2019


శ్రీమద్భగవద్గీత - 191: 04వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 191: Chap. 04, Ver. 29


🌹. శ్రీమద్భగవద్గీత - 191 / Bhagavad-Gita - 191 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 29 🌴


29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే(పానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణా: |
అపరే నియతాహారా: ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి

🌷. తాత్పర్యం :

ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి, శ్వాసను సంపూర్ణముగా బంధించి, అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు.

🌷. భాష్యము :

శ్వాసను నియమించునట్టి ఈ యోగాపద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగపద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగమునందలి ప్రారంభదశలో ఆచరింపబడును. ఇంద్రియనిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మికానుభవ పురోగతి కొరకు ఈ విధానములన్నియును ఉద్దేశింపబడినవి. దేహమునందలి వాయువులను నియమించి, వాటిని వాటి విరుద్ధదశలో ప్రసరింపజేయుట ఈ యోగపద్ధతి యందు యత్నింపబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, ప్రాణవాయువు ఊర్థ్వముగా ప్రసరించును.

ఈ రెండు వాయువులు విరుద్ధదశలలో ప్రసరించి, చివరికి పురాకమందు తటస్థము నొందురీతిగా ప్రాణాయామయోగి యత్నించును. ఉచ్చ్వాసమును నిశ్వాసమునందు అర్పించుట యనుననిది రేచకము. ప్రాణాపానవాయుల చలనము సంపూర్ణముగా స్తంభించినప్పుడు మనుజుడు కుంభకయోగమునందు ఉన్నట్లుగా తెలుపబడును. అట్టి కుంభకయోగము ద్వారా ఆధ్యాత్మికజీవన సంపూర్ణత్వమునకై మనుజుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. బుద్ధిమంతుడైన యోగి మరొకజన్మకై వేచియుండక ఈ జన్మమునందే పూర్ణత్వమును సాధించుట యందు అనురక్తుడై యుండును.

దాని కొరకై యోగి కుంభకయోగము ద్వారా జీవనపరిమాణమును అనేక సంవత్సరములు వృద్ధిచేసికొనును. కాని కృష్ణభక్తిభావన యందున్న భక్తుడు సదా శ్రీకృష్ణభగవానుని దివ్యసేవ యందు నిలిచియున్నందున అప్రయత్నముగా ఇంద్రియములపై నియమమును కలిగియే యుండును. సదా కృష్ణుని సేవలో నియుక్తములై యున్నందున అతని ఇంద్రియములు ఇతర కర్మలలో నిలుచు అవకాశముండదు. అట్టి భక్తుడు దేహత్యాగానంతరము సహజముగా శ్రీకృష్ణుని ధామమునకే పోవును గనుక జీవితపరిమాణమును పొడిగించు యత్నములు ఎన్నడును చేయడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 191 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 29 🌴

29. apāne juhvati prāṇaṁ prāṇe ’pānaṁ tathāpare
prāṇāpāna-gatī ruddhvā prāṇāyāma-parāyaṇāḥ
apare niyatāhārāḥ prāṇān prāṇeṣu juhvati



🌷 Translation :

Still others, who are inclined to the process of breath restraint to remain in trance, practice by offering the movement of the outgoing breath into the incoming, and the incoming breath into the outgoing, and thus at last remain in trance, stopping all breathing. Others, curtailing the eating process, offer the outgoing breath into itself as a sacrifice.

🌹 Purport :

This system of yoga for controlling the breathing process is called prāṇāyāma, and in the beginning it is practiced in the haṭha-yoga system through different sitting postures. All of these processes are recommended for controlling the senses and for advancement in spiritual realization. This practice involves controlling the airs within the body so as to reverse the directions of their passage. The apāna air goes downward, and the prāṇa air goes up. The prāṇāyāma-yogī practices breathing the opposite way until the currents are neutralized into pūraka, equilibrium. Offering the exhaled breath into the inhaled breath is called recaka. When both air currents are completely stopped, one is said to be in kumbhaka-yoga.

By practice of kumbhaka-yoga, one can increase the duration of life for perfection in spiritual realization. The intelligent yogī is interested in attaining perfection in one life, without waiting for the next. For by practicing kumbhaka-yoga, the yogīs increase the duration of life by many, many years. A Kṛṣṇa conscious person, however, being always situated in the transcendental loving service of the Lord, automatically becomes the controller of the senses. His senses, being always engaged in the service of Kṛṣṇa, have no chance of becoming otherwise engaged. So at the end of life, he is naturally transferred to the transcendental plane of Lord Kṛṣṇa; consequently he makes no attempt to increase his longevity.

