శ్రీమద్భగవద్గీత - 633: 18వ అధ్., శ్లో 50 / Bhagavad-Gita - 633: Chap. 18, Ver. 50


🌹. శ్రీమద్భగవద్గీత - 633 / Bhagavad-Gita - 633 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 50 🌴

50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||


🌷. తాత్పర్యం :

ఓ కుంతీపుత్రా! ఇట్టి పూర్ణత్వమును పొందినవాడు నేను ఇపుడు సంగ్రహముగా చెప్పాబోవు రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితియైన పరమపూర్ణత్వస్థితిని (పర బ్రహ్మము) ఏ విధముగా బడయగలడో నీవు ఆలకింపుము.


🌷. భాష్యము :

కేవలము స్వధర్మమునందు నెలకొనినవాడై దానిని భగవంతుని కొరకు ఒనరించుట ద్వారా ఏ విధముగా మనుజుడు అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయగలడో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరించుచున్నాడు.

కర్మఫలములను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై త్యాగమొనర్చుట ద్వారా మానవుడు బ్రహ్మముయొక్క దివ్యస్థితి బడయగలడు. అదియే ఆత్మానుభవ విధానము. నిజమైన జ్ఞానపూర్ణత్వము పవిత్రమగు కృష్ణభక్తిభావనను పొందుట యందే గలదు. ఈ విషయము రాబోవు శ్లోకములందు వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 633 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 50 🌴

50. siddhiṁ prāpto yathā brahma
tathāpnoti nibodha me
samāsenaiva kaunteya
niṣṭhā jñānasya yā parā


🌷 Translation :

O son of Kuntī, learn from Me how one who has achieved this perfection can attain to the supreme perfectional stage, Brahman, the stage of highest knowledge, by acting in the way I shall now summarize.


🌹 Purport :

The Lord describes for Arjuna how one can achieve the highest perfectional stage simply by being engaged in his occupational duty, performing that duty for the Supreme Personality of Godhead.

One attains the supreme stage of Brahman simply by renouncing the result of his work for the satisfaction of the Supreme Lord. That is the process of self-realization. The actual perfection of knowledge is in attaining pure Kṛṣṇa consciousness; that is described in the following verses.

🌹 🌹 🌹 🌹 🌹


08 Feb 2021