శ్రీమద్భగవద్గీత - 595: 18వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 595: Chap. 18, Ver. 12


🌹. శ్రీమద్భగవద్గీత - 595 / Bhagavad-Gita - 595 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 12 🌴

12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ: ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||


🌷. తాత్పర్యం :

ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్ఠమిశ్రితము అనెడి మూడు విధములైన కర్మఫలములు త్యాగికానటువంటి వానికి మరణము పిదప కలుగుచున్నవి. కాని సన్న్యాసాశ్రమమునందున్న వారికి మాత్రము సుఖదుఃఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానునితో గల నిత్యసంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణభక్తిరసభావితుడు సర్వదా ముక్తస్థితి యందే యుండును. కనుక అతడు మరణము పిదప తన కర్మఫలములచే సుఖించుటగాని, దు:ఖించుటగాని జరుగదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 595 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 12 🌴

12. aniṣṭam iṣṭaṁ miśraṁ ca tri-vidhaṁ karmaṇaḥ phalam
bhavaty atyāgināṁ pretya na tu sannyāsināṁ kvacit


🌷 Translation :

For one who is not renounced, the threefold fruits of action – desirable, undesirable and mixed – accrue after death. But those who are in the renounced order of life have no such result to suffer or enjoy.


🌹 Purport :

A person in Kṛṣṇa consciousness acting in knowledge of his relationship with Kṛṣṇa is always liberated. Therefore he does not have to enjoy or suffer the results of his acts after death.

🌹 🌹 🌹 🌹 🌹



31 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 594: 18వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 594: Chap. 18, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 594 / Bhagavad-Gita - 594 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 11 🌴

11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత: |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||


🌷. తాత్పర్యం :

దేహధారుడైనవానికి సర్వకర్మలు త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి యనబడును.


🌷. భాష్యము :

మనుజుడు ఏ సమయమునను కర్మను త్యజింపజాలడని భగవద్గీత యందే తెలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మఫలమును తాననుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి యనబడును.

మా అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు.

అట్టి మహాత్ములు వాస్తవముగా సన్న్యాసులైనట్టివారే. అనగా వారు సన్న్యాసాశ్రమము నందు నెలకొనియున్నట్టివారే. కర్మఫలములను ఏ విధముగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను విడువవలెనో ఈ శ్లోకమున సృష్టపరుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 594 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 11 🌴

11. na hi deha-bhṛtā śakyaṁ tyaktuṁ karmāṇy aśeṣataḥ
yas tu karma-phala-tyāgī sa tyāgīty abhidhīyate


🌷 Translation :

It is indeed impossible for an embodied being to give up all activities. But he who renounces the fruits of action is called one who has truly renounced.


🌹 Purport :

It is said in Bhagavad-gītā that one can never give up work at any time. Therefore he who works for Kṛṣṇa and does not enjoy the fruitive results, who offers everything to Kṛṣṇa, is actually a renouncer.

There are many members of the International Society for Krishna Consciousness who work very hard in their office or in the factory or some other place, and whatever they earn they give to the Society.

Such highly elevated souls are actually sannyāsīs and are situated in the renounced order of life. It is clearly outlined here how to renounce the fruits of work and for what purpose fruits should be renounced.

🌹 🌹 🌹 🌹 🌹


30 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 593: 18వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 593: Chap. 18, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 593 / Bhagavad-Gita - 593 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 10 🌴

10. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయ: ||


🌷. తాత్పర్యం :

అశుభకర్మల యెడ ద్వేషము గాని, శుభకర్మల యెడ సంగత్వముగాని లేనట్టి సత్త్వగుణస్థితుడగు బుద్ధిమంతుడైన త్యాగికి కర్మయెడ ఎట్టి సంశయములు ఉండవు.


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావన యందున్నవాడు (సత్త్వగుణపూర్ణుడు) తన దేహమునకు క్లేశమును గూర్చు విషయములను గాని, మనుజులను గాని ద్వేషింపడు. విధ్యుక్తధర్మ పాలనము వలన క్లేశములకు వెరువక తగిన సమయమున మరియు తగిన ప్రదేశమున అట్టివాడు కర్మ నోనరించును.

దివ్యస్థితిలో నిలిచియున్న అట్టివాడు అత్యంత మేధాసంపన్నుడనియు మరియు తానొనరించు కర్మల యెడ సంశయరహితుడనియు అవగతము చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 593 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 10 🌴

10. na dveṣṭy akuśalaṁ karma kuśale nānuṣajjate
tyāgī sattva-samāviṣṭo medhāvī chinna-saṁśayaḥ


🌷 Translation :

The intelligent renouncer situated in the mode of goodness, neither hateful of inauspicious work nor attached to auspicious work, has no doubts about work.


🌹 Purport :

A person in Kṛṣṇa consciousness or in the mode of goodness does not hate anyone or anything which troubles his body. He does work in the proper place and at the proper time without fearing the troublesome effects of his duty.

Such a person situated in transcendence should be understood to be most intelligent and beyond all doubts in his activities.

🌹 🌹 🌹 🌹 🌹


29 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 592: 18వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 592: Chap. 18, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 09 🌴

09. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున |
సఙ్గం త్యక్తా ఫలం చైవ స త్యాగ: సాత్త్వికో మత: ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! తప్పక ఒనరింపవలసియే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు, సమస్త భౌతికసంగమును మరియు ఫలాసక్తిని విడుచువాని త్యాగము సాత్త్విక త్యాగమనబడును.


🌷. భాష్యము :

విధ్యుక్తధర్మములను ఇట్టి భావనలోనే నిర్వహింపవలెను. మనుజుడు ఫలమున యెడ ఆసక్తి లేకుండా వర్తింపవలెను. అంతియేకాక అతడు గుణముల నుండియు విడివడియుండవలెను.

కృష్ణభక్తిరసభావితుడైన వ్యక్తి ఏదేని కర్మాగారములలో పనిచేయుచున్నచో కర్మాగారపు పనినే సర్వస్వమని తలచి తాదాత్మ్యము చెందుట గాని, కర్మాగారమునందలి కార్మికులతో అనవసర సంగత్వమును కలిగియుండుట గాని చేయడు. కేవలము కృష్ణుని నిమిత్తమే అతడు కర్మనొనరించును.

ఫలమును కృష్ణునకే అర్పించినపుడు అతడి దివ్యముగా వర్తించినవాడగును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 592 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 09 🌴

09. kāryam ity eva yat karma niyataṁ kriyate ’rjuna
saṅgaṁ tyaktvā phalaṁ caiva sa tyāgaḥ sāttviko mataḥ


🌷 Translation :

O Arjuna, when one performs his prescribed duty only because it ought to be done, and renounces all material association and all attachment to the fruit, his renunciation is said to be in the mode of goodness


🌹 Purport :

Prescribed duties must be performed with this mentality. One should act without attachment for the result; he should be disassociated from the modes of work.

A man working in Kṛṣṇa consciousness in a factory does not associate himself with the work of the factory, nor with the workers of the factory. He simply works for Kṛṣṇa. And when he gives up the result for Kṛṣṇa, he is acting transcendentally.

🌹 🌹 🌹 🌹 🌹


28 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 591: 18వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 591: Chap. 18, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 591 / Bhagavad-Gita - 591 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 08 🌴

08. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||


🌷. తాత్పర్యం :

దుఃఖకరములని గాని, దేహమునకు అసౌఖ్యకరములని గాని భావించి విధ్యుక్తధర్మములను విడుచువాడు రజోగుణమునందు త్యాగమొనర్చినవాడగును. అట్టి కార్యమెన్నడును త్యాగమందలి ఉన్నతస్థితిని కలుగజేయలేదు.


🌷. భాష్యము :

కృష్ణభక్తిభావన యందున్నవాడు తాను కామ్యకర్మలను చేయుచున్నాననెడి భయముతో ధనార్జనను విడువరాదు.

పనిచేయుట ద్వారా మనుజుడు తన ధనమును కృష్ణభక్తికై వినియోగింప గలిగినచో లేదా బ్రహ్మముహుర్తమునందే మేల్కాంచుటచే తన దివ్యమగు కృష్ణభక్తిభావనను పురోగతి నొందించగలిగినచో అతడు భయముతో గాని, ఆ కర్మలు క్లేశకరమని భావించిగాని వానిని మానరాదు. అట్టి త్యాగము నిక్కముగా రజోగుణప్రధానమైనదే.

రజోగుణకర్మఫలము సదా దుఃఖపూర్ణముగనే ఉండును. అట్టి భావనలో మనుజుడు కర్మను త్యాగమొనర్చినచో త్యాగఫలమును ఎన్నడును పొందలేడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 591 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 08 🌴

08. duḥkham ity eva yat karma kāya-kleśa-bhayāt tyajet
sa kṛtvā rājasaṁ tyāgaṁ naiva tyāga-phalaṁ labhet


🌷 Translation :

Anyone who gives up prescribed duties as troublesome or out of fear of bodily discomfort is said to have renounced in the mode of passion. Such action never leads to the elevation of renunciation.


🌹 Purport :

One who is in Kṛṣṇa consciousness should not give up earning money out of fear that he is performing fruitive activities.

