శ్రీమద్భగవద్గీత - 297: 07వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 297: Chap. 07, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 297 / Bhagavad-Gita - 297 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 17 🌴

17. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినో(త్యర్థమహం స చ మమ ప్రియ: ||

🌷. తాత్పర్యం :

వీరిలో సంపూర్ణజ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.

🌷. భాష్యము :

ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, దివ్యజ్ఞానమును సముపార్జించగోరు జ్ఞాని యనువారలు విషయకోరికల నుండి విడివడినప్పుడు శుద్ధభక్తులు కాగలరు.

వీరిలో పరతత్త్వజ్ఞానమును కలిగి సర్వవిషయకోరికల నుండి ముక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిజమైన భక్తుడు కాగలడు. ఇట్టి సుకృతులైన నలుగురిలో సంపూర్ణ జ్ఞానవంతుడై యుండి అదే సమయమున భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యుత్తముడని శ్రీకృష్ణభగవానుడు తెలుపుచున్నాడు.

జ్ఞానమును అన్వేషించువాడు తనను దేహము కన్నను అన్యునిగా తెలిసికొని, మరింత పురోగతి పొందిన పిదప నిరాకారబ్రహ్మానుభూతిని మరియు పరమాత్మానుభవమును పొందును. అతడు పూర్ణముగా పవిత్రుడైనప్పుడు తన నిజస్థితి శ్రీకృష్ణభగవానుని దాసత్వమే ననెడి విషయమును అవగతము చేసికొనగలడు.

అనగా శుద్ధభక్తుల సాంగత్యములో జిజ్ఞాసువు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని అనువారలు క్రమముగా పవిత్రులు కాగలరు. కాని ప్రయత్నదశలో శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానమును కలిగియుండి, అదే సమయమున సేవను సైతము గూర్చువాడు ఆ భగవానుని మిక్కిలి ప్రియతముడు కాగలడు.

భగవానుని దివ్యమగు శుద్ధజ్ఞానమునందు నెలకొనినవాడు భక్తిచే రక్షితుడై యుండి భౌతికకల్మషములచే ఎన్నడును అంటబడకుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 297 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 17 🌴


17. teṣāṁ jñānī nitya-yukta eka-bhaktir viśiṣyate
priyo hi jñānino ’tyartham ahaṁ sa ca mama priyaḥ

🌷 Translation :

Of these, the one who is in full knowledge and who is always engaged in pure devotional service is the best. For I am very dear to him, and he is dear to Me.

🌹 Purport :

Free from all contaminations of material desires, the distressed, the inquisitive, the penniless and the seeker after supreme knowledge can all become pure devotees.

But out of them, he who is in knowledge of the Absolute Truth and free from all material desires becomes a really pure devotee of the Lord.

And of the four orders, the devotee who is in full knowledge and is at the same time engaged in devotional service is, the Lord says, the best.

By searching after knowledge one realizes that his self is different from his material body, and when further advanced he comes to the knowledge of impersonal Brahman and Paramātmā. When one is fully purified, he realizes that his constitutional position is to be the eternal servant of God.

So by association with pure devotees the inquisitive, the distressed, the seeker after material amelioration and the man in knowledge all become themselves pure.

But in the preparatory stage, the man who is in full knowledge of the Supreme Lord and is at the same time executing devotional service is very dear to the Lord.

He who is situated in pure knowledge of the transcendence of the Supreme Personality of God is so protected in devotional service that material contamination cannot touch him.

🌹 🌹 🌹 🌹 🌹

13 Feb 2020