శ్రీమద్భగవద్గీత - 632: 18వ అధ్., శ్లో 49 / Bhagavad-Gita - 632: Chap. 18, Ver. 49


🌹. శ్రీమద్భగవద్గీత - 632  / Bhagavad-Gita - 632 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 49 🌴

49. ఆసక్తబుద్ధి: సర్వత్ర జితాత్మా విగతస్పృహ: |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం : 
ఆత్మనిగ్రహము కలవాడును, అనాసక్తుడును, భౌతికసుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్న్యాసము ద్వారా కర్మఫల విముక్తి యనెడి అత్యున్నత పూర్ణత్వస్థాయిని బడయగలడు.

🌷. భాష్యము  :
తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు, తత్కారణముగా తన కర్మఫలముల ననుభవించు అధికారము తనకు లేదనియు ప్రతియొక్కరు తలచవలెను. నిజమైన సన్న్యాసము యొక్క భావమిదియే. 

వాస్తవమునకు అతడు శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అతని కర్మల ఫలములన్నియును శ్రీకృష్ణుని చేతనే అనుభవనీయములై యున్నవి. ఇదియే నిజమైన కృష్ణభక్తిరసభావనము. అనగా కృష్ణభక్తిభావన యందు వర్తించువాడు నిజముగా సన్న్యాసియే. అతడు సన్న్యాసాశ్రమమునందున్నట్టివాడే. 

అటువంటి భావనలో వర్తించువాడు కృష్ణుని ప్రీత్యర్థమై వర్తించుచున్నందున సదా సంతృప్తుడై యుండగలడు. భౌతికవిషయముల యెడ అనురక్తుడు గాక అట్టివాడు భగవానుని దివ్యసేవానందమునకు అన్యమైన ఆనందమును పొందుట యందు అలవాటు లేకుండును. వాస్తవమునకు సన్న్యాసియైనవాడు పూర్వకర్మఫలముల నుండి ముక్తుడై యుండవలెను. కాని కృష్ణభక్తిభావనాయుతుడైన మనుజుడు నామమాత్ర సన్న్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పూర్ణత్వమును బడయగలడు. 

అటువంటి మన:స్థితియే “యోగారూఢత్వము” అనబడును. అదియే యోగమునందలి పూర్ణస్థితి. తృతీయాధ్యాయమున నిర్ధారింపబడినట్లు “యస్త్వాత్మరతి రేవ స్యాత్ – ఆత్మ యందే తృప్తి నొందువానికి ఎటువంటి కర్మఫలముల భయముండదు.”
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 632 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga -  The Perfection of Renunciation  - 49 🌴

49. asakta-buddhiḥ sarvatra
jitātmā vigata-spṛhaḥ
naiṣkarmya-siddhiṁ paramāṁ
sannyāsenādhigacchati

🌷 Translation : 
One who is self-controlled and unattached and who disregards all material enjoyments can obtain, by practice of renunciation, the highest perfect stage of freedom from reaction.

🌹 Purport :
Real renunciation means that one should always think himself part and parcel of the Supreme Lord and therefore think that he has no right to enjoy the results of his work. Since he is part and parcel of the Supreme Lord, the results of his work must be enjoyed by the Supreme Lord. This is actually Kṛṣṇa consciousness. The person acting in Kṛṣṇa consciousness is really a sannyāsī, one in the renounced order of life. By such a mentality, one is satisfied because he is actually acting for the Supreme. 

Thus he is not attached to anything material; he becomes accustomed to not taking pleasure in anything beyond the transcendental happiness derived from the service of the Lord. A sannyāsī is supposed to be free from the reactions of his past activities, but a person who is in Kṛṣṇa consciousness automatically attains this perfection without even accepting the so-called order of renunciation. 

This state of mind is called yogārūḍha, or the perfectional stage of yoga. As confirmed in the Third Chapter, yas tv ātma-ratir eva syāt: one who is satisfied in himself has no fear of any kind of reaction from his activity.
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021