శ్రీమద్భగవద్గీత - 629: 18వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 629: Chap. 18, Ver. 46


🌹. శ్రీమద్భగవద్గీత - 629 / Bhagavad-Gita - 629 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 46 🌴

46. యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవ: ||

🌷. తాత్పర్యం : 
సర్వజీవులకు కారణమైనవాడును మరియు సర్వత్ర వ్యాపించియున్నవాడును అగు భగవానుని అర్చించును, తన విధ్యుక్తకర్మను ఒనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును బడయగలడు.

🌷. భాష్యము :
ఇంద్రియాధీశుడైన హృషీకేశునిచే తాము ఒకానొక విధ్యుక్తకర్మ యందు నిలిచియున్నామని ప్రతియొక్కరు భావింపవలెను. పిదప తాము నియుక్తులై యున్న కర్మ ద్వారా లభించిన ఫలములతో దేవదేవుని అర్చించవలెను. మనుజుడు ఈ రీతిగా (పూర్ణ కృష్ణభక్తిభావన యందు) సర్వదా ఆలోచించినచో కృష్ణుని కరుణచే సర్వమును అవగతము చేసికొనగలడు. జీవితమునకు పూర్ణత్వమిదియే. 

“తేషామహమ్ సముద్ధర్తా” (భగవద్గీత 12.7) యని శ్రీకృష్ణుడు పలికియున్నాడు. అనగా అట్టి భక్తుని ఉద్ధరించు బాధ్యతను అతడే స్వయముగా స్వీకరించును. అదియే జీవితమందలి అత్యున్నత పూర్ణత్వము కాగలదు. అనగా మనుజుడెట్టి స్వధర్మమునందు నియుక్తుడైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అత్యున్నత పూర్ణత్వమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 629 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 46 🌴

46. yataḥ pravṛttir bhūtānāṁ
yena sarvam idaṁ tatam
sva-karmaṇā tam abhyarcya
siddhiṁ vindati mānavaḥ

🌷 Translation : 
By worship of the Lord, who is the source of all beings and who is all-pervading, a man can attain perfection through performing his own work.

🌹 Purport :
Everyone should think that he is engaged in a particular type of occupation by Hṛṣīkeśa, the master of the senses. And by the result of the work in which one is engaged, the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, should be worshiped. If one thinks always in this way, in full Kṛṣṇa consciousness, then, by the grace of the Lord, he becomes fully aware of everything. That is the perfection of life. The Lord says in Bhagavad-gītā (12.7), teṣām ahaṁ samuddhartā. 

The Supreme Lord Himself takes charge of delivering such a devotee. That is the highest perfection of life. In whatever occupation one may be engaged, if he serves the Supreme Lord he will achieve the highest perfection.
🌹 🌹 🌹 🌹 🌹

04 Feb 2021