శ్రీమద్భగవద్గీత - 589: 18వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 589: Chap. 18, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 06 🌴

06. ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్తా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితిం మతముత్తమమ్ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఈ కర్మలనన్నింటిని సంగత్వముగాని, ఎట్టి ఫలాపేక్షగాని లేకుండా స్వధర్మమనెడి భావనలో ఒనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము.


🌷. భాష్యము :

యజ్ఞవిధానములు పవిత్రమొనర్చునవే అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతికాభ్యుదయమునకు దోహదములైన యజ్ఞములను త్యజించివేయవలెనే గాని, తన జీవనమును పవిత్రమొనర్చి ఆధ్యాత్మికస్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు.

కృష్ణభక్తిరసభావనకు దోహదములయ్యెడి ప్రతిదానిని ప్రోత్సహింపవలెను. శ్రీకృష్ణభగవానుని భక్తికి కారణమయ్యెడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలెనని శ్రీమద్భాగవతమునందు తెలుపబడినది.

ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు తనకు సహాయభూతమగు ఎట్టి కర్మమునైనను, యజ్ఞమునైనను, దానమునైనను తప్పక స్వీకరింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 589 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 06 🌴

06. etāny api tu karmāṇi saṅgaṁ tyaktvā phalāni ca
kartavyānīti me pārtha niścitaṁ matam uttamam


🌷 Translation :

All these activities should be performed without attachment or any expectation of result. They should be performed as a matter of duty, O son of Pṛthā. That is My final opinion.


🌹 Purport :

Although all sacrifices are purifying, one should not expect any result by such performances. In other words, all sacrifices which are meant for material advancement in life should be given up, but sacrifices that purify one’s existence and elevate one to the spiritual plane should not be stopped.

Everything that leads to Kṛṣṇa consciousness must be encouraged. In the Śrīmad-Bhāgavatam also it is said that any activity which leads to devotional service to the Lord should be accepted. That is the highest criterion of religion. A devotee of the Lord should accept any kind of work, sacrifice or charity which will help him in the discharge of devotional service to the Lord.

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020