శ్రీమద్భగవద్గీత - 566: 17వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 566: Chap. 17, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 566 / Bhagavad-Gita - 566 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 10 🌴


10. యాతయామం గతరసం పూతి పుర్యుషితం చ యత్ |
ఉచ్ఛష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||


🌷. తాత్పర్యం :

భుజించుటకు మూడుగంటలకు ముందు తయారుచేయబడినవి, రుచిరహితము లైనవి, చెడిపోయినవి మరియు క్రుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధపదార్థములను కలిగినట్టివియైన ఆహారములు తమోగుణులకు ప్రియమైనవి.


🌷. భాష్యము :

ఆయుష్షును వృద్ధిచేయుట, మనస్సును పవిత్రమొనర్చుట, దేహమునకు శక్తిని కలిగించుటయే ఆహారము యొక్క ప్రయోజనమై యున్నది. అదియొక్కటే దాని ప్రయోజనము. ఆరోగ్యమునకు దోహదములై ఆయువును వృద్దినొందించునటువంటి పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, చక్కర, కూరగాయలు వంటి ఆహారపదార్థములను స్వీకారయోగ్యములని పెద్దలు పూర్వము నిర్ణయించిరి. అట్టి ఆహారము సత్త్వగుణము నందున్నట్టివారికి మిక్కిలి ప్రియమై యుండును.

పేలాలు మరియు బెల్లపు ముడిపదార్థమైన మొలాసిస్ వంటివి స్వత: రుచికరములు కాకున్నను పాలు మరియు ఇతర ఆహారపదార్థముల మిశ్రణముచే రుచికరములు, సత్త్వగుణసమన్వితములు కాగలవు. స్వత: పవిత్రములైన ఈ పదార్థములు నిషిద్ధములైన మద్యమాంసాదులకు మిక్కిలి భిన్నమైనవి.ఎనిమిదవ శ్లోకమున తెలుపబడిన స్నిగ్ధపదార్థములకు మరియు జంతువులను చంపగా లభించెడి క్రొవ్వు పదార్థములకు ఎట్టి సంబంధము లేదు.

క్రొవ్వుపదార్థములు అత్యంత అద్భుతాహారమైన క్షీరరూపమున లభించుచున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి జంతువు యొక్క క్రొవ్వును వేరొక రూపమున అందించునటువంటివి. అవి అమాయకజీవులను వధించు అవసరమును నివారించుచున్నవి. కాని నిర్లక్ష్యకారణముననే జంతువులను వధించుట యనెడి కార్యము నిరాటంకముగా సాగుచున్నది.

జీవనమునకు అవసరమైన క్రొవ్వుపదార్థములను పాల ద్వారా స్వీకరించుట నాగరికపధ్ధతి కాగా, జంతువధ యనునది మిక్కిలి అనాగరికమై యున్నది. పప్పులు, గోధుమల వంటి ఆహారములందు మాంసకృత్తులు పుష్కలముగా లభించును

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 566 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 10 🌴


10. yāta-yāmaṁ gata-rasaṁ
pūti paryuṣitaṁ ca yat
ucchiṣṭam api cāmedhyaṁ
bhojanaṁ tāmasa-priyam


🌷 Translation :

Food prepared more than three hours before being eaten, food that is tasteless, decomposed and putrid, and food consisting of remnants and untouchable things is dear to those in the mode of darkness.


🌹 Purport :

The purpose of food is to increase the duration of life, purify the mind and aid bodily strength. This is its only purpose. In the past, great authorities selected those foods that best aid health and increase life’s duration, such as milk products, sugar, rice, wheat, fruits and vegetables.

These foods are very dear to those in the mode of goodness. Some other foods, such as baked corn and molasses, while not very palatable in themselves, can be made pleasant when mixed with milk or other foods. They are then in the mode of goodness. All these foods are pure by nature.

They are quite distinct from untouchable things like meat and liquor. Fatty foods, as mentioned in the eighth verse, have no connection with animal fat obtained by slaughter. Animal fat is available in the form of milk, which is the most wonderful of all foods.

Milk, butter, cheese and similar products give animal fat in a form which rules out any need for the killing of innocent creatures. It is only through brute mentality that this killing goes on.

The civilized method of obtaining needed fat is by milk. Slaughter is the way of subhumans. Protein is amply available through split peas, dāl, whole wheat, etc.

🌹 🌹 🌹 🌹 🌹


02 Dec 2020