If by working one can engage his money in Kṛṣṇa consciousness, or if by rising early in the morning one can advance his transcendental Kṛṣṇa consciousness, one should not desist out of fear or because such activities are considered troublesome.

Such renunciation is in the mode of passion. The result of passionate work is always miserable. If a person renounces work in that spirit, he never gets the result of renunciation.

🌹 🌹 🌹 🌹 🌹


27 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 590: 18వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 590: Chap. 18, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 07 🌴

07. నియతస్య తు సన్న్యాస: కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామస: పరికీర్తిత: ||


🌷. తాత్పర్యం :

విధ్యుక్తధర్మములను ఎన్నడును విడువరాదు. మోహకారణమున ఎవ్వరేని తన విధ్యుక్తధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును.


🌷. భాష్యము :

భౌతికతృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడువవలయును. కాని మనుజుని ఆధ్యాత్మికతకు ఉద్ధరించునటువంటి ప్రసాదమును తయారు చేయుట, నైవేద్యమును పెట్టుట, ప్రసాదమును స్వీకరించుట వంటి కార్యములు మాత్రము ఉపదేశింపబడినవి.

సన్న్యాసాశ్రమము నందున్న వ్యక్తి తన కొరకై వంట తయారుచేసికొనరాదని తెలుపబడినది. సన్న్యాసియైనవానికి తన కొరకై వండుకొనుట నిషిద్ధముగాని శ్రీకృష్ణభగవానుని కొరకై వండుట నిషిద్ధము కాదు.

అదే విధముగా సన్న్యాసియైనవాడు తన శిష్యుని కృష్ణభక్తి పురోగతికై అతని వివాహమును సైతము జరుపవచ్చును. ఒకవేళ అతడట్టి కార్యమును త్యజించినచో తమోగుణమున వర్తించినవాడగును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 590 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 07 🌴

07. niyatasya tu sannyāsaḥ karmaṇo nopapadyate
mohāt tasya parityāgas tāmasaḥ parikīrtitaḥ


🌷 Translation :

Prescribed duties should never be renounced. If one gives up his prescribed duties because of illusion, such renunciation is said to be in the mode of ignorance.


🌹 Purport :

Work for material satisfaction must be given up, but activities which promote one to spiritual activity, like cooking for the Supreme Lord and offering the food to the Lord and then accepting the food, are recommended. It is said that a person in the renounced order of life should not cook for himself. Cooking for oneself is prohibited, but cooking for the Supreme Lord is not prohibited.

Similarly, a sannyāsī may perform a marriage ceremony to help his disciple in the advancement of Kṛṣṇa consciousness. If one renounces such activities, it is to be understood that he is acting in the mode of darkness.

🌹 🌹 🌹 🌹 🌹


26 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 589: 18వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 589: Chap. 18, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 06 🌴

06. ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్తా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితిం మతముత్తమమ్ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఈ కర్మలనన్నింటిని సంగత్వముగాని, ఎట్టి ఫలాపేక్షగాని లేకుండా స్వధర్మమనెడి భావనలో ఒనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము.


🌷. భాష్యము :

యజ్ఞవిధానములు పవిత్రమొనర్చునవే అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతికాభ్యుదయమునకు దోహదములైన యజ్ఞములను త్యజించివేయవలెనే గాని, తన జీవనమును పవిత్రమొనర్చి ఆధ్యాత్మికస్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు.

కృష్ణభక్తిరసభావనకు దోహదములయ్యెడి ప్రతిదానిని ప్రోత్సహింపవలెను. శ్రీకృష్ణభగవానుని భక్తికి కారణమయ్యెడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలెనని శ్రీమద్భాగవతమునందు తెలుపబడినది.

ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు తనకు సహాయభూతమగు ఎట్టి కర్మమునైనను, యజ్ఞమునైనను, దానమునైనను తప్పక స్వీకరింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 589 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 06 🌴

06. etāny api tu karmāṇi saṅgaṁ tyaktvā phalāni ca
kartavyānīti me pārtha niścitaṁ matam uttamam


🌷 Translation :

All these activities should be performed without attachment or any expectation of result. They should be performed as a matter of duty, O son of Pṛthā. That is My final opinion.


🌹 Purport :

Although all sacrifices are purifying, one should not expect any result by such performances. In other words, all sacrifices which are meant for material advancement in life should be given up, but sacrifices that purify one’s existence and elevate one to the spiritual plane should not be stopped.

Everything that leads to Kṛṣṇa consciousness must be encouraged. In the Śrīmad-Bhāgavatam also it is said that any activity which leads to devotional service to the Lord should be accepted. That is the highest criterion of religion. A devotee of the Lord should accept any kind of work, sacrifice or charity which will help him in the discharge of devotional service to the Lord.

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 588: 18వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 588: Chap. 18, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 05 🌴

05. యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||


🌷. తాత్పర్యం :

యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మలను ఎన్నడును త్యజింపరాదు. వానిని తప్పక ఒనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞ, దాన, తపములు మహాత్ములను కూడా పవిత్రమొనర్చును.


🌷. భాష్యము :

యోగులైనవారు మానవసమాజ పురోభివృద్ది కొరకై కర్మల నొనరించవలెను. మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు పురోగమింపజేయుటకు పెక్కు పవిత్రీకరణ విధానములు గలవు. ఉదాహరణకు వివాహము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణింపబడినది. అది వివాహయజ్ఞమని పిలువబడును. గృహబంధముల నన్నింటిని విడిచిపెట్టి సన్న్యాసము స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహమును ప్రోత్సహించవచ్చునా యనునది పెద్ద ప్రశ్న.

అందుకు సమాధానముగా మానవకల్యాణ నిమిత్తమై యున్న ఎట్టి యజ్ఞమునైనను విడువరాదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు. వివాహయజ్ఞము మనుజుని మనస్సును నియమించి, తద్ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోభివృద్ధికై శాంతిమయుడగుటకే ఉద్దేశింపబడినది. కనుక దాదాపు జనులందరికీ ఈ వివాహయజ్ఞము ప్రోత్సాహనీయమైనది. సన్న్యాసియైనవాడు సైతము దీనిని ప్రోత్సహించవచ్చును.

సన్న్యాసులు స్త్రీతో సాంగత్యమును కలిగియుండరాదన్నచో సన్న్యాసాశ్రమము క్రిందనున్న ఆశ్రమము వారు కూడా వివాహము చేసికొనరాదని భావము కాదు. విధ్యక్తమగు యజ్ఞములన్నియును శ్రీకృష్ణభగవానుని పొందుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే ఆరంభస్థితిలో అట్టి విధ్యుక్తధర్మములను విడువరాదు.

అదేవిధముగా దానము హృదయపవిత్రీకరణకై పేర్కొనబడినది. పూర్వము వివరించినట్లు దానము పాత్రుడైనవానికి ఒసగినచో అది మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు నడుపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 588 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 05 🌴

05. yajña-dāna-tapaḥ-karma na tyājyaṁ kāryam eva tat
yajño dānaṁ tapaś caiva pāvanāni manīṣiṇām


🌷 Translation :

Acts of sacrifice, charity and penance are not to be given up; they must be performed. Indeed, sacrifice, charity and penance purify even the great souls.


🌹 Purport :

The yogīs should perform acts for the advancement of human society. There are many purificatory processes for advancing a human being to spiritual life. The marriage ceremony, for example, is considered to be one of these sacrifices. It is called vivāha-yajña.

Should a sannyāsī, who is in the renounced order of life and who has given up his family relations, encourage the marriage ceremony? The Lord says here that any sacrifice which is meant for human welfare should never be given up. Vivāha-yajña, the marriage ceremony, is meant to regulate the human mind so that it may become peaceful for spiritual advancement.

For most men, this vivāha-yajña should be encouraged even by persons in the renounced order of life. Sannyāsīs should never associate with women, but that does not mean that one who is in the lower stages of life, a young man, should not accept a wife in the marriage ceremony.

All prescribed sacrifices are meant for achieving the Supreme Lord. Therefore, in the lower stages, they should not be given up. Similarly, charity is for the purification of the heart. If charity is given to suitable persons, as described previously, it leads one to advanced spiritual life.

🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 587: 18వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 587: Chap. 18, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 04 🌴

04. నిశ్చయం శ్రుణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పరుషవ్యాఘ్ర త్రివిధ: సమ్ప్రకీర్తిత:


🌷. తాత్పర్యం :

ఓ భరతశ్రేష్టా! పురుషవ్యాఘ్రా! త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.శాస్త్రములందు అట్టి త్యాగము మూడువిధములని తెలుపబడినది.


🌷. భాష్యము :

త్యాగమును గూర్చి పలు అభిప్రాయములున్నను శ్రీకృష్ణభగవానుడిచ్చట దాని యెడ తన నిర్ణయమును తెలియజేయనున్నాడు. దానినే తుది నిర్ణయముగా భావింపవలెను. సత్యమెరిగినచో వేదములనునవి భగవానుడు ఒసగిన వివిధ నియమములే. అట్టి భగవానుడే ప్రత్యక్షముగా నిలిచియుండి పలుకుచున్నందున అతని వాక్యమును తుది నిర్ణయముగా స్వీకరింపవలెను.

