శ్రీమద్భగవద్గీత - 637: 18వ అధ్., శ్లో 54 / Bhagavad-Gita - 637: Chap. 18, Ver. 54


🌹. శ్రీమద్భగవద్గీత - 637 / Bhagavad-Gita - 637 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 54 🌴

54. బ్రహ్మభూత: ప్రసన్నాత్మా
న శోచతి న కాంక్షతి |
సమ: సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరాం ||


🌷. తాత్పర్యం :

ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్టితుడైనవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకించక, దేనిని వాంచింపక అట్టివాడు సర్వజీవుల యెడ సమత్వభావమును కలిగియుండును. అటువంటి స్థితి యందే అతడు నా శుద్ధభక్తియుత సేవను పొందుచున్నాడు.


🌷. భాష్యము :

నిరాకారవాదికి పరతత్త్వముతో ఏకమగుట యనెడి బ్రహ్మభూతస్థితిని పొందుటయే చరమగమ్యము. కాని సాకారవాది లేదా శుద్ధభక్తుడు శుద్ధమగు భక్తియుతసేవ యందు నెలకొనుట ఆ స్థితిని కూడా దాటి, ఇంకను పురోగమించవలెను.

అనగా శ్రీకృష్ణభగవానుని భక్తిపూర్వక సేవయందు నిలిచినవాడు బ్రహ్మభూతస్థితి యందు నిలిచియున్నట్టివాడే యని అర్థము. వాస్తవమునకు పరబ్రహ్మముతో ఏకము కానిదే ఎవ్వరును ఆ దేవదేవునికి సేవనొనర్చులేరు. దివ్యభావనలో సేవ్యుడు, సేవకుల నడుమ భేదము లేకున్నను, ఉన్నత ఆధ్యాత్మికభావనలో వారి నడుమ తారతమ్యము తప్పక ఉండును.

భౌతికభావనలో స్వీయతృప్తి కొరకు మనుజుడు కర్మనొనరించినపుడు దుఃఖము కలుగుచుండును. కాని ఆధ్యాత్మికజగమునందు శుద్ధభక్తి యందు నెలకొనినపుడు దుఃఖము కలుగదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 637 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 54 🌴

54. brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām


🌷 Translation :

One who is thus transcendentally situated at once realizes the Supreme Brahman and becomes fully joyful. He never laments or desires to have anything. He is equally disposed toward every living entity. In that state he attains pure devotional service unto Me.


🌹 Purport :

To the impersonalist, achieving the brahma-bhūta stage, becoming one with the Absolute, is the last word. But for the personalist, or pure devotee, one has to go still further, to become engaged in pure devotional service.

This means that one who is engaged in pure devotional service to the Supreme Lord is already in a state of liberation, called brahma-bhūta, oneness with the Absolute. Without being one with the Supreme, the Absolute, one cannot render service unto Him. In the absolute conception, there is no difference between the served and the servitor; yet the distinction is there, in a higher spiritual sense.

In the material concept of life, when one works for sense gratification, there is misery, but in the absolute world, when one is engaged in pure devotional service, there is no misery.

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2021