✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 28 🌴
28. ఆశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థ! పరమపురుషుని యందు శ్రద్ధలేకుండా ఒనర్చునటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సనునది ఆశాశ్వతమైనది. “అసత్” అని పిలువబడు అట్టి కర్మ ప్రస్తుతజన్మము నందును, రాబోవు జన్మము నందును నిరుపయోగమే.
🌷. భాష్యము :
ఆధ్యాత్మిక లక్ష్యమనునది లేకుండా ఒనర్చుబడునదేదైనను వాస్తవమునకు వ్యర్థమైనదే. అట్టి కర్మ యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే అట్టి కర్మలు హేయములని ఈ శ్లోకమున ప్రకటింపబడినది. వాస్తవమునకు ప్రతికర్మయు శ్రీకృష్ణభగవానుని నిమిత్తమై కృష్ణభక్తిభావనలో ఒనరింపవలసియున్నది.
అటువంటి శ్రద్ధ మరియు తగిన నిర్దేశము లేనిచో ఎట్టి ఫలమును లభింపబోదు. సమస్త వేదవాజ్మయమున పరమపురుషుని యందలి శ్రద్ధయే ఉపదేశింపబడినది. వేదోపదేశముల అనుసరణము యొక్క ముఖ్యలక్ష్యము శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటయే.
ఈ విషయమును మరియు నియమమును పాటించకుండా ఎవ్వరును జయమును పొందలేరు. కనుక ఆధ్యాత్మికగురువు నేతృత్వమున తొలినుండియే కృష్ణభక్తిభావనలో కర్మ నొనరించుట ఉత్తమోత్తమ మార్గము. సర్వమును విజయవంతమొనర్చుటకు ఇదియే ఉత్తమమార్గము.
బద్దజీవనమునందు జనులు దేవతలను, భూతప్రేతములను లేదా కుబేరుడు వంటి యక్షులను పూజించుటకు ఆకర్షితులగుదురు.
సత్త్వగుణము రజస్తమోగుణముల కన్నను మెరుగైనదైనను, కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచినవాడు త్రిగుణములకు అతీతుడు కాగలడు. గుణములందు క్రమముగా ఉన్నతిని పొందు మార్గమొకటున్నను భక్తుల సాంగత్యమున ప్రత్యక్షముగా కృష్ణభక్తిలో మనుజుడు నిలువగలిగినచో అది ఉత్తమమార్గము కాగలదు.
అదియే ఈ అధ్యాయమున ఉపదేశింపబడినది. ఈ విధానమున జయమును సాధింపగోరినచో మనుజుడు తొలుత సరియైన గురువును పొంది ఆయన నిర్దేశమునందు శిక్షణను బడయవలసియుండును. పిదప అతడు శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను పొందగలడు.
కాలక్రమమున అట్టి శ్రద్ధ పరిపక్వమైనపుడు కృష్ణప్రేమగా పిలువబడును. ఆ ప్రేమయే సర్వజీవుల అంతిమలక్ష్యము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనను ప్రత్యక్షముగా స్వీకరింపవలెననుట ఈ సప్తదశాధ్యాయపు సందేశమై యున్నది.
శ్రీమద్భగవద్గీత యందలి “శ్రద్ధాత్రయవిభాగములు” అను సప్తదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 583 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 17 - The Divisions of Faith - 28 🌴
28. aśraddhayā hutaṁ dattaṁ
tapas taptaṁ kṛtaṁ ca yat
asad ity ucyate pārtha
na ca tat pretya no iha
🌷 Translation :
Anything done as sacrifice, charity or penance without faith in the Supreme, O son of Pṛthā, is impermanent. It is called asat and is useless both in this life and the next.
🌹 Purport :
Anything done without the transcendental objective – whether it be sacrifice, charity or penance – is useless.
Therefore in this verse it is declared that such activities are abominable. Everything should be done for the Supreme in Kṛṣṇa consciousness. Without such faith, and without the proper guidance, there can never be any fruit. In all the Vedic scriptures, faith in the Supreme is advised. In the pursuit of all Vedic instructions, the ultimate goal is the understanding of Kṛṣṇa.
No one can obtain success without following this principle. Therefore, the best course is to work from the very beginning in Kṛṣṇa consciousness under the guidance of a bona fide spiritual master. That is the way to make everything successful.
Although there is a process of gradual elevation, if one, by the association of pure devotees, takes directly to Kṛṣṇa consciousness, that is the best way. And that is recommended in this chapter. To achieve success in this way, one must first find the proper spiritual master and receive training under his direction.
Then one can achieve faith in the Supreme. When that faith matures, in course of time, it is called love of God. This love is the ultimate goal of the living entities. One should therefore take to Kṛṣṇa consciousness directly. That is the message of this Seventeenth Chapter.
Thus end the Bhaktivedanta Purports to the Seventeenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Divisions of Faith.
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2020