ఏ గుణమునందు నిర్వహింపబడినదనెడి విషయము ననుసరించి త్యాగమును గుర్తింపవలెనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 587 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 04 🌴

04. niścayaṁ śṛṇu me tatra tyāge bharata-sattama
tyāgo hi puruṣa-vyāghra tri-vidhaḥ samprakīrtitaḥ


🌷 Translation :

O best of the Bhāratas, now hear My judgment about renunciation. O tiger among men, renunciation is declared in the scriptures to be of three kinds.


🌹 Purport :

Although there are differences of opinion about renunciation, here the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, gives His judgment, which should be taken as final. After all, the Vedas are different laws given by the Lord. Here the Lord is personally present, and His word should be taken as final.

The Lord says that the process of renunciation should be considered in terms of the modes of material nature in which it is performed.

🌹 🌹 🌹 🌹 🌹


23 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 586: 18వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 586: Chap. 18, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 03 🌴

03. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ: |
యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యమితి చాపరే ||


🌷. తాత్పర్యం :

సర్వకామ్యకర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విజ్ఞులు పలుకగా, యజ్ఞము, దానము, తపస్సనెడి కర్మలు ఎన్నడును విడువరానివని మరికొందరు మునులు పలుకుదురు.


🌷. భాష్యము :

వేదములందు వివాదాస్పాదములైన పలుకర్మలు కలవు. ఉదాహరణమునకు యజ్ఞమునందు జంతుబలిని ఒసగవచ్చునని తెలుపబడినది. అయినను కొందరు అట్టి బలి యనునవి అత్యంత హేయమని పలుకుదురు. వేదములందు యజ్ఞసమయమున జంతుబలి ఉపదేశింపబడినను వాస్తవమునకు జంతువు వధింపబడినట్లుగా భావింపబడదు. యజ్ఞవిధి జంతువునకు నూతనజన్మను గూర్చగలుగుటయే అందులకు కారణము. యజ్ఞమునందు వధింపబడిన పిమ్మట జంతువుకు కొన్నిమార్లు నూతన జంతుశరీరము కాని లేదా కొన్నిమార్లు వెంటనే మానవజన్మము కాని ఒసగబడుచుండును.

కాని ఈ విషయమున ఋషుల యందు పలు భేదాభిప్రాయములు కలవు. జంతుబలి సర్వదా నిషిద్దమని కొందరు పలుకగా, కొన్ని సమయములందు అది సబబైనదే యని మరికొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములను శ్రీకృష్ణభగవానుడే స్వయముగా పరిష్కరింపనున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 586 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 03 🌴

03. tyājyaṁ doṣa-vad ity eke karma prāhur manīṣiṇaḥ
yajña-dāna-tapaḥ-karma na tyājyam iti cāpare


🌷 Translation :

Some learned men declare that all kinds of fruitive activities should be given up as faulty, yet other sages maintain that acts of sacrifice, charity and penance should never be abandoned.


🌹 Purport :

There are many activities in the Vedic literature which are subjects of contention. For instance, it is said that an animal can be killed in a sacrifice, yet some maintain that animal killing is completely abominable. Although animal killing in a sacrifice is recommended in the Vedic literature, the animal is not considered to be killed. The sacrifice is to give a new life to the animal.

Sometimes the animal is given a new animal life after being killed in the sacrifice, and sometimes the animal is promoted immediately to the human form of life. But there are different opinions among the sages. Some say that animal killing should always be avoided, and others say that for a specific sacrifice it is good. All these different opinions on sacrificial activity are now being clarified by the Lord Himself.

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 585: 18వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 585: Chap. 18, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 585 / Bhagavad-Gita - 585 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 02 🌴

02. శ్రీభగవానువాచ

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదు: |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా: ||


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను : విషయకోరికల పరమగు కర్మలను త్యజించుటయే సన్న్యాసమని విజ్ఞులు పలుకగా, సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు.


🌷. భాష్యము :

ఫలమును గోరి కర్మల నొనరించుటను నిశ్చయముగా త్యజించవలెను. అదియే భగవద్గీత ఉపదేశము. కాని ఆధ్యాత్మికజ్ఞానమును గూర్చు కర్మలను మాత్రము ఎన్నడును విడువరాదు. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విశదీకరింపబడగలదు. ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై యజ్ఞము నాచరించు విధానములు వేదములందు తెలుపబడియున్నవి.

సత్పుత్రుని పొందుటకు లేదా ఊర్థ్వలోకములను చేరుటకు కొన్ని ప్రత్యేక యజ్ఞములున్నను, కోరికలచే ప్రేరితము లయ్యెడి యజ్ఞములను ఆపివేయవలెను. కాని హృదయ పవిత్రీకరణమునకు లేదా ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోభివృద్దికి దోహదములగు యజ్ఞములను ఎన్నడును త్యజింపరాదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 585 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 02 🌴

02. śrī-bhagavān uvāca

kāmyānāṁ karmaṇāṁ nyāsaṁ sannyāsaṁ kavayo viduḥ
sarva-karma-phala-tyāgaṁ prāhus tyāgaṁ vicakṣaṇāḥ


🌷 Translation :

The Supreme Personality of Godhead said: The giving up of activities that are based on material desire is what great learned men call the renounced order of life [sannyāsa]. And giving up the results of all activities is what the wise call renunciation [tyāga].


🌹 Purport :

The performance of activities for results has to be given up. This is the instruction of Bhagavad-gītā. But activities leading to advanced spiritual knowledge are not to be given up. This will be made clear in the next verses. In the Vedic literature there are many prescriptions of methods for performing sacrifice for some particular purpose.

There are certain sacrifices to perform to attain a good son or to attain elevation to the higher planets, but sacrifices prompted by desires should be stopped. However, sacrifice for the purification of one’s heart or for advancement in the spiritual science should not be given up.

🌹 🌹 🌹 🌹 🌹


21 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 584: 18వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 584: Chap. 18, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 584 / Bhagavad-Gita - 584 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 01 🌴

01. అర్జున ఉవాచ

సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ||


🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను : ఓ మహాబాహో! కేశిసంహారా! ఇంద్రియధీశా! త్యాగము, సన్న్యాసము అనువాని ప్రయోజనమును నేను తెలిసికొనగోరుచున్నాను.


🌷. భాష్యము :

వాస్తవమునకు భగవద్గీత పదునేడు అధ్యాయముతోనే ముగిసినది. ఈ ప్రస్తుత పదునెనిమిదవ అధ్యాయము ఇంతవరకు చర్చించిన అంశముల సారాంశమై యున్నది. తన భక్తియుతసేవయే జీవిత పరమలక్ష్యమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ప్రతి అధ్యాయమునందు నొక్కి చెప్పియున్నాడు. అదే విషయము ఈ అష్టాధ్యాయమున పరమగుహ్యజ్ఞానముగా సంగ్రహపరపబడుచున్నది.

మొదటి ఆరు అధ్యాయములలో “యోగినామపి సర్వేషాం – నన్ను తన హృదయమునందు సదా చింతించువాడు యోగులందరిలోను అత్యుత్తముడు” వంటి శ్లోకములలో ద్వారా భక్తియుతసేవకు ప్రాధాన్యము ఒసగబడినది. ఇక తదుపరి ఆరు అధ్యాయములలో శుద్ధభక్తియుతసేవ, దాని లక్షణములు, కర్మలు చర్చించబడినవి. జ్ఞానము, సన్న్యాసము, ప్రకృతికర్మలు, దివ్యస్వభావము, భక్తియుతసేవ యనునవి చివరి ఆరు అధ్యాయములలో వర్ణింపబడినవి. ఓం,తత్, సత్ అనెడి పదములతో సూచింపబడు భగవానుని సంబంధములోనే సర్వకర్మలు ఒనరింపబడవలెనని సారాంశముగా చెప్పబడినది.

అట్టి ఓం, తత్, సత్ అను పదములే దివ్యపురుషుడైన విష్ణువును సూచించును. భగవద్గీత యొక్క ఈ మూడవభాగము భక్తియుతసేవ ఒక్కటియే జీవిత ముఖ్యప్రయోజనమనియు, వేరేదియును అట్లు ముఖ్యప్రయోజనము కానేరదనియు నిర్ధారించి చూపినది. ఈ విషయమును పూర్వపు ఆచార్యులను మరియు బ్రహ్మసూత్రములను (వేదాంతసూత్రములను) ఉదహరించుట ద్వారా సమర్థింపబడినది. కొందరు నిరాకారవాదులు వేదాంతసూత్ర జ్ఞానమంతయు తమ సొత్తేయైనట్లు భావించినను, వాస్తవమునకు వేదంతసూత్రములు ముఖ్యప్రయోజనము భక్తియుతసేవను అవగాహన మొనర్చుకొనుటయే.

శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఆ వేదాంతసూత్రముల కర్త మరియు జ్ఞాత యగుటయే అందులకు కారణము. ఈ విషయము పంచదశాధ్యాయమున వివరింపబడినది. అన్ని శాస్త్రములలో (వేదములలో) భక్తియుతసేవ ఒక్కటియే లక్ష్యముగా వర్ణింపబడినదనెడి విషయమునే భగవద్గీత వివరించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 584 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 01 🌴


01. arjuna uvāca

sannyāsasya mahā-bāho
tattvam icchāmi veditum
tyāgasya ca hṛṣīkeśa
pṛthak keśi-niṣūdana


🌷 Translation :

Arjuna said: O mighty-armed one, I wish to understand the purpose of renunciation [tyāga] and of the renounced order of life [sannyāsa], O killer of the Keśī demon, master of the senses.


🌹 Purport :

Actually the Bhagavad-gītā is finished in seventeen chapters. The Eighteenth Chapter is a supplementary summarization of the topics discussed before. In every chapter of Bhagavad-gītā, Lord Kṛṣṇa stresses that devotional service unto the Supreme Personality of Godhead is the ultimate goal of life. This same point is summarized in the Eighteenth Chapter as the most confidential path of knowledge. In the first six chapters, stress was given to devotional service: yoginām api sarveṣām … “Of all yogīs or transcendentalists, one who always thinks of Me within himself is best.”

This has been established by citing past ācāryas and the Brahma-sūtra, the Vedānta-sūtra. Certain impersonalists consider themselves to have a monopoly on the knowledge of Vedānta-sūtra, but actually the Vedānta-sūtra is meant for understanding devotional service, for the Lord Himself is the composer of the Vedānta-sūtra, and He is its knower. That is described in the Fifteenth Chapter. In every scripture, every Veda, devotional service is the objective. That is explained in Bhagavad-gītā.

As in the Second Chapter a synopsis of the whole subject matter was described, in the Eighteenth Chapter also the summary of all instruction is given. The purpose of life is indicated to be renunciation and attainment of the transcendental position above the three material modes of nature. Arjuna wants to clarify the two distinct subject matters of Bhagavad-gītā, namely renunciation (tyāga) and the renounced order of life (sannyāsa).

🌹 🌹 🌹 🌹 🌹


20 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 583: 17వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 583: Chap. 17, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 583 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 28 🌴

28. ఆశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థ! పరమపురుషుని యందు శ్రద్ధలేకుండా ఒనర్చునటువంటి యజ్ఞము, దానము లేదా తపస్సనునది ఆశాశ్వతమైనది. “అసత్” అని పిలువబడు అట్టి కర్మ ప్రస్తుతజన్మము నందును, రాబోవు జన్మము నందును నిరుపయోగమే.


🌷. భాష్యము :

ఆధ్యాత్మిక లక్ష్యమనునది లేకుండా ఒనర్చుబడునదేదైనను వాస్తవమునకు వ్యర్థమైనదే. అట్టి కర్మ యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే అట్టి కర్మలు హేయములని ఈ శ్లోకమున ప్రకటింపబడినది. వాస్తవమునకు ప్రతికర్మయు శ్రీకృష్ణభగవానుని నిమిత్తమై కృష్ణభక్తిభావనలో ఒనరింపవలసియున్నది.

అటువంటి శ్రద్ధ మరియు తగిన నిర్దేశము లేనిచో ఎట్టి ఫలమును లభింపబోదు. సమస్త వేదవాజ్మయమున పరమపురుషుని యందలి శ్రద్ధయే ఉపదేశింపబడినది. వేదోపదేశముల అనుసరణము యొక్క ముఖ్యలక్ష్యము శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటయే.

ఈ విషయమును మరియు నియమమును పాటించకుండా ఎవ్వరును జయమును పొందలేరు. కనుక ఆధ్యాత్మికగురువు నేతృత్వమున తొలినుండియే కృష్ణభక్తిభావనలో కర్మ నొనరించుట ఉత్తమోత్తమ మార్గము. సర్వమును విజయవంతమొనర్చుటకు ఇదియే ఉత్తమమార్గము.

బద్దజీవనమునందు జనులు దేవతలను, భూతప్రేతములను లేదా కుబేరుడు వంటి యక్షులను పూజించుటకు ఆకర్షితులగుదురు.

సత్త్వగుణము రజస్తమోగుణముల కన్నను మెరుగైనదైనను, కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచినవాడు త్రిగుణములకు అతీతుడు కాగలడు. గుణములందు క్రమముగా ఉన్నతిని పొందు మార్గమొకటున్నను భక్తుల సాంగత్యమున ప్రత్యక్షముగా కృష్ణభక్తిలో మనుజుడు నిలువగలిగినచో అది ఉత్తమమార్గము కాగలదు.

అదియే ఈ అధ్యాయమున ఉపదేశింపబడినది. ఈ విధానమున జయమును సాధింపగోరినచో మనుజుడు తొలుత సరియైన గురువును పొంది ఆయన నిర్దేశమునందు శిక్షణను బడయవలసియుండును. పిదప అతడు శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను పొందగలడు.

కాలక్రమమున అట్టి శ్రద్ధ పరిపక్వమైనపుడు కృష్ణప్రేమగా పిలువబడును. ఆ ప్రేమయే సర్వజీవుల అంతిమలక్ష్యము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనను ప్రత్యక్షముగా స్వీకరింపవలెననుట ఈ సప్తదశాధ్యాయపు సందేశమై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “శ్రద్ధాత్రయవిభాగములు” అను సప్తదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 583 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 28 🌴

28. aśraddhayā hutaṁ dattaṁ
tapas taptaṁ kṛtaṁ ca yat
asad ity ucyate pārtha
na ca tat pretya no iha


🌷 Translation :

Anything done as sacrifice, charity or penance without faith in the Supreme, O son of Pṛthā, is impermanent. It is called asat and is useless both in this life and the next.


🌹 Purport :

Anything done without the transcendental objective – whether it be sacrifice, charity or penance – is useless.

Therefore in this verse it is declared that such activities are abominable. Everything should be done for the Supreme in Kṛṣṇa consciousness. Without such faith, and without the proper guidance, there can never be any fruit. In all the Vedic scriptures, faith in the Supreme is advised. In the pursuit of all Vedic instructions, the ultimate goal is the understanding of Kṛṣṇa.

No one can obtain success without following this principle. Therefore, the best course is to work from the very beginning in Kṛṣṇa consciousness under the guidance of a bona fide spiritual master. That is the way to make everything successful.

Although there is a process of gradual elevation, if one, by the association of pure devotees, takes directly to Kṛṣṇa consciousness, that is the best way. And that is recommended in this chapter. To achieve success in this way, one must first find the proper spiritual master and receive training under his direction.

Then one can achieve faith in the Supreme. When that faith matures, in course of time, it is called love of God. This love is the ultimate goal of the living entities. One should therefore take to Kṛṣṇa consciousness directly. That is the message of this Seventeenth Chapter.

Thus end the Bhaktivedanta Purports to the Seventeenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Divisions of Faith.

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 582: 17వ అధ్., శ్లో 26, 27 / Bhagavad-Gita - 582: Chap. 17, Ver. 26, 27


🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 26 , 27 🌴

26. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద: పార్థ యుజ్యతే ||


27. యజ్ఞే తపసి దానే చ స్థితి: సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||


🌷. తాత్పర్యం :

భక్తియుతసేవా యజ్ఞమునకు పరమలక్ష్యమైన పరతత్త్వము “సత్” అను పదముచే సూచింపబడును. ఓ పృథాకుమారా! దివ్యములై యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఒనరింపబడు సర్వ యజ్ఞ, తపో, దానకర్మలవలె అట్టి యజ్ఞకర్త కూడా “సత్” అనబడును.


🌷. భాష్యము :

గర్భమునందు చేరుట మొదలుగా జీవితాంతము వరకు మనుజుని జీవన పవిత్రీకరణమునకై వేదవాజ్మయమున పెక్కు శుద్దికర్మలు ఉపదేశింపబడినవి “ప్రశస్తే కర్మణి” (విధ్యుక్తధర్మములు) యని పదము సూచించుచున్నది. జీవుని చరమమోక్షమునకై అట్టి పవిత్రీకరణవిధానములు అవలంబింపబడును.

ఆ కార్యములన్నింటి యందును “ఓంతత్సత్” అను మంత్రమును ఉచ్చరింపవలెనని ఉపదేశింపబడినది. ఇచ్చట “సద్భావే” మరియు “సాధుభావే” యను పదములు ఆధ్యాత్మికస్థితిని సూచించుచున్నవి. కృష్ణభక్తిభావనలో వర్తించుట “సత్త్వము” అనబడగా, కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు “సాధువు” అనబడును.

ఆధ్యాత్మిక విషయములు భక్తుల సాంగత్యమున సుస్పష్టములు కాగలవని శ్రీమద్భాగవతమున (3.25.25) “సతాం ప్రసంగాత్” అను పదము ద్వారా తెలుపబడినది. అనగా సత్సాంగత్యము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజ్ఞానమును పొందలేరు. మంత్రదీక్షను ఒసగునప్పుడుగాని, యజ్ఞోపవీతమును వేయునప్పుడుగాని గురువు ఈ “ఓంతత్సత్” అను పదములను ఉచ్చరించును.

