శ్రీమద్భగవద్గీత - 585: 18వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 585: Chap. 18, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 585 / Bhagavad-Gita - 585 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 02 🌴

02. శ్రీభగవానువాచ

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదు: |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా: ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను : విషయకోరికల పరమగు కర్మలను త్యజించుటయే సన్న్యాసమని విజ్ఞులు పలుకగా, సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు.


🌷. భాష్యము :

ఫలమును గోరి కర్మల నొనరించుటను నిశ్చయముగా త్యజించవలెను. అదియే భగవద్గీత ఉపదేశము. కాని ఆధ్యాత్మికజ్ఞానమును గూర్చు కర్మలను మాత్రము ఎన్నడును విడువరాదు. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విశదీకరింపబడగలదు. ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై యజ్ఞము నాచరించు విధానములు వేదములందు తెలుపబడియున్నవి.

సత్పుత్రుని పొందుటకు లేదా ఊర్థ్వలోకములను చేరుటకు కొన్ని ప్రత్యేక యజ్ఞములున్నను, కోరికలచే ప్రేరితము లయ్యెడి యజ్ఞములను ఆపివేయవలెను. కాని హృదయ పవిత్రీకరణమునకు లేదా ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోభివృద్దికి దోహదములగు యజ్ఞములను ఎన్నడును త్యజింపరాదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 585 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 02 🌴

02. śrī-bhagavān uvāca

kāmyānāṁ karmaṇāṁ nyāsaṁ sannyāsaṁ kavayo viduḥ
sarva-karma-phala-tyāgaṁ prāhus tyāgaṁ vicakṣaṇāḥ


🌷 Translation :

The Supreme Personality of Godhead said: The giving up of activities that are based on material desire is what great learned men call the renounced order of life [sannyāsa]. And giving up the results of all activities is what the wise call renunciation [tyāga].


🌹 Purport :

The performance of activities for results has to be given up. This is the instruction of Bhagavad-gītā. But activities leading to advanced spiritual knowledge are not to be given up. This will be made clear in the next verses. In the Vedic literature there are many prescriptions of methods for performing sacrifice for some particular purpose.

There are certain sacrifices to perform to attain a good son or to attain elevation to the higher planets, but sacrifices prompted by desires should be stopped. However, sacrifice for the purification of one’s heart or for advancement in the spiritual science should not be given up.

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2020