శ్రీమద్భగవద్గీత - 634: 18వ అధ్., శ్లో 51 / Bhagavad-Gita - 634: Chap. 18, Ver. 51


🌹. శ్రీమద్భగవద్గీత - 634 / Bhagavad-Gita - 634 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 51 🌴

51. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||


🌷. తాత్పర్యం :

బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగద్వేషముల నుండి విడివడియున్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి దృఢనిశ్చయముచే మనోనిగ్రహము కలిగియున్నందునను ఏకాంతస్థానమున వసించువాడును,


🌷. భాష్యము :

బుద్ధిచే పవిత్రుడైనపుడు మనుజుడు సత్త్వగుణమునందు స్థితుడగును. ఆ విధముగా అతడు మనస్సును నియమింపగలిగి సదా సమాధిస్థితుడు కాగలడు. ఇంద్రియార్థముల యెడ ఆసక్తుడు కానటువంటి అతడు తన కర్మల యందు రాగద్వేషములకు దూరుడగును.

అటువంటి అనాసక్త మనుజుడు సహజముగా ఏకాంతప్రదేశ వాసమునే కోరుచు, మితముగా భుజించును, దేహము, మనస్సు చేయు కర్మలను నియమించుచుండును. దేహమును ఆత్మగా భావింపనందున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. అదేవిధముగా పలు విషయవస్తువుల సేకరణ ద్వారా అతడు దేహమును తృప్తిపరుచుట వాంచింపడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 634 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 51 🌴


51. buddhyā viśuddhayā yukto
dhṛtyātmānaṁ niyamya ca
śabdādīn viṣayāṁs tyaktvā
rāga-dveṣau vyudasya ca


🌷 Translation :

Being purified by his intelligence and controlling the mind with determination, giving up the objects of sense gratification, being freed from attachment and hatred, one who lives in a secluded place,


🌹 Purport :

When one is purified by intelligence, he keeps himself in the mode of goodness. Thus one becomes the controller of the mind and is always in trance. He is not attached to the objects of sense gratification, and he is free from attachment and hatred in his activities.

Such a detached person naturally prefers to live in a secluded place, he does not eat more than what he requires, and he controls the activities of his body and mind. He has no false ego because he does not accept the body as himself. Nor has he a desire to make the body fat and strong by accepting so many material things.

🌹 🌹 🌹 🌹 🌹


09 Feb 2021