శ్రీమద్భగవద్గీత - 650: 18వ అధ్., శ్లో 67 / Bhagavad-Gita - 650: Chap. 18, Ver. 67


🌹. శ్రీమద్భగవద్గీత - 650 / Bhagavad-Gita - 650 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 67 🌴

67. ఇదం తే నాతపస్కాయ
నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం
న చ మాం యోభ్యసూయతి ||

🌷. తాత్పర్యం :

ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కానివారికి గాని, భక్తులు కానివారికి గాని, భక్తియుతసేవలో నిలువనివారికి గాని, నా యెడ అసూయను కలిగినవారికి గాని ఎన్నడును వివరించరాదు.

🌷. భాష్యము :

ధర్మవిధానములందలి తపస్సులకు ఆచరింపనివారికి, కృష్ణభక్తిభావనలో భక్తియోగమును నిర్వహింప సమకట్టనివారికి, శుద్ధభక్తుని సేవింపనివారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించువారికి లేదా శ్రీకృష్ణుని గొప్పతనము నెడ అసూయను కలిగియుండువారికి ఈ గుహ్యతమజ్ఞానమును వివరింపరాదు. అయినను దానవప్రవృత్తి కలిగి శ్రీకృష్ణుని యెడ అసూయను కలిగినవారు సైతము కొన్నిమార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును.

అట్టివారు భిన్నవిధములుగా గీతావ్యాఖ్యానము చేయుట యనెడి వృత్తిని చేపట్టి, దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కాని శ్రీకృష్ణుని యథార్థముగా తెలిసికొనగోరువారు మాత్రము అట్టి గీతావ్యాఖ్యానముల నుండి దూరులు కావలెను. భోగలాలసులైనవారికి గీతాప్రయోజనము అవగతము కాదు.

భోగలాలసుడు కాకుండ, వేదనిర్దేశితములైన నియమములను కచ్చితముగా పాటించువాడు సైతము ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలడు. తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణపరకర్మల యందు మాత్రము నియుక్తులు కానివారు కూడా శ్రీకృష్ణుని ఎరుగజాలరు.

శ్రీకృష్ణుడు తాను దేవదేవుడనియు మరియు తనకు సమానమైనది లేదా తనకున్నను అధికమైనది వేరొక్కటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని యెడ అసూయను కలిగినవారు పలువురుందురు. కృష్ణుని యెడ అసూయను కలిగియుండెడి అట్టివారు గీతావగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు.

శ్రద్దారహితులైనవారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతము చేసికొను అవకాశమే లేదు. కనుక శుద్ధభక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతము చేసికొనకుండ ఎవ్వరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 650 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 67 🌴

67. idaṁ te nātapaskāya
nābhaktāya kadācana
na cāśuśrūṣave vācyaṁ
na ca māṁ yo ’bhyasūyati

🌷 Translation :

This confidential knowledge may never be explained to those who are not austere, or devoted, or engaged in devotional service, nor to one who is envious of Me.

🌹 Purport :

Persons who have not undergone the austerities of the religious process, who have never attempted devotional service in Kṛṣṇa consciousness, who have not tended a pure devotee, and especially those who are conscious of Kṛṣṇa only as a historical personality or who are envious of the greatness of Kṛṣṇa should not be told this most confidential part of knowledge.

It is, however, sometimes found that even demoniac persons who are envious of Kṛṣṇa, worshiping Kṛṣṇa in a different way, take to the profession of explaining Bhagavad-gītā in a different way to make business, but anyone who desires actually to understand Kṛṣṇa must avoid such commentaries on Bhagavad-gītā.

Actually the purpose of Bhagavad-gītā is not understandable to those who are sensuous. Even if one is not sensuous but is strictly following the disciplines enjoined in the Vedic scripture, if he is not a devotee he also cannot understand Kṛṣṇa.

And even when one poses himself as a devotee of Kṛṣṇa but is not engaged in Kṛṣṇa conscious activities, he also cannot understand Kṛṣṇa. There are many persons who envy Kṛṣṇa because He has explained in Bhagavad-gītā that He is the Supreme and that nothing is above Him or equal to Him. There are many persons who are envious of Kṛṣṇa.

Such persons should not be told of Bhagavad-gītā, for they cannot understand. There is no possibility of faithless persons’ understanding Bhagavad-gītā and Kṛṣṇa. Without understanding Kṛṣṇa from the authority of a pure devotee, one should not try to comment upon Bhagavad-gītā.

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021