🌹. శ్రీమద్భగవద్గీత - 286 / Bhagavad-Gita - 286 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 06 🌴
06. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా ||
🌷. తాత్పర్యం :
సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండుప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగుము.
🌷. భాష్యము :
దృశ్యమాన జగత్తంతయు ఆత్మ, భౌతికపదార్థముల కలయికచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా, భౌతికపదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితియందును భౌతికపదార్థముచే సృష్టించబడదు.
వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మికశక్తి ఆధారము పైననే సృష్టింపబడినది. భౌతికపదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూలదేహము వృద్ధినొందును. శిశువు క్రమముగా బాలునిగా, పిదప యౌవనవంతునిగా మారుటకు ఉన్నతశక్తియగు ఆత్మఉనికియే కారణము.
అదే విధముగా పరమాత్మయైన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధినొందినది. కనుకనే భౌతికపదార్థము, ఆత్మ అనునవి శ్రీకృష్ణభగవానుని శక్తులుగా తెలియబడుచున్నవి. అనగా శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు మూలకారణుడై యున్నాడు.
అతని అంశయైన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటు భవంతినిగాని లేదా గొప్పనగరముగాని లేదా గొప్ప కర్మాగారమునుగాని సృష్టింపవచ్చునేమో గాని విశ్వమును మాత్రము సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే (విభుఆత్మ) కారణుడై యున్నాడు. అటువంటి విభుఆత్మ మరియు అణుఆత్మలకు (జీవులకు) శ్రీకృష్ణుడే మూలకారణుడు.
కనుకనే అతడు సర్వకారణములకు కారణమై యున్నాడు. “నిత్యోనిత్యానం చేతనశ్చేతనానాం” అని ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 286 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 06 🌴
06. etad-yonīni bhūtāni sarvāṇīty upadhāraya
ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā
🌷 Translation :
All created beings have their source in these two natures. Of all that is material and all that is spiritual in this world, know for certain that I am both the origin and the dissolution.
🌹 Purport :
Everything that exists is a product of matter and spirit. Spirit is the basic field of creation, and matter is created by spirit.
Spirit is not created at a certain stage of material development. Rather, this material world is manifested only on the basis of spiritual energy.
This material body is developed because spirit is present within matter; a child grows gradually to boyhood and then to manhood because that superior energy, spirit soul, is present.
Similarly, the entire cosmic manifestation of the gigantic universe is developed because of the presence of the Supersoul, Viṣṇu.
Therefore spirit and matter, which combine to manifest this gigantic universal form, are originally two energies of the Lord, and consequently the Lord is the original cause of everything.
A fragmental part and parcel of the Lord, namely the living entity, may be the cause of a big skyscraper, a big factory, or even a big city, but he cannot be the cause of a big universe. The cause of the big universe is the big soul, or the Supersoul.
And Kṛṣṇa, the Supreme, is the cause of both the big and small souls. Therefore He is the original cause of all causes.
This is confirmed in the Kaṭha Upaniṣad (2.2.13). Nityo nityānāṁ cetanaś cetanānām.
🌷 🌷 🌷 🌷 🌷
2 Feb 2020