శ్రీమద్భగవద్గీత - 648: 18వ అధ్., శ్లో 65 / Bhagavad-Gita - 648: Chap. 18, Ver. 65


🌹. శ్రీమద్భగవద్గీత - 648 / Bhagavad-Gita - 648 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 65 🌴

65. మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు |
మావేవైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోసిమే ||


🌷. తాత్పర్యం :

సర్వదా నన్నే చింతింపుము. నా భక్తుడవగుము. నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను.


🌷. భాష్యము :

ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని శుద్ధభక్తుడై అతనినే చింతించుచు అతని కొరకే కర్మ నొనరించుట గుహ్యతమమైన జ్ఞానమై యున్నది. అనగా ఎవ్వరును కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశము కలుగు రీతిలో జీవితమును ప్రతియొక్కరు మలచుకొనవలెను. దైనందిన కర్మలన్నియును కృష్ణునితో సంబంధము కలిగియుండునట్లుగా వారు చూచుకొనవలెను.

ఇరువదినాలుగు గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారు జీవితమును ఏర్పాటు చేసికొనవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణభక్తిభావనలో నిమగ్నుడైనవాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానమొసగుచున్నాడు. అచ్చట అతడు శ్రీకృష్ణుని సన్నిహిత సాహచర్యమున నియుక్తుడు కాగలడు.

అర్జునుడు శ్రీకృష్ణభగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యతమజ్ఞానము ఉపదేశింపబడినది. అర్జునుని మార్గము ననుసరించు ప్రతివారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వము నొందగలరు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 648 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 65 🌴

65. man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi satyaṁ te
pratijāne priyo ’si me


🌷 Translation :

Always think of Me, become My devotee, worship Me and offer your homage unto Me. Thus you will come to Me without fail. I promise you this because you are My very dear friend.


🌹 Purport :

The most confidential part of knowledge is that one should become a pure devotee of Kṛṣṇa and always think of Him and act for Him. One should not become an official meditator. Life should be so molded that one will always have the chance to think of Kṛṣṇa. One should always act in such a way that all his daily activities are in connection with Kṛṣṇa.

He should arrange his life in such a way that throughout the twenty-four hours he cannot but think of Kṛṣṇa. And the Lord’s promise is that anyone who is in such pure Kṛṣṇa consciousness will certainly return to the abode of Kṛṣṇa, where he will be engaged in the association of Kṛṣṇa face to face.

This most confidential part of knowledge is spoken to Arjuna because he is the dear friend of Kṛṣṇa. Everyone who follows the path of Arjuna can become a dear friend to Kṛṣṇa and obtain the same perfection as Arjuna.

🌹 🌹 🌹 🌹 🌹


24 Feb 2021