శ్రీమద్భగవద్గీత - 630: 18వ అధ్., శ్లో 47 / Bhagavad-Gita - 630: Chap. 18, Ver. 47


🌹. శ్రీమద్భగవద్గీత - 630  / Bhagavad-Gita - 630 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 47 🌴*

47. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||

🌷. తాత్పర్యం : 
పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా ఒనరించుట కన్నను అసమగ్రముగా ఒనరించినను స్వధర్మమునందే నియుక్తమగుట మేలైనది. గుణముల ననుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడును పాపఫలములచే ప్రభావితములు కావు.

🌷. భాష్యము  :
స్వధర్మాచరణమే భగవద్గీత యందు ఉపదేశింపబడినది. గడచిన శ్లోకములందు వివరింపబడినట్లు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ధర్మములు వారివారి గుణముల ననుసరించియే నిర్దేశింపబడినవి. ఒకరు వేరొకరి ధర్మమును అనుకరించరాదు. 

శూద్రకర్మల యందు అనురక్తుడైనవాడు బ్రాహ్మణ వంశమున జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమముగా ప్రకటించుకొనరాదు. ఈ విధముగా ప్రతియొక్కరు తమ గుణముల ననుసరించియే కర్మనొనరించవలెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవార్థమేయైనచో ఎట్టి కర్మయు హేయమైనది కాబోదు. బ్రాహ్మణుని స్వధర్మము నిక్కముగా సత్త్వగుణప్రధానమై యుండును. కనుక స్వభావరీత్యా సత్త్వగుణమునందు లేనివాడు బ్రాహ్మణుని స్వధర్మము నెన్నడును అనుకరింపరాదు. 

క్షత్రియడైనవాడు కొన్నిమార్లు శత్రుసంహారము కొరకు ఉగ్రుడగుట, రాజనీతి కొరకై అసత్యములాడుట వంటి హేయకార్యములను ఒనరింపవలసివచ్చును. రాచకార్యములు అటువంటి హింస మరియు కుటిలత్వములను  కూడియున్నను క్షత్రియుడైనవాడు తన స్వధర్మమును విడిచి బ్రాహ్మణధర్మమును నిర్వహించుటకు యత్నింపరాదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ప్రతియొక్కరు కర్మనొనరించవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 630 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga -  The Perfection of Renunciation  - 47 🌴*

47. śreyān sva-dharmo viguṇaḥ
para-dharmāt sv-anuṣṭhitāt
svabhāva-niyataṁ karma
kurvan nāpnoti kilbiṣam

🌷 Translation : 
It is better to engage in one’s own occupation, even though one may perform it imperfectly, than to accept another’s occupation and perform it perfectly. Duties prescribed according to one’s nature are never affected by sinful reactions.

🌹 Purport :
One’s occupational duty is prescribed in Bhagavad-gītā. As already discussed in previous verses, the duties of a brāhmaṇa, kṣatriya, vaiśya and śūdra are prescribed according to their particular modes of nature. One should not imitate another’s duty. 

A man who is by nature attracted to the kind of work done by śūdras should not artificially claim to be a brāhmaṇa, although he may have been born into a brāhmaṇa family. In this way one should work according to his own nature; no work is abominable, if performed in the service of the Supreme Lord. The occupational duty of a brāhmaṇa is certainly in the mode of goodness, but if a person is not by nature in the mode of goodness, he should not imitate the occupational duty of a brāhmaṇa. 

For a kṣatriya, or administrator, there are so many abominable things; a kṣatriya has to be violent to kill his enemies, and sometimes a kṣatriya has to tell lies for the sake of diplomacy. Such violence and duplicity accompany political affairs, but a kṣatriya is not supposed to give up his occupational duty and try to perform the duties of a brāhmaṇa. One should act to satisfy the Supreme Lord. 
🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021