అదే విధముగా అన్ని రకములైన యజ్ఞములందలి లక్ష్యము “ఓంతత్సత్” (భగవానుడు) అనునదియే. “తదర్థీయం” అను పదము శ్రీకృష్ణభగవానునికి సంబంధించిన సేవాకార్యములను సూచించును. అనగా ప్రసాదమును తయారుచేయుట, మందిరకార్యములందు సహకరించుట, శ్రీకృష్ణభగవానుని కీర్తిని ప్రచారము చేయుట వంటి సేవలన్నింటిని అది సూచించుచున్నది.

కనుకనే కర్మలను పూర్ణమొనర్చి సర్వమును సమగ్రమొనర్చు నిమిత్తమై ఈ దివ్యములైన “ఓంతత్సత్” అను పదములు పలురీతుల ఉపయోగింపబడుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 582 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 26 , 27 🌴

26.sad-bhāve sādhu-bhāve ca
sad ity etat prayujyate
praśaste karmaṇi tathā
sac-chabdaḥ pārtha yujyate


27. yajñe tapasi dāne ca
sthitiḥ sad iti cocyate
karma caiva tad-arthīyaṁ
sad ity evābhidhīyate


🌷 Translation :

The Absolute Truth is the objective of devotional sacrifice, and it is indicated by the word sat. The performer of such sacrifice is also called sat, as are all works of sacrifice, penance and charity which, true to the absolute nature, are performed to please the Supreme Person, O son of Pṛthā.


🌹 Purport :

The words praśaste karmaṇi, or “prescribed duties,” indicate that there are many activities prescribed in the Vedic literature which are purificatory processes, beginning from the time of conception up to the end of one’s life. 

Such purificatory processes are adopted for the ultimate liberation of the living entity. In all such activities it is recommended that one vibrate oṁ tat sat.

The words sad-bhāve and sādhu-bhāve indicate the transcendental situation. Acting in Kṛṣṇa consciousness is called sattva, and one who is fully conscious of the activities of Kṛṣṇa consciousness is called a sādhu.

In the Śrīmad-Bhāgavatam (3.25.25) it is said that the transcendental subject matter becomes clear in the association of the devotees. The words used are satāṁ prasaṅgāt. Without good association, one cannot achieve transcendental knowledge. When initiating a person or offering the sacred thread, one vibrates the words oṁ tat sat.

Similarly, in all kinds of performance of yajña the object is the Supreme, oṁ tat sat. The word tad-arthīyam further means offering service to anything which represents the Supreme, including such service as cooking and helping in the Lord’s temple, or any other kind of work for broadcasting the glories of the Lord.

These supreme words oṁ tat sat are thus used in many ways to perfect all activities and make everything complete.

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 581: 17వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 581: Chap. 17, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 25 🌴

25. తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతప:క్రియా: |
దానక్రియాశ్చ వివిధా: క్రియన్తే మోక్షకాంక్షిభి: ||


🌷. తాత్పర్యం :

ఫలాపేక్షరహితముగా ప్రతివారును యజ్ఞము, తపస్సు, దానములను ‘తత్’ అను పదమును గూడి ఒనరింపవలెను. భౌతికబంధనము నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మికకర్మల ముఖ్య ప్రయోజనము.


🌷. భాష్యము :

దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి ఉద్ధరింపబడవలెనన్నచో మనుజుడు భౌతికలాభము కొరకై వర్తించరాదు. అనగా భగవద్ధామమును చేరుట యనెడి చరమలాభమును కొరకే సమస్త కర్మలను ఒనరింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 581 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 25 🌴

25. tad ity anabhisandhāya
phalaṁ yajña-tapaḥ-kriyāḥ
dāna-kriyāś ca vividhāḥ
kriyante mokṣa-kāṅkṣibhiḥ


🌷 Translation :

Without desiring fruitive results, one should perform various kinds of sacrifice, penance and charity with the word tat. The purpose of such transcendental activities is to get free from material entanglement.


🌹 Purport :

To be elevated to the spiritual position, one should not act for any material gain. Acts should be performed for the ultimate gain of being transferred to the spiritual kingdom, back to home, back to Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 580: 17వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 580: Chap. 17, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 580 / Bhagavad-Gita - 580 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 24 🌴

24. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతప:క్రియా: |
ప్రవర్తన్తే విధానోక్తా: సతతం బ్రహ్మవాదినామ్ ||


🌷. తాత్పర్యం :

కనుకనే శాస్త్రనియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్త్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారముతో ప్రారంభింతురు.


🌷. భాష్యము :

ఋగ్వేదము (1.22.20) “ఓంతద్విష్ణో: పరమం పదం” అని పలుకుచున్నది. అనగా విష్ణు పాదపద్మములే దివ్యభక్తికి స్థానములు. దేవదేవుడైన శ్రీకృష్ణుని కొరకు ఒనర్చబడునదేదైనను కర్మల యందు సంపూర్ణత్వమును నిశ్చయముగా సిద్ధింపజేయును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 580 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 24 🌴

24. tasmād oṁ ity udāhṛtya
yajña-dāna-tapaḥ-kriyāḥ
pravartante vidhānoktāḥ
satataṁ brahma-vādinām


🌷 Translation :

Therefore, transcendentalists undertaking performances of sacrifice, charity and penance in accordance with scriptural regulations begin always with oṁ, to attain the Supreme.


🌹 Purport :

Oṁ tad viṣṇoḥ paramaṁ padam (Ṛg Veda 1.22.20). The lotus feet of Viṣṇu are the supreme devotional platform. The performance of everything on behalf of the Supreme Personality of Godhead assures the perfection of all activity.

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 579: 17వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 579: Chap. 17, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 579 / Bhagavad-Gita - 579 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 23 🌴

23. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ: స్మృత: |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా: పురా ||


🌷. తాత్పర్యం :

సృష్ట్యారంభము నుండియు “ఓం, తత్, సత్” అను మూడు పదములు పరతత్త్వమును సూచించుటకు వాడబడినవి. వేదమంత్రములను ఉచ్చరించునపుడును, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము కావించునపుడును ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండెడివి.


🌷. భాష్యము :

తపస్సు, యజ్ఞము, దానము, ఆహారమనునవి సాత్త్వికము, రాజసము, తామసములనెడి మూడు రకములని ఇంతవరకు వివరింపబడినది. ఈ విధముగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతులకు చెందినను అవి ప్రకృతిజన్మములైన త్రిగుణములచే బంధింపబడునట్టివి మరియు మలినపూర్ణములైనట్టివి.

కాని అట్టి కర్మలు నిత్యుడగు శ్రీకృష్ణభగవానుని (ఓం, తత్, సత్) పరములగునప్పుడు ఆధ్యాత్మికపురోగతికి దోహదములు కాగలవు.

శాస్త్రనిర్దేశములందు అట్టి ప్రయోజనమే సూచించబడినది. ఓం, తత్, సత్ అనెడి ఈ మూడుపదములు ముఖ్యముగా పరతత్త్వమైన దేవదేవుని సూచించును. ఇక వానిలో “ఓం” అనునది అన్ని వేదమంత్రములందును గోచరించును. శాస్త్రనియమముల ననుసరింపనివాడు పరతత్త్వమును పొందలేడు.

ఒకవేళ అతడు తాత్కాలికలాభములను పొందినప్పటికిని జీవితపు అంతిమఫలమును మాత్రము సాధింపలేడు. సారాంశమేమనగా దానము, యజ్ఞము, తపస్సు అనువానిని సత్త్వగుణము నందే ఆచరింపవలెను. రజస్తమోగుణములందు ఒనరింపబడెడి ఆ కార్యములు గుణహీనములై యుండును.

మనుజుని భగవద్దామమునకు తిరిగి చేర్చు ఆధ్యాత్మికకర్మలను శాస్త్రీయముగా ఒనర్చు విధానమే అట్టి కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యమార్గమున వర్తించుటలో ఎన్నడును శక్తి వృథా కాబోదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 579 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 23 🌴

23. oṁ tat sad iti nirdeśo
brahmaṇas tri-vidhaḥ smṛtaḥ
brāhmaṇās tena vedāś ca
yajñāś ca vihitāḥ purā


🌷 Translation :

From the beginning of creation, the three words oṁ tat sat were used to indicate the Supreme Absolute Truth. These three symbolic representations were used by brāhmaṇas while chanting the hymns of the Vedas and during sacrifices for the satisfaction of the Supreme.


🌹 Purport :

It has been explained that penance, sacrifice, charity and foods are divided into three categories: the modes of goodness, passion and ignorance. But whether first class, second class or third class, they are all conditioned, contaminated by the material modes of nature.

When they are aimed at the Supreme – oṁ tat sat, the Supreme Personality of Godhead, the eternal – they become means for spiritual elevation. In the scriptural injunctions such an objective is indicated. These three words, oṁ tat sat, particularly indicate the Absolute Truth, the Supreme Personality of Godhead. In the Vedic hymns, the word oṁ is always found.

One who acts without following the regulations of the scriptures will not attain the Absolute Truth. He will get some temporary result, but not the ultimate end of life. The conclusion is that the performance of charity, sacrifice and penance must be done in the mode of goodness. Performed in the mode of passion or ignorance, they are certainly inferior in quality.

When one performs penance, charity and sacrifice with these three words, he is acting in Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is a scientific execution of transcendental activities which enables one to return home, back to Godhead. There is no loss of energy in acting in such a transcendental way.

