✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 78 🌴
చివరి భాగము.
78. యత్ర యోగేశ్వర: కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధర: |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా
నీతిర్మతిర్మమ ||
🌷. తాత్పర్యం :
యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేతి ధనుర్ధారియైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణశక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.
🌷. భాష్యము :
భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణలో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారులు విజయము పట్ల అతడు మిగుల ఆశను కలిగియుండెను. విజయము తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను.
కాని యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో “నీవు విజయమును గూర్చి ఆలోచించినను, నా అభిప్రాయము ప్రకారము శ్రీకృష్ణార్జునులు ఎచ్చట నుందురో అచ్చటనే సర్వశుభము కలుగగలదు” అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు.
శ్రీకృష్ణుడు నిలిచియున్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించుననుట నిశ్చయమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునుని రథచోదకుడగుట ఆ భగవానుని మరొక విభూతియై యున్నది. శ్రీకృష్ణునకు గల పలువిభూతులలో వైరాగ్యము ఒకటి.
శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతము ప్రభువైనందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించెను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి యుండెను. అర్జునుడు కేవలము తన అగ్రజూడైన ధర్మరాజు తరపున పోరుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జును లిరువురును ధర్మరాజు పక్షమున ఉండుటచే అతని విజయము తథ్యమై యుండెను.
ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధము ఏర్పాటు చేయబడెను. అట్టి రాజ్యాధికారము యుధిష్టిరునకే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యద్వాణిని పలికినాడు. అంతియేగాక యుద్ధ విజయానంతరము ధర్మరాజు మరింతగా సుఖసంపదలతో వర్థిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది.
ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడే గాక గొప్ప నీతిమంతుడగుటయే అందులకు కారణము. అతడు జీవితమున ఎన్నడును అసత్యమును పలిగియుండలేదు.
భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణగా భావించు మూఢులు పెక్కుమంది కలరు. కాని స్నేహితుల నడుమ జరిగెడి సాధారణ సంభాషణ లెన్నడును శాస్త్రము కాజాలదు. మరికొందరు అధర్మకార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురికొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుదురు. కాని వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశమనెడి నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.
దివ్య ధర్మోపదేశము గీత యందలి నవమాధ్యాయపు ముప్పదినాలుగవ శ్లోకమున “మన్మనాభవ మద్భక్త:”యని తెలుపబడినది. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానునికి భక్తులు కావలసియున్నది. సర్వధర్మముల సారము శ్రీకృష్ణుని శరణుపొందుటయే (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ).
కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండియున్నది. ఇతరమార్గములు సైతము పవిత్ర్రీకరణమొనర్చునవే యైనను మరియు అంత్యమున ఈ మార్గమునకే మనుజుని గొనివచ్చునవైనను భగవద్గీత యందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున శ్రీకృష్ణభగవానుని శరణాగతి.
అట్టి శరణాగతియే అష్టాదశాధ్యాయపు తుది నిర్ణయమై యున్నది.
శ్రీకృష్ణ పరమాత్మనే నమః
సమాప్తం.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 661 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 78 🌴
Last Part
78. yatra yogeśvaraḥ kṛṣṇo
yatra pārtho dhanur-dharaḥ
tatra śrīr vijayo bhūtir
dhruvā nītir matir mama
🌷 Translation :
Wherever there is Kṛṣṇa, the master of all mystics, and wherever there is Arjuna, the supreme archer, there will also certainly be opulence, victory, extraordinary power, and morality. That is my opinion.
🌹 Purport :
The Bhagavad-gītā began with an inquiry of Dhṛtarāṣṭra’s. He was hopeful of the victory of his sons, assisted by great warriors like Bhīṣma, Droṇa and Karṇa.
He was hopeful that the victory would be on his side. But after describing the scene on the battlefield, Sañjaya told the King, “You are thinking of victory, but my opinion is that where Kṛṣṇa and Arjuna are present, there will be all good fortune.” He directly confirmed that Dhṛtarāṣṭra could not expect victory for his side.
Victory was certain for the side of Arjuna because Kṛṣṇa was there. Kṛṣṇa’s acceptance of the post of charioteer for Arjuna was an exhibition of another opulence. Kṛṣṇa is full of all opulences, and renunciation is one of them. There are many instances of such renunciation, for Kṛṣṇa is also the master of renunciation.
The fight was actually between Duryodhana and Yudhiṣṭhira. Arjuna was fighting on behalf of his elder brother, Yudhiṣṭhira. Because Kṛṣṇa and Arjuna were on the side of Yudhiṣṭhira, Yudhiṣṭhira’s victory was certain.
The battle was to decide who would rule the world, and Sañjaya predicted that the power would be transferred to Yudhiṣṭhira. It is also predicted here that Yudhiṣṭhira, after gaining victory in this battle, would flourish more and more because not only was he righteous and pious but he was also a strict moralist. He never spoke a lie during his life.
There are many less intelligent persons who take Bhagavad-gītā to be a discussion of topics between two friends on a battlefield. But such a book cannot be scripture. Some may protest that Kṛṣṇa incited Arjuna to fight, which is immoral, but the reality of the situation is clearly stated: Bhagavad-gītā is the supreme instruction in morality.
The supreme instruction of morality is stated in the Ninth Chapter, in the thirty-fourth verse: man-manā bhava mad-bhaktaḥ. One must become a devotee of Kṛṣṇa, and the essence of all religion is to surrender unto Kṛṣṇa (sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja). The instructions of Bhagavad-gītā constitute the supreme process of religion and of morality.
All other processes may be purifying and may lead to this process, but the last instruction of the Gītā is the last word in all morality and religion: surrender unto Kṛṣṇa. This is the verdict of the Eighteenth Chapter.
Sri Krishna Paramathmane namah
THE END
🌹 🌹 🌹 🌹 🌹
10 Mar 2021