శ్రీమద్భగవద్గీత - 647: 18వ అధ్., శ్లో 64 / Bhagavad-Gita - 647: Chap. 18, Ver. 64


🌹. శ్రీమద్భగవద్గీత - 647 / Bhagavad-Gita - 647 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 64 🌴

64. సర్వగుహ్యతమం భూయ: శ్రుణు మే పరమం వచ: |
ఇష్టోసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితమ్ ||


🌷. తాత్పర్యం :

నీకు నాకు ప్రియమిత్రుడవైనందున జ్ఞానములలో కెల్ల గుహ్యతమమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపుము.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తొలుత రహస్యజ్ఞానమును (బ్రహ్మజ్ఞానమును), పిదప రహస్యతరజ్ఞానమును (హృదయస్థ పరమాత్మజ్ఞానము) ఒసగి ఇప్పుడు రహస్యతరమైన జ్ఞానమును అందించనున్నాడు.

పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణునకు శరణము నొందుటయే అట్టి రహస్యతమమైన జ్ఞానము. నవమాధ్యాయముయొక్క చివరన “ఎల్లప్పుడు నన్నే చింతింపుము” (మన్మనా:) అని తెలిపిన విషయమునే తిరిగి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు.

గీతోదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కిచెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి ఒసగబడుచున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే (కృష్ణభక్తుడు) అవగతము చేసికొనగలడు. సామాన్యమానవుడు దానినెన్నడును తెలిసికొనజాలడు.

శ్రీకృష్ణభగవానుడు ఒసగనున్న ఈ ఉపదేశము వేదోపదేశములలో అత్యంతముఖ్యమై యున్నది. అనగా ఈ విషయమున శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్యభాగమై, అర్జునుని చేతనే గాక సర్వజీవులచే అనుసరణీయమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 647 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 64 🌴

64. sarva-guhyatamaṁ bhūyaḥ
śṛṇu me paramaṁ vacaḥ
iṣṭo ’si me dṛḍham iti
tato vakṣyāmi te hitam


🌷 Translation :

Because you are My very dear friend, I am speaking to you My supreme instruction, the most confidential knowledge of all. Hear this from Me, for it is for your benefit.


🌹 Purport :

The Lord has given Arjuna knowledge that is confidential (knowledge of Brahman) and still more confidential (knowledge of the Supersoul within everyone’s heart), and now He is giving the most confidential part of knowledge: just surrender unto the Supreme Personality of Godhead.

At the end of the Ninth Chapter He has said, man-manāḥ: “Just always think of Me.” The same instruction is repeated here to stress the essence of the teachings of Bhagavad-gītā. This essence is not understood by a common man, but by one who is actually very dear to Kṛṣṇa, a pure devotee of Kṛṣṇa.

This is the most important instruction in all Vedic literature. What Kṛṣṇa is saying in this connection is the most essential part of knowledge, and it should be carried out not only by Arjuna but by all living entities.

🌹 🌹 🌹 🌹 🌹


23 Feb 2021