🌹 🌹 🌹 🌹 🌹


7 Nov 2019

శ్రీమద్భగవద్గీత - 190: 04వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 190: Chap. 04, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 190 / Bhagavad-Gita - 190 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 28 🌴


28. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయయజ్ఞాశ్చ యతయ: సంశితవ్రతా: ||

🌷. తాత్పర్యం :

కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్రతపస్సులను చేయుట ద్వారా, అష్టాంగయోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞానపురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు.

🌷. భాష్యము :

ఇచ్చట తెలుపబడిన యజ్ఞములను వివిధభాగములుగా విభజింపవచ్చును. పలువిధములైన దానముల రూపములలో తమ సంపత్తులను త్యాగము చేయువారు కొందరు కలరు. ధార్మిక కర్మలన్నియును “ద్రవ్యమయ యజ్ఞములు” అని పిలువబడును.

మరికొందరు ఉన్నత జీవనప్రాప్తి కొరకు లేదా ఉన్నత లోకములకు ఉద్దరింప బడుట కొరకు చంద్రాయణము మరియు చాతుర్మాస్యము వంటి పలువిధములైన కటిననియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరింతురు. ఈ విధానములందు నియమపూర్ణ జీవితమును గడుపుటకు తీవ్రవ్రతములను పాటింపవలసియుండును. ఉదాహరణకు చాతుర్మాస్యదీక్ష యందు మనుజుడు నాలుగునెలలు (జూలై నుండి అక్టోబరు) గడ్డమును తొలగించుకొనడు. కొన్నిరకముల ఆహారమును స్వీకరింపక ఏకభుక్తముండును. గృహమును విడిచి వెళ్ళకుండును. జీవిత సుఖమును త్యాగమొనర్చునటు వంటి ఆ యజ్ఞములు “తపోమయ యజ్ఞములు” అని పిలువబడును.

ఇంకను మరికొందరు బ్రహ్మమునందు లీనమవగోరి పతంజలి యోగము నందు గాని, హఠయోగము లేదా అష్టాంగ యోగము నందు కాని (సిద్ధులను కోరి) నియుక్తులగుదురు. ఇంకొందరు వివిధములైన తీర్థస్థానముల కేగుచుందురు. ఈ అభ్యాసములు భౌతికజగము నందు ఏదియో ఒక సిద్ధిని కోరి ఒనరింపబడును యోగ యజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వేదశాస్త్రములను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనము చేయుట యందు నియుక్తులగుదురు. అట్టివి స్వాధ్యాయయజ్ఞములు.

ఈ విధముగా యోగులందరను వివిధములైన యజ్ఞములందు నియుక్తులై ఉన్నతజీవనస్థితిని పొందగోరి యుందురు. కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవయై యున్నందున కృష్ణభక్తిరసభావన యనునది వీటన్నింటికి భిన్నమైనది. అది పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను గాక కేవలము శ్రీకృష్ణభగవానుడు మరియు అతని ప్రామాణిక భక్తుల కరుణా చేతనే ప్రాప్తము కాగలదు. కనుకనే కృష్ణభక్తిరసభావనము దివ్యమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 190 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 28 🌴

28. dravya-yajñās tapo-yajñā yoga-yajñās tathāpare
svādhyāya-jñāna-yajñāś ca yatayaḥ saṁśita-vratāḥ


🌷 Translation :

Having accepted strict vows, some become enlightened by sacrificing their possessions, and others by performing severe austerities, by practicing the yoga of eightfold mysticism, or by studying the Vedas to advance in transcendental knowledge.


🌹 Purport :

These sacrifices may be fitted into various divisions. There are persons who are sacrificing their possessions in the form of various kinds of charities. All charitable activities are called dravyamaya-yajña. There are others who, for higher elevation in life or for promotion to higher planets within the universe, voluntarily accept many kinds of austerities such as candrāyaṇa and cāturmāsya. These processes entail severe vows for conducting life under certain rigid rules. For example, under the cāturmāsya vow the candidate does not shave for four months during the year (July to October), he does not eat certain foods, does not eat twice in a day or does not leave home. Such sacrifice of the comforts of life is called tapomaya-yajña.

There are still others who engage themselves in different kinds of mystic yogas like the Patañjali system (for merging into the existence of the Absolute), or haṭha-yoga or aṣṭāṅga-yoga (for particular perfections). And some travel to all the sanctified places of pilgrimage. All these practices are called yoga-yajña, sacrifice for a certain type of perfection in the material world. There are others who engage themselves in the studies of different Vedic literatures, specifically the Upaniṣads and Vedānta-sūtras, or the Sāṅkhya philosophy. All of these are called svādhyāya-yajña, however, is different from these because it is the direct service of the Supreme Lord. Kṛṣṇa consciousness cannot be attained by any one of the above-mentioned types of sacrifice but can be attained only by the mercy of the Lord. Therefore, Kṛṣṇa consciousness is transcendental.

🌹 🌹 🌹 🌹 🌹


6 Nov 2019