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 578: 17వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 578: Chap. 17, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 22 🌴

22. ఆదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్ర్కుతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||


🌷. తాత్పర్యం :

అపవిత్రత ప్రదేశమునందు తగని సమయమున అపాత్రులకు ఒసగబడునటువంటిది లేదా తగిన శ్రద్ధ మరియు గౌరవము లేకుండా ఒసగబడునటువంటిదైన దానము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.


🌷. భాష్యము :

మత్తుపదార్థములను స్వీకరించు నిమిత్తముగాని, జూదము నిమిత్తముగాని చేయబడు దానములు ఇచ్చట ప్రోత్సాహింపబడుటలేదు.

అటువంటి దానము తమోగుణ ప్రధానమై లాభదాయకము కాకుండును. పైగా అటువంటి దానము చేయుటవలన పాపులను ప్రోత్సాహించినట్లే యగును.

అదే విధముగా పాత్రుడైనవానికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానమొసగుటయు తమోగుణమును కూడినట్టి దానముగా భావింపబడును

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 578 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 22 🌴

22. adeśa-kāle yad dānam
apātrebhyaś ca dīyate
asat-kṛtam avajñātaṁ
tat tāmasam udāhṛtam


🌷 Translation :

And charity performed at an impure place, at an improper time, to unworthy persons, or without proper attention and respect is said to be in the mode of ignorance.


🌹 Purport :

Contributions for indulgence in intoxication and gambling are not encouraged here.

That sort of contribution is in the mode of ignorance. Such charity is not beneficial; rather, sinful persons are encouraged.

Similarly, if a person gives charity to a suitable person but without respect and without attention, that sort of charity is also said to be in the mode of darkness.

🌹 🌹 🌹 🌹 🌹


14 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 577: 17వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 577: Chap. 17, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 577 / Bhagavad-Gita - 577 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 21 🌴

21. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పున: |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||


🌷. తాత్పర్యం :

ప్రతిఫలవాంఛతో గాని, సకామఫలవాంఛతో గాని, అయిష్టతతో గాని ఒనరింపబడు దానము రజోగుణమును కూడినట్టిదని చెప్పబడును.


🌷. భాష్యము :

దానము కొన్నిమార్లు స్వర్గలోకప్రాప్తి కొరకు గాని,అతికష్టముతోను మరియు “ఎందుకు నేనీ విధముగా ఇంత ఖర్చు చేసితిని” యనెడి పశ్చాత్తాపముతో గాని ఒనరింపబడుచుండును. మరికొన్నిమార్లు అధికారి విన్నపము ననుసరించి మొహమాటముతో అది చేయబడు చుండును. ఇట్టి దానములన్నియును రజోగుణమునందు ఒసగబడినవిగా చెప్పబడును.

అదేవిధముగా పలుధర్మసంస్థలు వివిధ సంఘములకు దానము లొసగుచుండును. ఆ సంఘములందు ఇంద్రియభోగమే కొనసాగుచుండుట వలన అటువంటి దానములు వేదములందు నిర్దేశింపబడలేదు. కేవలము సాత్త్విక దానమే వాని యందు ఉపదేశింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 577 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 21 🌴


21. yat tu pratyupakārārthaṁ
phalam uddiśya vā punaḥ
dīyate ca parikliṣṭaṁ
tad dānaṁ rājasaṁ smṛtam


🌷 Translation :

But charity performed with the expectation of some return, or with a desire for fruitive results, or in a grudging mood is said to be charity in the mode of passion.


🌹 Purport :

Charity is sometimes performed for elevation to the heavenly kingdom and sometimes with great trouble and with repentance afterwards: “Why have I spent so much in this way?” Charity is also sometimes given under some obligation, at the request of a superior. These kinds of charity are said to be given in the mode of passion.

There are many charitable foundations which offer their gifts to institutions where sense gratification goes on. Such charities are not recommended in the Vedic scripture. Only charity in the mode of goodness is recommended.

🌹 🌹 🌹 🌹 🌹


13 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 576: 17వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 576: Chap. 17, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 576 / Bhagavad-Gita - 576 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 20 🌴

20. దాతవ్యమితి యద్దానం దీయతే(నుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||


🌷. తాత్పర్యం :

ప్రతిఫలవాంఛ లేకుండా సరియైన ప్రదేశమున మరియు సరియైన సమయమున తగినవానికి స్వధర్మమనెడి భావముతో ఒనర్చబడు దానము సత్త్వగుణమును కూడినదిగా భావింపబడును.


🌷. భాష్యము :

ఆధ్యాత్మిక కర్మలందు నియుక్తుడైనవానికి దానమొసగవలెనని వేదములందు ఉపదేశింపబడినది. విచక్షణారహిత దానము వాని యందు ఉపదేశింప బడలేదు. ఆధ్యాత్మిక పూర్ణత్వమే సర్వదా ప్రధాన ప్రయోజనమై యున్నది.

కనుకనే దానమును తీర్థక్షేత్రమునందు కాని, గ్రహణ సమయములందు కాని, మాసాంతమున కాని, యోగ్యుడైన బ్రాహ్మణునకు గాని, భక్తునకు గాని, దేవాలయమునకు గాని ఒసగవలెనని ఉపదేశింపబడినది. అటువంటి దానమును ప్రతిఫలాపేక్ష రహితముగా ఒనరింపవలెను.

ధనహీనులకు కొన్నిమార్లు కరుణాస్వభావముతో దానమొసగినను, దానము గ్రహించువాడు పాత్రుడు కానిచో అట్టి దానము ఆధ్యాత్మికపురోగతికి దోహదము కాజాలదు. అనగా విచక్షణారహిత దానము వేదములందు ఉపదేశింపబడలేదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 576 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 20 🌴

20. dātavyam iti yad dānaṁ
dīyate ’nupakāriṇe
deśe kāle ca pātre ca
tad dānaṁ sāttvikaṁ smṛtam


🌷 Translation :

Charity given out of duty, without expectation of return, at the proper time and place, and to a worthy person is considered to be in the mode of goodness.


🌹 Purport :

In the Vedic literature, charity given to a person engaged in spiritual activities is recommended. There is no recommendation for giving charity indiscriminately.

Spiritual perfection is always a consideration. Therefore charity is recommended to be given at a place of pilgrimage and at lunar or solar eclipses or at the end of the month or to a qualified brāhmaṇa or a Vaiṣṇava (devotee) or in temples. Such charities should be given without any consideration of return.

Charity to the poor is sometimes given out of compassion, but if a poor man is not worth giving charity to, then there is no spiritual advancement. In other words, indiscriminate charity is not recommended in the Vedic literature.

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 575: 17వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 575: Chap. 17, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 19 🌴

19. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తప: |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||


🌷. తాత్పర్యం :

తనను తాను హింసించుకొనుటచే గాని, ఇతరులకు హాని లేదా నష్టమును గూర్చు నిమిత్తముచేగాని మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.


🌷. భాష్యము :

హిరణ్యకశిపుడు వంటి దానవులు మూఢతపస్సు నొనరించిన దృష్టాంతములు పెక్కు కలవు. అతడు అమరుడగుటకును మరియు దేవతలను నిర్జించుటకును అట్టి నిష్టాపూర్ణమగు తపస్సు నాచరించెను.

ఆ వరములకై అతడు బ్రహ్మదేవుని ప్రార్థించునను అంత్యమున దేవదేవునిచే సంహరింపబడెను. అసాధ్యమైనదాని కొరకు ఒనర్చబడెడి తపస్సు నిక్కముగ తమోగుణప్రధానమైనదే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 575 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 19 🌴

19. mūḍha-grāheṇātmano yat
pīḍayā kriyate tapaḥ
parasyotsādanārthaṁ vā
tat tāmasam udāhṛtam


🌷 Translation :

Penance performed out of foolishness, with self-torture or to destroy or injure others, is said to be in the mode of ignorance.


🌹 Purport :

There are instances of foolish penance undertaken by demons like Hiraṇyakaśipu, who performed austere penances to become immortal and kill the demigods.

He prayed to Brahmā for such things, but ultimately he was killed by the Supreme Personality of Godhead. To undergo penances for something which is impossible is certainly in the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 574: 17వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 574: Chap. 17, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 574 / Bhagavad-Gita - 574 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 18 🌴

18. సత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవమ్ ||


🌷. తాత్పర్యం :

గౌరవము, సన్న్యాసము, పూజలనందు కొరకు గర్వముచే ఒనర్చబడు తపస్సు రజోగుణ ప్రధానమైనది చెప్పబడును. అది స్థిరముగాని, శాశ్వతముగాని కాజాలదు


🌷. భాష్యము :

జనులను ఆకర్షించుటకు మరియు ఇతరుల నుండి గౌరవము, సన్న్యాసము, పూజలనందుటకు కొన్నిమార్లు తపోనిష్టలు ఆచరింపబడుచుండును. రజోగుణము నందున్నవారు తమ అనుయాయులు తమను పూజించునట్లుగాను కాళ్ళుకడిగి దక్షిణలు అర్పించునట్లుగాను చేయుచుందురు.

