శ్రీమద్భగవద్గీత - 655: 18వ అధ్., శ్లో 72 / Bhagavad-Gita - 655: Chap. 18, Ver. 72


🌹. శ్రీమద్భగవద్గీత - 655 / Bhagavad-Gita - 655 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 72 🌴

72. కచ్చిదేతచ్చ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహ:
ప్రనష్ట స్తే ధనంజయ ||

🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ధనంజయా! ఏకాగ్రమనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా?

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మికగురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధముగా అవగతము చేసికొనెనా లేదా యని ప్రశ్నించుట అతని ధర్మమై యున్నది. ఒకవేళ అర్జునుడు అవగతము చేసికొననిచో అవసరమైన ఏదేని ఒక విషయమును గాని లేదా సంపూర్ణగీతను గాని శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై యున్నాడు.

వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి గాని, శ్రీకృష్ణుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి గాని గీతాశ్రవణము చేసినవాడు తన అజ్ఞానమును నశింపజేసికొనగలడు. భగవద్గీత యనునది ఏదో ఒక కవి లేదా నవలారచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినట్టిది.

కనుక శ్రీకృష్ణుని నుండి గాని, అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి గాని ఆ ఉపదేశములను శ్రవణము చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్తపురుషుడై అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 655 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 72 🌴

72. kaccid etac chrutaṁ pārtha
tvayaikāgreṇa cetasā
kaccid ajñāna-sammohaḥ
praṇaṣṭas te dhanañ-jaya

🌷 Translation :

O son of Pṛthā, O conqueror of wealth, have you heard this with an attentive mind? And are your ignorance and illusions now dispelled?

🌹 Purport :

The Lord was acting as the spiritual master of Arjuna. Therefore it was His duty to inquire from Arjuna whether he understood the whole Bhagavad-gītā in its proper perspective. If not, the Lord was ready to re-explain any point, or the whole Bhagavad-gītā if so required.

Actually, anyone who hears Bhagavad-gītā from a bona fide spiritual master like Kṛṣṇa or His representative will find that all his ignorance is dispelled. Bhagavad-gītā is not an ordinary book written by a poet or fiction writer; it is spoken by the Supreme Personality of Godhead.

Any person fortunate enough to hear these teachings from Kṛṣṇa or from His bona fide spiritual representative is sure to become a liberated person and get out of the darkness of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021