శ్రీమద్భగవద్గీత - 570: 17వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 570: Chap. 17, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 570 / Bhagavad-Gita - 570 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 14 🌴


14. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||


🌷. తాత్పర్యం :

దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికగురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరిక తపస్సని చెప్పబడును.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను, నిష్ఠలను వివరింపనెంచి తొలుత దేహసంబంధమైన తపోనిష్ఠలను వివరించుచున్నాడు. ప్రతియొక్కరు దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులును యోగ్యులును అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేదజ్ఞానపారంగతుడైనవానికి గౌరవమొసగవలెను లేదా గౌరవమొసగుటను నేర్వవలెను.

వీరందరును నిక్కముగా సరియైన గౌరవమందవలసినవారు. అంతియేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు,వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను.

శాస్త్రమునందు తెలుపబడనటువంటి దానినెన్నడును అతడు ఆచరించరాదు. శాస్త్రమందు మైథునమన్నది వైవాహిక జీవనమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు అవివాహిక సంబంధమును కలిగియుండరాదు. ఇదియే బ్రహ్మచర్యమనబడును.ఇవియే దేహపరమైన తపోనిష్ఠలు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 570 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 14 🌴


14. deva-dvija-guru-prājña-
pūjanaṁ śaucam ārjavam
brahmacaryam ahiṁsā ca
śārīraṁ tapa ucyate


🌷 Translation :

Austerity of the body consists in worship of the Supreme Lord, the brāhmaṇas, the spiritual master, and superiors like the father and mother, and in cleanliness, simplicity, celibacy and nonviolence.


🌹 Purport :

The Supreme Godhead here explains the different kinds of austerity and penance. First He explains the austerities and penances practiced by the body.

One should offer, or learn to offer, respect to God or to the demigods, the perfect, qualified brāhmaṇas and the spiritual master and superiors like father, mother or any person who is conversant with Vedic knowledge. These should be given proper respect. One should practice cleansing oneself externally and internally, and he should learn to become simple in behavior.

He should not do anything which is not sanctioned by the scriptural injunctions. He should not indulge in sex outside of married life, for sex is sanctioned in the scripture only in marriage, not otherwise. This is called celibacy. These are penances and austerities as far as the body is concerned.

🌹 🌹 🌹 🌹 🌹


06 Dec 2020