శ్రీమద్భగవద్గీత - 641: 18వ అధ్., శ్లో 58 / Bhagavad-Gita - 641: Chap. 18, Ver. 58
🌹. శ్రీమద్భగవద్గీత - 641 / Bhagavad-Gita - 641 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 58 🌴
58. మచ్చిత్త: సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి ||
🌷. తాత్పర్యం :
నా యందు చిత్తము గలవాడైనచో నా కరుణచే బద్ధజీవనపు ఆటంకముల నన్నింటిని దాటగలవు. కాని ఒకవేళ నామాట వినక అట్టి భావనలో గాక మిథ్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశమును పొందగలవు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడైనవాడు తన జీవనమునకై ఒనరింపవలసిన ధర్మముల యెడ అనవసర చింతను కలిగియుండడు. అటువంటి చింతారాహిత్యమును మూఢుడైనవాడు ఏ మాత్రము అవగాహన చేసికొనజాలడు.
భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే గాంచును. ఇరువదినాలుగు గంటలు తన ప్రీత్యర్థమే కర్మనొనరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకొనును.
కనుక దేహాత్మభావన యందలి మిథ్యాహంకారముచే ఎవ్వరును మోహమునొందరాదు. ప్రకృతినియమములకు లేదా కర్మఫలములకు తాను పరుడనని భావింపరాదు. వాస్తవమునకు ప్రతియొక్కరు కఠినమైన ప్రకృతినియమములకు లోబడియే యుందురు.
కాని కృష్ణభక్తిభావనలో కర్మనొనరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణభక్తిభావనలో వర్తించనివాడు జన్మ, మృత్యు సాగరమనెడి సుడిగుండమున నశించుచున్నవానిగా ప్రతియొక్కరు గమనింపవలెను. చేయదగినదేదో, చేయరనిదేదో ఏ బద్ధజీవుడును వాస్తవముగా ఎరుగాజాలడు.
కాని శ్రీకృష్ణుడే అంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మికగురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణభక్తిరసభావితుడు మాత్రము కర్మ యందు వర్తించ స్వేచ్చను కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 641 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 58 🌴
58. mac-cittaḥ sarva-durgāṇi
mat-prasādāt tariṣyasi
atha cet tvam ahaṅkārān
na śroṣyasi vinaṅkṣyasi
🌷 Translation :
If you become conscious of Me, you will pass over all the obstacles of conditioned life by My grace. If, however, you do not work in such consciousness but act through false ego, not hearing Me, you will be lost.
🌹 Purport :
A person in full Kṛṣṇa consciousness is not unduly anxious about executing the duties of his existence. The foolish cannot understand this great freedom from all anxiety.
For one who acts in Kṛṣṇa consciousness, Lord Kṛṣṇa becomes the most intimate friend. He always looks after His friend’s comfort, and He gives Himself to His friend, who is so devotedly engaged working twenty-four hours a day to please the Lord. Therefore, no one should be carried away by the false ego of the bodily concept of life.
One should not falsely think himself independent of the laws of material nature or free to act. He is already under strict material laws. But as soon as he acts in Kṛṣṇa consciousness, he is liberated, free from the material perplexities. One should note very carefully that one who is not active in Kṛṣṇa consciousness is losing himself in the material whirlpool, in the ocean of birth and death.
No conditioned soul actually knows what is to be done and what is not to be done, but a person who acts in Kṛṣṇa consciousness is free to act because everything is prompted by Kṛṣṇa from within and confirmed by the spiritual master.
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021