శ్రీమద్భగవద్గీత - 588: 18వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 588: Chap. 18, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 05 🌴

05. యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||


🌷. తాత్పర్యం :

యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మలను ఎన్నడును త్యజింపరాదు. వానిని తప్పక ఒనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞ, దాన, తపములు మహాత్ములను కూడా పవిత్రమొనర్చును.


🌷. భాష్యము :

యోగులైనవారు మానవసమాజ పురోభివృద్ది కొరకై కర్మల నొనరించవలెను. మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు పురోగమింపజేయుటకు పెక్కు పవిత్రీకరణ విధానములు గలవు. ఉదాహరణకు వివాహము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణింపబడినది. అది వివాహయజ్ఞమని పిలువబడును. గృహబంధముల నన్నింటిని విడిచిపెట్టి సన్న్యాసము స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహమును ప్రోత్సహించవచ్చునా యనునది పెద్ద ప్రశ్న.

అందుకు సమాధానముగా మానవకల్యాణ నిమిత్తమై యున్న ఎట్టి యజ్ఞమునైనను విడువరాదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు. వివాహయజ్ఞము మనుజుని మనస్సును నియమించి, తద్ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోభివృద్ధికై శాంతిమయుడగుటకే ఉద్దేశింపబడినది. కనుక దాదాపు జనులందరికీ ఈ వివాహయజ్ఞము ప్రోత్సాహనీయమైనది. సన్న్యాసియైనవాడు సైతము దీనిని ప్రోత్సహించవచ్చును.

సన్న్యాసులు స్త్రీతో సాంగత్యమును కలిగియుండరాదన్నచో సన్న్యాసాశ్రమము క్రిందనున్న ఆశ్రమము వారు కూడా వివాహము చేసికొనరాదని భావము కాదు. విధ్యక్తమగు యజ్ఞములన్నియును శ్రీకృష్ణభగవానుని పొందుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే ఆరంభస్థితిలో అట్టి విధ్యుక్తధర్మములను విడువరాదు.

అదేవిధముగా దానము హృదయపవిత్రీకరణకై పేర్కొనబడినది. పూర్వము వివరించినట్లు దానము పాత్రుడైనవానికి ఒసగినచో అది మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు నడుపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 588 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 05 🌴

05. yajña-dāna-tapaḥ-karma na tyājyaṁ kāryam eva tat
yajño dānaṁ tapaś caiva pāvanāni manīṣiṇām


🌷 Translation :

Acts of sacrifice, charity and penance are not to be given up; they must be performed. Indeed, sacrifice, charity and penance purify even the great souls.


🌹 Purport :

The yogīs should perform acts for the advancement of human society. There are many purificatory processes for advancing a human being to spiritual life. The marriage ceremony, for example, is considered to be one of these sacrifices. It is called vivāha-yajña.

Should a sannyāsī, who is in the renounced order of life and who has given up his family relations, encourage the marriage ceremony? The Lord says here that any sacrifice which is meant for human welfare should never be given up. Vivāha-yajña, the marriage ceremony, is meant to regulate the human mind so that it may become peaceful for spiritual advancement.

For most men, this vivāha-yajña should be encouraged even by persons in the renounced order of life. Sannyāsīs should never associate with women, but that does not mean that one who is in the lower stages of life, a young man, should not accept a wife in the marriage ceremony.

All prescribed sacrifices are meant for achieving the Supreme Lord. Therefore, in the lower stages, they should not be given up. Similarly, charity is for the purification of the heart. If charity is given to suitable persons, as described previously, it leads one to advanced spiritual life.

🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020