శ్రీమద్భగవద్గీత - 638: 18వ అధ్., శ్లో 55 / Bhagavad-Gita - 638: Chap. 18, Ver. 55


🌹. శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 55 🌴

55. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వత: |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్ ||


🌷. తాత్పర్యం :

కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసికొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా దామమున చేరగలడు.


🌷. భాష్యము :

పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని మరియు అతని ప్రధానాంశములైన విష్ణుతత్త్వములను అవగతము చేసికొనుట మనోకల్పనలచేగాని, అభక్తులకు గాని సాధ్యము కాదు. ఎవరేని ఆ దేవదేవుని అవగతము చేసికొనదలచినచో శుద్ధభక్తుని నిర్దేశమున భక్తియుతసేవను స్వీకరింపవలెను. లేనియెడల శ్రీకృష్ణభగవానుని తత్త్వమెల్లవేళలా గుప్తముగనే ఉండిపోగలదు.

భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున (7.25) “నాహం ప్రకాశ: సర్వస్య” యని తెలుపబడినట్లు అతడు సర్వులకు వ్యక్తము కాడు. విద్యావైదుష్యముచే కాని, మనోకల్పనచే గాని ఎవ్వరును భగవానుని అవగతము చేసికొనజాలరు.

వాస్తవముగా కృష్ణభక్తిరసభావితుడై భక్తిపూర్వక సేవయందు నిలిచినవాడే కృష్ణుడననేమో అవగతము చేసికొనగలడు. విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏమాత్రము తోడ్పడవు.

కృష్ణపరజ్ఞానమునందు నిష్ణాతుడైనవాడు ఆధ్యాత్మికరాజ్యమగు కృష్ణలోకమును చేరుటకు యోగ్యుడగును. బ్రహ్మభావన పొందుట యనగా వ్యక్తిత్వమును కోల్పోవుట యని భావము కాదు.

వాస్తవమునకు బ్రహ్మభావన యందును భక్తియుతసేవ నిలిచియే యుండును. ఆ రీతి భక్తియుతసేవ ఉన్నంతకాలము భగవానుడు, భక్తుడు, భక్తియోగమనెడి మూడు అంశములు కొనసాగుచునే యుండును.

అట్టి జ్ఞానము ముక్తి పిదపయు నశించక నిలువగలదు. భౌతికభావన నుండి విడివడుటయే ముక్తి. కాని ఆధ్యాత్మికస్థితి యందును ఆత్మ, పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచునే యుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 638 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 55 🌴

55. bhaktyā mām abhijānāti
yāvān yaś cāsmi tattvataḥ
tato māṁ tattvato jñātvā
viśate tad-anantaram


🌷 Translation :

One can understand Me as I am, as the Supreme Personality of Godhead, only by devotional service. And when one is in full consciousness of Me by such devotion, he can enter into the kingdom of God.


🌹 Purport :

The Supreme Personality of Godhead, Kṛṣṇa, and His plenary portions cannot be understood by mental speculation nor by the nondevotees.

If anyone wants to understand the Supreme Personality of Godhead, he has to take to pure devotional service under the guidance of a pure devotee. Otherwise, the truth of the Supreme Personality of Godhead will always be hidden. As already stated in Bhagavad-gītā (7.25), nāhaṁ prakāśaḥ sarvasya: He is not revealed to everyone.

No one can understand God simply by erudite scholarship or mental speculation. Only one who is actually engaged in Kṛṣṇa consciousness and devotional service can understand what Kṛṣṇa is. University degrees are not helpful.

One who is fully conversant with the Kṛṣṇa science becomes eligible to enter into the spiritual kingdom, the abode of Kṛṣṇa. Becoming Brahman does not mean that one loses his identity. Devotional service is there, and as long as devotional service exists, there must be God, the devotee, and the process of devotional service.

Such knowledge is never vanquished, even after liberation. Liberation involves getting free from the concept of material life; in spiritual life the same distinction is there, the same individuality is there, but in pure Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021