శ్రీమద్భగవద్గీత - 646: 18వ అధ్., శ్లో 63 / Bhagavad-Gita - 646: Chap. 18, Ver. 63

 

🌹. శ్రీమద్భగవద్గీత - 646 / Bhagavad-Gita - 646 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 63 🌴

63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||


🌷. తాత్పర్యం : 

ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి, పిదప తోచిన రీతి ఒనరింపుము.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బ్రహ్మభూతజ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించెను. బ్రహ్మభూతస్థితి యందున్నవాడు సదా ఆనందపూర్ణుడై యుండును. అతడు శోకించుటను యొరుగడు మరియు దేనిని వాంచింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూతజ్ఞానమే కారణము. 

బ్రహ్మభూతజ్ఞానమునే గాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము సైతము అర్జునునకు తెలియపరిచెను. అదియును బ్రహ్మజ్ఞానమేయైనను బ్రహ్మభూతజ్ఞానము కన్నను ఉన్నతమైనది.

ఇచ్చట “యథేచ్చసి తథా కురు” అను పదము శ్రీకృష్ణభగవానుడు జీవులకు గల అతిసూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యము కలుగచేసికొనడని సూచించుచున్నది. 

మానవుడు ఏ విధముగా తన జీవనస్థితిని వృద్ధిచేసికొనగలడో శ్రీకృష్ణభగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరిచియున్నాడు. హృదయస్థుడైన పరమాత్మునకు శరణుపొందుమని అర్జునునకు ఒసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరియైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపవలసియున్నది. 

అట్టి అంగీకారము మనుజుడు సదా మానవజన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితియైనటువంటి కృష్ణభక్తిభావనలో నిలిచియుండుటకు తోడ్పడగలదు. యుద్ధము చేయుమని అర్జునుడు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. 

భగవానుని శరణువేడుట జీవుల లాభమునకే గాని, భగవానుని లాభము కొరకు కాదు. కాని శరణాగతికి ముందు తమ బుద్ధిననుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసికొనుటకు ప్రతియొక్కరు స్వాతంత్ర్యమును కలిగియున్నారు. అదియే దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును ఆంగీకరించుటకు ఉత్తమమార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి కూడా లభింపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 646 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 63 🌴

63. iti te jñānam ākhyātaṁ
guhyād guhya-taraṁ mayā
vimṛśyaitad aśeṣeṇa
yathecchasi tathā kuru


🌷 Translation : 

Thus I have explained to you knowledge still more confidential. Deliberate on this fully, and then do what you wish to do.


🌹 Purport :

The Lord has already explained to Arjuna the knowledge of brahma-bhūta. One who is in the brahma-bhūta condition is joyful; he never laments, nor does he desire anything. That is due to confidential knowledge. Kṛṣṇa also discloses knowledge of the Supersoul. This is also Brahman knowledge, knowledge of Brahman, but it is superior.

Here the words yathecchasi tathā kuru – “As you like, you may act” – indicate that God does not interfere with the little independence of the living entity. In Bhagavad-gītā, the Lord has explained in all respects how one can elevate his living condition. 

The best advice imparted to Arjuna is to surrender unto the Supersoul seated within his heart. By right discrimination, one should agree to act according to the order of the Supersoul. 

That will help one become situated constantly in Kṛṣṇa consciousness, the highest perfectional stage of human life. Arjuna is being directly ordered by the Personality of Godhead to fight. Surrender to the Supreme Personality of Godhead is in the best interest of the living entities. It is not for the interest of the Supreme. 

Before surrendering, one is free to deliberate on this subject as far as the intelligence goes; that is the best way to accept the instruction of the Supreme Personality of Godhead. Such instruction comes also through the spiritual master, the bona fide representative of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2021