శ్రీమద్భగవద్గీత - 582: 17వ అధ్., శ్లో 26, 27 / Bhagavad-Gita - 582: Chap. 17, Ver. 26, 27


🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 26 , 27 🌴

26. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద: పార్థ యుజ్యతే ||


27. యజ్ఞే తపసి దానే చ స్థితి: సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||


🌷. తాత్పర్యం :

భక్తియుతసేవా యజ్ఞమునకు పరమలక్ష్యమైన పరతత్త్వము “సత్” అను పదముచే సూచింపబడును. ఓ పృథాకుమారా! దివ్యములై యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఒనరింపబడు సర్వ యజ్ఞ, తపో, దానకర్మలవలె అట్టి యజ్ఞకర్త కూడా “సత్” అనబడును.


🌷. భాష్యము :

గర్భమునందు చేరుట మొదలుగా జీవితాంతము వరకు మనుజుని జీవన పవిత్రీకరణమునకై వేదవాజ్మయమున పెక్కు శుద్దికర్మలు ఉపదేశింపబడినవి “ప్రశస్తే కర్మణి” (విధ్యుక్తధర్మములు) యని పదము సూచించుచున్నది. జీవుని చరమమోక్షమునకై అట్టి పవిత్రీకరణవిధానములు అవలంబింపబడును.

ఆ కార్యములన్నింటి యందును “ఓంతత్సత్” అను మంత్రమును ఉచ్చరింపవలెనని ఉపదేశింపబడినది. ఇచ్చట “సద్భావే” మరియు “సాధుభావే” యను పదములు ఆధ్యాత్మికస్థితిని సూచించుచున్నవి. కృష్ణభక్తిభావనలో వర్తించుట “సత్త్వము” అనబడగా, కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు “సాధువు” అనబడును.

ఆధ్యాత్మిక విషయములు భక్తుల సాంగత్యమున సుస్పష్టములు కాగలవని శ్రీమద్భాగవతమున (3.25.25) “సతాం ప్రసంగాత్” అను పదము ద్వారా తెలుపబడినది. అనగా సత్సాంగత్యము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజ్ఞానమును పొందలేరు. మంత్రదీక్షను ఒసగునప్పుడుగాని, యజ్ఞోపవీతమును వేయునప్పుడుగాని గురువు ఈ “ఓంతత్సత్” అను పదములను ఉచ్చరించును.

అదే విధముగా అన్ని రకములైన యజ్ఞములందలి లక్ష్యము “ఓంతత్సత్” (భగవానుడు) అనునదియే. “తదర్థీయం” అను పదము శ్రీకృష్ణభగవానునికి సంబంధించిన సేవాకార్యములను సూచించును. అనగా ప్రసాదమును తయారుచేయుట, మందిరకార్యములందు సహకరించుట, శ్రీకృష్ణభగవానుని కీర్తిని ప్రచారము చేయుట వంటి సేవలన్నింటిని అది సూచించుచున్నది.

కనుకనే కర్మలను పూర్ణమొనర్చి సర్వమును సమగ్రమొనర్చు నిమిత్తమై ఈ దివ్యములైన “ఓంతత్సత్” అను పదములు పలురీతుల ఉపయోగింపబడుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 582 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 26 , 27 🌴

26.sad-bhāve sādhu-bhāve ca
sad ity etat prayujyate
praśaste karmaṇi tathā
sac-chabdaḥ pārtha yujyate


27. yajñe tapasi dāne ca
sthitiḥ sad iti cocyate
karma caiva tad-arthīyaṁ
sad ity evābhidhīyate


🌷 Translation :

The Absolute Truth is the objective of devotional sacrifice, and it is indicated by the word sat. The performer of such sacrifice is also called sat, as are all works of sacrifice, penance and charity which, true to the absolute nature, are performed to please the Supreme Person, O son of Pṛthā.


🌹 Purport :

The words praśaste karmaṇi, or “prescribed duties,” indicate that there are many activities prescribed in the Vedic literature which are purificatory processes, beginning from the time of conception up to the end of one’s life. 

Such purificatory processes are adopted for the ultimate liberation of the living entity. In all such activities it is recommended that one vibrate oṁ tat sat.

The words sad-bhāve and sādhu-bhāve indicate the transcendental situation. Acting in Kṛṣṇa consciousness is called sattva, and one who is fully conscious of the activities of Kṛṣṇa consciousness is called a sādhu.

In the Śrīmad-Bhāgavatam (3.25.25) it is said that the transcendental subject matter becomes clear in the association of the devotees. The words used are satāṁ prasaṅgāt. Without good association, one cannot achieve transcendental knowledge. When initiating a person or offering the sacred thread, one vibrates the words oṁ tat sat.

Similarly, in all kinds of performance of yajña the object is the Supreme, oṁ tat sat. The word tad-arthīyam further means offering service to anything which represents the Supreme, including such service as cooking and helping in the Lord’s temple, or any other kind of work for broadcasting the glories of the Lord.

These supreme words oṁ tat sat are thus used in many ways to perfect all activities and make everything complete.

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020