శ్రీమద్భగవద్గీత - 311: 08వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 311: Chap. 08, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 311 / Bhagavad-Gita - 311 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 01 🌴


01. అర్జున ఉవాచ

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ||

🌷. తాత్పర్యం :

అర్జునుడు ప్రశ్నించెను: ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేవి? భౌతికసృష్టి యననేమి? దేవతలన నెవరు? దయతో ఇది నాకు వివరింపుము.

🌷. భాష్యము :

“బ్రహ్మమననేమి?” యను ప్రశ్నతో మొదలైన అర్జునుని వివిధప్రశ్నలను శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయనము సమాధానము లొసగును. కామ్యకర్మలు, భక్తియుక్తసేవ, యోగనియమములు, శుద్ధభక్తిని గూర్చియు దీని యందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్త్వమనునది బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా తెలియబడుచున్నది శ్రీమద్భాగవతము వివరించుచున్నది. కాని దీనితోపాటు జీవాత్మ కూడా బ్రహ్మముగానే పిలువబడుచుండును. దేహము, ఆత్మ, మనస్సు యనువానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. వేదనిఘంటువు ప్రకారము ఆత్మ యనగా మనస్సు, ఆత్మ, దేహము, ఇంద్రియములనియు భావము.

ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా సంభోదించెను. అనగా అతడు పరమపురుషునే ప్రశ్నించుచున్నాడు గాని సామాన్య స్నేహితుని కాదు. శ్రీకృష్ణుడు నిశ్చితమైన సమాధానములొసగు పరమప్రామాణికుడని అతడు ఎరిగియున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 311 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 01 🌴


01. arjuna uvāca

kiṁ tad brahma kim adhyātmaṁ kiṁ karma puruṣottama
adhibhūtaṁ ca kiṁ proktam adhidaivaṁ kim ucyate

🌷 Translation :

Arjuna inquired: O my Lord, O Supreme Person, what is Brahman? What is the self? What are fruitive activities? What is this material manifestation? And what are the demigods? Please explain this to me.

🌹 Purport :

In this chapter Lord Kṛṣṇa answers different questions from Arjuna, beginning with “What is Brahman?” The Lord also explains karma (fruitive activities), devotional service and yoga principles, and devotional service in its pure form. The Śrīmad-Bhāgavatam explains that the Supreme Absolute Truth is known as Brahman, Paramātmā and Bhagavān. In addition, the living entity, the individual soul, is also called Brahman. Arjuna also inquires about ātmā, which refers to body, soul and mind. According to the Vedic dictionary, ātmā refers to the mind, soul, body and senses also.

Arjuna has addressed the Supreme Lord as Puruṣottama, Supreme Person, which means that he was putting these questions not simply to a friend but to the Supreme Person, knowing Him to be the supreme authority able to give definitive answers.

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2020