శ్రీమద్భగవద్గీత - 656: 18వ అధ్., శ్లో 73 / Bhagavad-Gita - 656: Chap. 18, Ver. 73


🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 73 🌴

73. నష్టో మోహ: స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసన్దేహ:
కరిష్యే వచనం తవ ||

🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడును, సందేహరహితుడును అయి నీ ఆజ్ఞానుసారమును వర్తించుటకు సిద్ధముగా నున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని (అర్జునుని) సహజస్థితియై యున్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు.

జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే యని చైతన్యమహాప్రభువు కూడా తెలిపియున్నారు. ఈ సిద్ధాంతము మరచియే జీవుడు భౌతికప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కాని అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజస్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసివచ్చును.

ఒకవేళ అతడు శ్రీకృష్ణభగవానుని సేవించినచో తన సహజస్థితియందు నిలువగలడు. కాని భౌతికశక్తియైన మాయను సేవింపదలచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతికజగమున సేవను గూర్చుచు అతడు ఇచ్చాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేతయైనట్లు భావించును.

అట్టి భావనయే భ్రాంతి యనబడును. కాని మనుజుడు ముక్తుడైనపుడు అట్టి భ్రాంతి నశించి, ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్చందముగా శరణాగతుడగును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 656 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 73 🌴

73. arjuna uvāca
naṣṭo mohaḥ smṛtir labdhā
tvat-prasādān mayācyuta
sthito ’smi gata-sandehaḥ
kariṣye vacanaṁ tava

🌷 Translation :

Arjuna said: My dear Kṛṣṇa, O infallible one, my illusion is now gone. I have regained my memory by Your mercy. I am now firm and free from doubt and am prepared to act according to Your instructions.

🌹 Purport :

The constitutional position of a living entity, represented by Arjuna, is that he has to act according to the order of the Supreme Lord. He is meant for self-discipline.

Śrī Caitanya Mahāprabhu says that the actual position of the living entity is that of eternal servant of the Supreme Lord. Forgetting this principle, the living entity becomes conditioned by material nature, but in serving the Supreme Lord he becomes the liberated servant of God.

The living entity’s constitutional position is to be a servitor; he has to serve either the illusory māyā or the Supreme Lord. If he serves the Supreme Lord he is in his normal condition, but if he prefers to serve the illusory, external energy, then certainly he will be in bondage. In illusion the living entity is serving in this material world.

He is bound by his lust and desires, yet he thinks of himself as the master of the world. This is called illusion. When a person is liberated, his illusion is over, and he voluntarily surrenders unto the Supreme to act according to His desires.

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021