తపో ప్రదర్శనల ద్వారా ఏర్పాటు చేయబడెడి అట్టి కృత్రిమమైన ఏర్పాట్లు రజోగుణమునందున్నట్టివే. వాస్తవమునకు వాటి ఫలితములు తాత్కాలికములు. అవి కొంతకాలము సాగినను ఎన్నడును శాశ్వతములు కాజాలవు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 574 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 18 🌴

18. satkāra-māna-pūjārthaṁ
tapo dambhena caiva yat
kriyate tad iha proktaṁ
rājasaṁ calam adhruvam


🌷 Translation :

Penance performed out of pride and for the sake of gaining respect, honor and worship is said to be in the mode of passion. It is neither stable nor permanent.


🌹 Purport :

Sometimes penance and austerity are executed to attract people and receive honor, respect and worship from others. Persons in the mode of passion arrange to be worshiped by subordinates and let them wash their feet and offer riches.

Such arrangements artificially made by the performance of penances are considered to be in the mode of passion. The results are temporary; they can be continued for some time, but they are not permanent.

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 573: 17వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 573: Chap. 17, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 573 / Bhagavad-Gita - 573 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 17 🌴

17. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై: |
అఫలాకాంక్షిభిర్యుకై: సాత్త్వికం పరిచక్షతే ||


🌷. తాత్పర్యం :

దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమై భౌతికవాంఛారహితులైన వారిచే ఒనర్చబడు ఈ త్రివిధ తపస్సులు సాత్త్విక తపస్సనబడును.


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 573 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 17 🌴


17. śraddhayā parayā taptaṁ
tapas tat tri-vidhaṁ naraiḥ
aphalākāṅkṣibhir yuktaiḥ
sāttvikaṁ paricakṣate


🌷 Translation :

This threefold austerity, performed with transcendental faith by men not expecting material benefits but engaged only for the sake of the Supreme, is called austerity in goodness.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 572: 17వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 572: Chap. 17, Ver. 16


🌹. శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 16 🌴



16. మన:ప్రసాద: సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహ: |
భావసంశుద్దిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||


🌷. తాత్పర్యం :

తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వమును పవిత్రమొనర్చుట యనునవి మానసిక తపస్సనబడును.


🌷. భాష్యము :

మనస్సును తపోసంపన్నము చేయుట యనగా దానిని ఇంద్రియభోగము నుండి దూరము చేయుటయే. ఇతరులకు మేలు చేయుతను గూర్చియే అది ఆలోచించునట్లుగా దానిని శిక్షణము గూర్చవలెను.

ఆలోచన యందు మౌనమును కలిగియుండుటయే మనస్సుకు చక్కని శిక్షణము వంటిది. అనగా మనుజుడు కృష్ణభక్తిరసభావన నుండి ఏమాత్రము మరలక, సర్వదా ఇంద్రియభోగమును వర్జించవలెను.

ఆ విధముగా కృష్ణభక్తిభావనను పొందుటయే స్వభావమును పవిత్రమొనర్చుకొనుట కాగలదు. మనస్సును ఇంద్రియభోగ ఆలోచన నుండి దూరము చేయుట ద్వారానే మానసిక సంతృప్తి లభింపగలదు. ఇంద్రియభోగమును గూర్చి మనమెంతగా ఆలోచింతుమో అంతగా మనస్సు అసంతృప్తికి గురియగును.

నేటికాలమున మనము మనస్సును పలువిధములైన ఇంద్రియభోగ పద్ధతుల యందు అనవసరముగా నెలకొల్పుట వలననే మన మనస్సు తృప్తినొందు అవకాశమును పొందకున్నది. వేదవాజ్మయము వైపునకు దానిని మళ్ళించుటయే ఉత్తమమార్గము.

అట్టి వాజ్మయము పురాణములు, మహాభారతములలో వలె మనస్తృప్తికర కథలను కలిగియుండును. మనుజుడు ఆ జ్ఞానము యొక్క లాభమును గొని పవిత్రుడు కాగలడు. మనస్సు సర్వదా వంచన స్వభావ వర్జితమై, ఇతరుల శ్రేయస్సునే తలుపవలెను.

ఆత్మానుభవమును గూర్చి మనుజుడు సదా యోచించుటయే మౌనమనుదాని భావము. ఇట్టి భావన దృష్ట్యా కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు సంపూర్ణ మౌనమును పాటించనివాడే యగుచున్నాడు. మనోనిగ్రహమనగా మనస్సును ఇంద్రియభోగానుభవము నుండి దూరము చేయుటని భావము.

అంతియేగాక మనుజుడు తన వ్యవహారములందు ఋజుత్వమును కలిగియుండి, తద్ద్వారా తన అస్తిత్వమును పవిత్రమొనర్చుకొనవలెను. ఈ లక్షణములన్నియును కలసి మానసిక తపస్సనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 572 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 16 🌴



16. manaḥ-prasādaḥ saumyatvaṁ
maunam ātma-vinigrahaḥ
bhāva-saṁśuddhir ity etat
tapo mānasam ucyate


🌷 Translation :

And satisfaction, simplicity, gravity, self-control and purification of one’s existence are the austerities of the mind.


🌹 Purport :

To make the mind austere is to detach it from sense gratification. It should be so trained that it can be always thinking of doing good for others. The best training for the mind is gravity in thought.

One should not deviate from Kṛṣṇa consciousness and must always avoid sense gratification. To purify one’s nature is to become Kṛṣṇa conscious. Satisfaction of the mind can be obtained only by taking the mind away from thoughts of sense enjoyment. The more we think of sense enjoyment, the more the mind becomes dissatisfied.

In the present age we unnecessarily engage the mind in so many different ways for sense gratification, and so there is no possibility of the mind’s becoming satisfied. The best course is to divert the mind to the Vedic literature, which is full of satisfying stories, as in the Purāṇas and the Mahābhārata.

One can take advantage of this knowledge and thus become purified. The mind should be devoid of duplicity, and one should think of the welfare of all. Silence means that one is always thinking of self-realization. The person in Kṛṣṇa consciousness observes perfect silence in this sense.

Control of the mind means detaching the mind from sense enjoyment. One should be straightforward in his dealings and thereby purify his existence. All these qualities together constitute austerity in mental activities.

🌹 🌹 🌹 🌹 🌹


08 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 571: 17వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 571: Chap. 17, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 571 / Bhagavad-Gita - 571 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 15 🌴



15. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే ||



🌷. తాత్పర్యం :

సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణము చేయుట యనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును.


🌷. భాష్యము :

ఇతరుల మనస్సు కలతపడు రీతిలో మనుజుడు ఎన్నడును భాషించరాదు. కాని ఉపాధ్యాయుడు మాత్రము శిక్షణ నిమిత్తమై తన విద్యార్థులతో సత్యమును పలుకవచ్చును.

అదే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు కానివారి యెడ మాత్రము భిన్నముగా ప్రవర్తించవలెను. అనగా తాను వారి కలతకు కారణమైనచో అతడు వారితో సంభాషింపరాదు. వాక్కునకు సంబంధించినంతవరకు ఇదియే తపస్సు. దీనితోపాటు వ్యర్థప్రసంగమును కూడా చేయరాదు.

సత్సంగమునందు కేవలము శాస్త్రములచే సమర్థింపబడిన దానినే పలుకవలెను. ఆ సమయమున తాను ప్రవచించు విషయములను సమర్థించుటకు శాస్త్రప్రమాణమును నిదర్శనముగా చూపవలెను. దానితోపాటు ఆ ప్రవచనము కూడా శ్రవణానందకరముగా నుండవలెను.

అట్టి చర్చల ద్వారా మనుజుడు దివ్యలాభమును పొంది మానవసంఘమును ఉద్ధరింపగలడు. వేదవాజ్మయము అనంతముగా నున్నది. మనుజుడు దానిని అధ్యయనము కావింపవలెను.అదియే వాచిక తపస్సనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 571 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 15 🌴



15. anudvega-karaṁ vākyaṁ
satyaṁ priya-hitaṁ ca yat
svādhyāyābhyasanaṁ caiva
vāṅ-mayaṁ tapa ucyate


🌷 Translation :

Austerity of speech consists in speaking words that are truthful, pleasing, beneficial, and not agitating to others, and also in regularly reciting Vedic literature.


🌹 Purport :

One should not speak in such a way as to agitate the minds of others. Of course, when a teacher speaks, he can speak the truth for the instruction of his students, but such a teacher should not speak to those who are not his students if he will agitate their minds.

This is penance as far as talking is concerned. Besides that, one should not talk nonsense. The process of speaking in spiritual circles is to say something upheld by the scriptures. One should at once quote from scriptural authority to back up what he is saying.

At the same time, such talk should be very pleasurable to the ear. By such discussions, one may derive the highest benefit and elevate human society. There is a limitless stock of Vedic literature, and one should study this. This is called penance of speech.

🌹 🌹 🌹 🌹 🌹


07 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 570: 17వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 570: Chap. 17, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 570 / Bhagavad-Gita - 570 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 14 🌴


14. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||


🌷. తాత్పర్యం :

దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికగురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరిక తపస్సని చెప్పబడును.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను, నిష్ఠలను వివరింపనెంచి తొలుత దేహసంబంధమైన తపోనిష్ఠలను వివరించుచున్నాడు. ప్రతియొక్కరు దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులును యోగ్యులును అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేదజ్ఞానపారంగతుడైనవానికి గౌరవమొసగవలెను లేదా గౌరవమొసగుటను నేర్వవలెను.

