శ్రీమద్భగవద్గీత - 594: 18వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 594: Chap. 18, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 11 🌴

11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత: |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||


🌷. తాత్పర్యం :

దేహధారుడైనవానికి సర్వకర్మలు త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి యనబడును.


🌷. భాష్యము :

మనుజుడు ఏ సమయమునను కర్మను త్యజింపజాలడని భగవద్గీత యందే తెలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మఫలమును తాననుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి యనబడును.

మా అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు.

అట్టి మహాత్ములు వాస్తవముగా సన్న్యాసులైనట్టివారే. అనగా వారు సన్న్యాసాశ్రమము నందు నెలకొనియున్నట్టివారే. కర్మఫలములను ఏ విధముగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను విడువవలెనో ఈ శ్లోకమున సృష్టపరుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 594 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 11 🌴

11. na hi deha-bhṛtā śakyaṁ tyaktuṁ karmāṇy aśeṣataḥ
yas tu karma-phala-tyāgī sa tyāgīty abhidhīyate


🌷 Translation :

It is indeed impossible for an embodied being to give up all activities. But he who renounces the fruits of action is called one who has truly renounced.


🌹 Purport :

It is said in Bhagavad-gītā that one can never give up work at any time. Therefore he who works for Kṛṣṇa and does not enjoy the fruitive results, who offers everything to Kṛṣṇa, is actually a renouncer.

There are many members of the International Society for Krishna Consciousness who work very hard in their office or in the factory or some other place, and whatever they earn they give to the Society.

Such highly elevated souls are actually sannyāsīs and are situated in the renounced order of life. It is clearly outlined here how to renounce the fruits of work and for what purpose fruits should be renounced.

🌹 🌹 🌹 🌹 🌹


30 Dec 2020