శ్రీమద్భగవద్గీత - 660: 18వ అధ్., శ్లో 77 / Bhagavad-Gita - 660: Chap. 18, Ver. 77


🌹. శ్రీమద్భగవద్గీత - 660 / Bhagavad-Gita - 660 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 77 🌴

77. తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే: |
విస్మయో మే మహాన్ రాజన్
హృష్యామి చ పున: పున: ||


🌷. తాత్పర్యం :

ఓ రాజా! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగవానుని రూపమున స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నొందుచు మరల మరల ఆనందము ననుభవించుచున్నాను.


🌷. భాష్యము :

వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతము అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును గాంచగలిగినట్లు ఇచ్చట గోచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడును చూపలేదని తెలుపబడినది. అది ఒక్క అర్జనునికే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతము ఆ రూపమును గాంచగలిగిరి. అట్టివారిలో వ్యాసమహర్షి ఒకరు.

శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన ఆ అద్భుత రూపమున తలచుచు సంజయుడు మరల మరల ఆనందము ననుభవించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 660 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 77 🌴

77. tac ca saṁsmṛtya saṁsmṛtya rūpam aty-adbhutaṁ hareḥ
vismayo me mahān rājan hṛṣyāmi ca punaḥ punaḥ


🌷 Translation :

O King, as I remember the wonderful form of Lord Kṛṣṇa, I am struck with wonder more and more, and I rejoice again and again.


🌹 Purport :

It appears that Sañjaya also, by the grace of Vyāsa, could see the universal form Kṛṣṇa exhibited to Arjuna. It is, of course, said that Lord Kṛṣṇa had never exhibited such a form before. It was exhibited to Arjuna only, yet some great devotees could also see the universal form of Kṛṣṇa when it was shown to Arjuna, and Vyāsa was one of them.

He is one of the great devotees of the Lord, and he is considered to be a powerful incarnation of Kṛṣṇa. Vyāsa disclosed this to his disciple Sañjaya, who remembered that wonderful form of Kṛṣṇa exhibited to Arjuna and enjoyed it repeatedly.

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021