వీరందరును నిక్కముగా సరియైన గౌరవమందవలసినవారు. అంతియేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు,వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను.

శాస్త్రమునందు తెలుపబడనటువంటి దానినెన్నడును అతడు ఆచరించరాదు. శాస్త్రమందు మైథునమన్నది వైవాహిక జీవనమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు అవివాహిక సంబంధమును కలిగియుండరాదు. ఇదియే బ్రహ్మచర్యమనబడును.ఇవియే దేహపరమైన తపోనిష్ఠలు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 570 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 14 🌴


14. deva-dvija-guru-prājña-
pūjanaṁ śaucam ārjavam
brahmacaryam ahiṁsā ca
śārīraṁ tapa ucyate


🌷 Translation :

Austerity of the body consists in worship of the Supreme Lord, the brāhmaṇas, the spiritual master, and superiors like the father and mother, and in cleanliness, simplicity, celibacy and nonviolence.


🌹 Purport :

The Supreme Godhead here explains the different kinds of austerity and penance. First He explains the austerities and penances practiced by the body.

One should offer, or learn to offer, respect to God or to the demigods, the perfect, qualified brāhmaṇas and the spiritual master and superiors like father, mother or any person who is conversant with Vedic knowledge. These should be given proper respect. One should practice cleansing oneself externally and internally, and he should learn to become simple in behavior.

He should not do anything which is not sanctioned by the scriptural injunctions. He should not indulge in sex outside of married life, for sex is sanctioned in the scripture only in marriage, not otherwise. This is called celibacy. These are penances and austerities as far as the body is concerned.

🌹 🌹 🌹 🌹 🌹


06 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 569: 17వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 569: Chap. 17, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 569 / Bhagavad-Gita - 569 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 13 🌴

13. విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||


🌷. తాత్పర్యం :

శాస్త్రనిర్దేశముల యెడ గౌరవము లేకుండ, ప్రసాదవితరణము కాని, వేదమంత్రోచ్చారణము కాని, బ్రాహ్మణదక్షిణలు కాని లేకుండా శ్రద్ధారహితముగా ఒనర్చబడు ఏ యజ్ఞమైనను తామసగుణ ప్రధానమైనదిగా భావింపబడును.


🌷. భాష్యము :

తామసగుణ ప్రధానమైన శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధారాహిత్యమే యనబడును. కొందరు ఏదేని ఒక దేవతను ధనలాభము కొరకై పూజించి, తదుపరి ఆ ధనమును శాస్త్రనిర్దేశములను లెక్కజేయక వినోదమందు ఖర్చుచేయుదురు.

అటువంటి ధర్మకార్యప్రదర్శనములు నిజమైనవిగా గుర్తింపబడవు. అవియన్నియును తమోగుణమును కూడినట్టివే. అవి కేవలము దానవప్రవృత్తిని కలిగించే గాని మానవులకు హితకరములు కాజాలవు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 569 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 13 🌴

13. vidhi-hīnam asṛṣṭānnaṁ
mantra-hīnam adakṣiṇam
śraddhā-virahitaṁ yajñaṁ
tāmasaṁ paricakṣate


🌷 Translation :

Any sacrifice performed without regard for the directions of scripture, without distribution of prasādam [spiritual food], without chanting of Vedic hymns and remunerations to the priests, and without faith is considered to be in the mode of ignorance.


🌹 Purport :

Faith in the mode of darkness or ignorance is actually faithlessness. Sometimes people worship some demigod just to make money and then spend the money for recreation, ignoring the scriptural injunctions.

Such ceremonial shows of religiosity are not accepted as genuine. They are all in the mode of darkness; they produce a demoniac mentality and do not benefit human society.

🌹 🌹 🌹 🌹 🌹


05 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 568: 17వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 568: Chap. 17, Ver. 12



🌹. శ్రీమద్భగవద్గీత - 568 / Bhagavad-Gita - 568 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 12 🌴


12. అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||


🌷. తాత్పర్యం :

ఓ భరతశ్రేష్టా! ఏదేని ఒక భౌతికలాభము కొరకు లేదా ఆడంబరము కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణప్రధానమైనదని యెరుగుము. 


🌷. భాష్యము :

కొన్నిమార్లు యజ్ఞములు మరియు ఆచారకర్మలు ఉన్నతలోక ప్రాప్తి కొరకు లేదా ఈ జగమున ఏదేని భౌతికలాభము కొరకు ఒనరించబడుచుండును. అట్టి యజ్ఞములు లేదా ఆచారకర్మలు రజోగుణ ప్రధానములైనవిగా భావింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 568 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 12 🌴


12. abhisandhāya tu phalaṁ
dambhārtham api caiva yat
ijyate bharata-śreṣṭha
taṁ yajñaṁ viddhi rājasam


🌷 Translation :

But the sacrifice performed for some material benefit, or for the sake of pride, O chief of the Bhāratas, you should know to be in the mode of passion.


🌹 Purport :

Sometimes sacrifices and rituals are performed for elevation to the heavenly kingdom or for some material benefits in this world. Such sacrifices or ritualistic performances are considered to be in the mode of passion.

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2020

శ్రీమద్భగవద్గీత - 567: 17వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 567: Chap. 17, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 11 🌴


11. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదిష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మన: సమాధాయ స సాత్త్విక: ||


🌷. తాత్పర్యం :

శాస్త్రనిర్దేశానుసారము తమ విధి యని తలచబడును ఫలములు కోరనివారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములందు సాత్త్విక యజ్ఞమనబడును.


🌷. భాష్యము :

ఏదేని ఒక ప్రయోజనమును మనస్సు నందుంచుకొని యజ్ఞమును నిర్వహించుట సర్వసాధారణ విషయము. కాని యజ్ఞమును ఎటువంటి కోరిక లేకుండా చేయవలెనని ఇచ్చట పేర్కొనబడినది. అది సదా స్వధర్మమనెడి దృష్టితో చేయబడవలెనని. దేవాలయములందు గాని, క్రైస్తవ ప్రార్థనా మందిరములందు గాని నిర్వహింపబడు కార్యములను మనము ఉదాహరణముగా తీసుకొనవచ్చును.

సాధారణముగా ఆ కార్యములన్నియును ఏదేని ఒక భౌతికప్రయోజనము దృష్ట్యానే ఒనరింపబడుచుండును. కాని అవన్నియును సత్త్వగుణమునకు సంబంధించినవి కావు. కావున మనుజుడు స్వధర్మమనెడి భావనలో మందిరమునకేగి, భగవానునకు వందనముల నొసగి, పుష్పములను, ఆహారపదార్థములను సమర్పింపవలెను.

కేవలము పూజనిమిత్తమే మందిరమున కేగుట వలన ప్రయోజనము లేదని కొందరు తలతురు. కాని భౌతికప్రయోజనార్థమై పూజలొనరించుటయు శాస్త్రములందు ఆదేశింపబడలేదు. అనగా కేవలము భగవానునకు వందనముల నొసగు నిమిత్తమే మందిరమున కేగవలెను.

అది మనుజుని సత్త్వగుణప్రదానునిగా చేయగలదు. కనుక శాస్త్రవిధులను ఆమోదించుట మరియు దేవదేవుడైన శ్రీకృష్ణునికి వందనము నొసగుట యనెడి కార్యముల ప్రతినాగరిక మనుజుని ధర్మమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 567 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 17 - The Divisions of Faith - 11 🌴


11. aphalākāṅkṣibhir yajño
vidhi-diṣṭo ya ijyate
yaṣṭavyam eveti manaḥ
samādhāya sa sāttvikaḥ


🌷 Translation :

Of sacrifices, the sacrifice performed according to the directions of scripture, as a matter of duty, by those who desire no reward, is of the nature of goodness.


🌹 Purport :

The general tendency is to offer sacrifice with some purpose in mind, but here it is stated that sacrifice should be performed without any such desire. It should be done as a matter of duty. Take, for example, the performance of rituals in temples or in churches. Generally they are performed with the purpose of material benefit, but that is not in the mode of goodness.

One should go to a temple or church as a matter of duty, offer respect to the Supreme Personality of Godhead and offer flowers and eatables without any purpose of obtaining material benefit. Everyone thinks that there is no use in going to the temple just to worship God. But worship for economic benefit is not recommended in the scriptural injunctions.

One should go simply to offer respect to the Deity. That will place one in the mode of goodness. It is the duty of every civilized man to obey the injunctions of the scriptures and offer respect to the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2020



Please join and share with your friends. 
You can find All my messages from beginning in these groups.


Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam                 #PrasadBhardwaj

 


WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx

Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Whatsapp Group: Vedas And Puranas
https://chat.whatsapp.com/HPdh0EYd5vdC3l6o0sQwZr


Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam

Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra

Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 
https://t.me/srilalithadevi

Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam


Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom

Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness


Indaichat : Join Indaichat 


Blogs/Websites:
www.incarnation14.wordpress.com

www.dailybhakthimessages.blogspot.com