శ్రీమద్భగవద్గీత - 640: 18వ అధ్., శ్లో 57 / Bhagavad-Gita - 640: Chap. 18, Ver. 57


🌹. శ్రీమద్భగవద్గీత - 640 / Bhagavad-Gita - 640 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 57 🌴

57. చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పర: |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త: సతతం భవ ||


🌷. తాత్పర్యం :

సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుతసేవలో సంపూర్ణముగా నా యందే చిత్తము కలవాడగుము.


🌷. భాష్యము :

మనుజుడు కృష్ణభక్తిభావన యందు వర్తించినపుడు తాను జగమునకు ప్రభువునన్న భావనలో వర్తించడు. వాస్తవమునకు ప్రతియొక్కరు సంపూర్ణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తించవలసియున్నది.

సేవకుడైనవాడు కర్మ విషయమున స్వతంత్రతను కలిగియుండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసివచ్చును. అదే విధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టములతో ప్రభావితుడు గాకుండును.

అతడు కేవలము తన విధ్యుక్తధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము ఒనరించుచుండును. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించియుండెను. కాని శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజడు ఎట్లు వర్తించవలెనని ఎవరైనను వాదించు అవకాశము కలదు.

ఈ గీతాగ్రంథమునందు శ్రీకృష్ణభగవానుడు తెలిపిన నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధియైన గురువు యొక్క నేతృత్వములో మనుజుడు కర్మనొనరించినచో శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమే కలుగుననుట దానికి సమాధానము.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 640 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 57 🌴

57. cetasā sarva-karmāṇi
mayi sannyasya mat-paraḥ
buddhi-yogam upāśritya
mac-cittaḥ satataṁ bhava


🌷 Translation :

In all activities just depend upon Me and work always under My protection. In such devotional service, be fully conscious of Me.


🌹 Purport :

When one acts in Kṛṣṇa consciousness, he does not act as the master of the world. Just like a servant, one should act fully under the direction of the Supreme Lord. A servant has no individual independence.

He acts only on the order of the master. A servant acting on behalf of the supreme master is unaffected by profit and loss. He simply discharges his duty faithfully in terms of the order of the Lord.

Now, one may argue that Arjuna was acting under the personal direction of Kṛṣṇa but when Kṛṣṇa is not present how should one act? If one acts according to the direction of Kṛṣṇa in this book, as well as under the guidance of the representative of Kṛṣṇa, then the result will be the same.

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2021