🌹. శ్రీమద్భగవద్గీత - 631 / Bhagavad-Gita - 631 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 48 🌴
48. సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా: |
🌷. తాత్పర్యం :
అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి యుండును. అందుచే ఓ కౌంతేయా! దోషపూర్ణమైనను తన సహజకర్మను ఎవ్వడును త్యజింపరాదు.
🌷. భాష్యము :
బద్ధజీవితము నందు సర్వకర్మలు కూడా త్రిగుణములచే ప్రభావితములై యుండును. బ్రాహ్మణుడైనవాడు జంతువధ తప్పనిసరియై యుండెడి కొన్ని యజ్ఞములను నిర్వహింపవలసి వచ్చుచుండును. అదేవిధముగా ఎంతటి పుణ్యాచరణుడైనను క్షత్రియుడైనవాడు శత్రువుతో పోరావలసివచ్చుచుండును.
దాని నాతడు ఏ విధముగను తప్పించుకొనలేడు. అదేరీతి ఎంతటి ధర్మాత్ముడైన వైశ్యుడు సైతము వ్యాపారము కొనసాగుట కొరకు కొన్నిమార్లు తన లాభమును గుప్తముగా ఉంచవలసివచ్చును లేదా నల్లబజారులో వ్యాపారము చేయవలసివచ్చును.
ఇవి తప్పని సరియైనట్టివి. వీనినెవ్వరును విడిచిపెట్టలేరు. అదేవిధముగా శూద్రుడు ఒక దుష్టయజమానిని సేవింపవలసి వచ్చినచో చేయరాని కార్యములైనను యజమాని ఆజ్ఞపై ఒనరింపవలసివచ్చును. ఆనగా స్వీయస్వభావము ననుసరించి సహజముగా కలుగుచున్నందున దోషపూర్ణములైనను స్వధర్మములను ప్రతియొక్కరు కొనసాగించవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 631 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 48 🌴
48. saha-jaṁ karma kaunteya
sa-doṣam api na tyajet
sarvārambhā hi doṣeṇa
dhūmenāgnir ivāvṛtāḥ
🌷 Translation :
Every endeavor is covered by some fault, just as fire is covered by smoke. Therefore one should not give up the work born of his nature, O son of Kuntī, even if such work is full of fault.
🌹 Purport :
In conditioned life, all work is contaminated by the material modes of nature. Even if one is a brāhmaṇa, he has to perform sacrifices in which animal killing is necessary.
Similarly, a kṣatriya, however pious he may be, has to fight enemies. He cannot avoid it. Similarly, a merchant, however pious he may be, must sometimes hide his profit to stay in business, or he may sometimes have to do business on the black market. These things are necessary; one cannot avoid them.
Similarly, even though a man is a śūdra serving a bad master, he has to carry out the order of the master, even though it should not be done. Despite these flaws, one should continue to carry out his prescribed duties, for they are born out of his own nature.
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2021