శ్రీమద్భగవద్గీత - 300: 07వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 300: Chap. 07, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 300 / Bhagavad-Gita - 300 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 20 🌴

20. కామైస్తైస్తైర్హృతజ్ఞానా: ప్రపద్యన్తేన్యదేవతా: |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా: స్వయా


🌷. తాత్పర్యం :

విషయ కోరికలచే జ్ఞానము అపహరింప బడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు.


🌷. భాష్యము :

సమస్త భౌతికకల్మషముల నుండి ముక్తులైనవారు శ్రీకృష్ణభగవానుని శరణువేడి అతని భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు. భౌతికసంపర్కము సంపూర్ణముగా క్షాళనము కానంతవరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు.

విషయకోరికలు కలిగియున్నను శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చినవారు బాహ్యప్రకృతిచే ఆకర్షింపబడనివారే యగుదురు. ఏలయన వారు సరియైన గమ్యమునె దరిచేరియున్నందున క్రమముగా కామము నుండి బయటపడగలరు.

శుద్ధభక్తుడై సర్వవిధములైన కోరికల నుండి ముక్తుడైనను లేదా సర్వవిధములైన విషయకోరికలు పూర్ణముగా కలిగియున్నను లేదా భౌతికసంపర్కము నుండి ముక్తిని వాంఛించుచున్నను మనుజుడు సర్వవిధములా వాసుదేవునికే శరణుపొంది అతనినే సేవించవలెనని శ్రీమద్భాగవతము (2.3.10) నందు ఉపదేశింపబడినది.

అకామ: సర్వకామో వా మోక్షకామ ఉదారధీ: |
తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్

కాని బుద్ధిహీనులైన మనుజులు ఆధ్యాత్మికజ్ఞానము లేకుండుటచే విషయకోరికల తక్షణప్రాప్తి కొరకు ఇతరదేవతల శరణుజొత్తురు.

సాధారణముగా అట్టివారు శ్రీకృష్ణుని దరిచేరరు. రజస్తమోగుణ భరితులై యున్నందున వారు వివిధ దేవతలను అర్చింతురు. ఆయా పూజా విధివిధానములను అనుసరించుచు వారు సంతృప్తులై యుందురు.

అట్టి దేవతారాధకులు అల్పకోరికల యందే మగ్నులైయుండి పరమగమ్యమును ఎట్లు పొందవలెనో ఎరుగకుందురు. కాని శ్రీకృష్ణభగవానుని భక్తులు మాత్రము ఆ విధముగా పెడమార్గమును పట్టరు.

వేదశాస్త్రమునందు వివధ ప్రయోజనములకై వివిధ దేవతారాధానము ప్రతిపాదించబడియున్నందున (ఉదా రోగియైనవాడు సూర్యుని పూజించవలెను) కృష్ణభక్తులు కానివారు కొన్ని ప్రయోజనములకు భగవానుని కన్నను దేవతలే మేలని భావింతురు. కాని శుద్ధభక్తుడు శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువని తెలిసియుండును.

“ఏకలే ఈశ్వర కృష్ణ, ఆర సబ భృత్య – దేవదేవుడైన శ్రీకృష్ణుడొక్కడే ప్రభువు, ఇతరులందరును అతని సేవకులు” అని చైతన్యచరితామృతము (ఆదిలీల – 5.142) నందు తెలుపబడినది.

కనుకనే శుద్ధభక్తుడు ఎన్నడును తన కోరికల పూర్ణము కొరకై దేవతలను ఆశ్రయింపక కేవలము శ్రీకృష్ణభగవానుని పైననే ఆధారపడియుండును. అట్టి శుద్ధభక్తుడు తనకు భగవానుడు ఒసగిన దానితో సంతృప్తి చెంది యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 300 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 20 🌴

20. kāmais tais tair hṛta-jñānāḥ prapadyante ’nya-devatāḥ
taṁ taṁ niyamam āsthāya prakṛtyā niyatāḥ svayā


🌷 Translation :

Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures.

🌹 Purport :

Those who are freed from all material contaminations surrender unto the Supreme Lord and engage in His devotional service.

As long as the material contamination is not completely washed off, they are by nature nondevotees.

But even those who have material desires and who resort to the Supreme Lord are not so much attracted by external nature; because of approaching the right goal, they soon become free from all material lust.

In the Śrīmad-Bhāgavatam it is recommended that whether one is a pure devotee and is free from all material desires, or is full of material desires, or desires liberation from material contamination, he should in all cases surrender to Vāsudeva and worship Him. As stated in the Bhāgavatam (2.3.10):

akāmaḥ sarva-kāmo vā
mokṣa-kāma udāra-dhīḥ
tīvreṇa bhakti-yogena
yajeta puruṣaṁ param

Less intelligent people who have lost their spiritual sense take shelter of demigods for immediate fulfillment of material desires.

Generally, such people do not go to the Supreme Personality of Godhead, because they are in the lower modes of nature (ignorance and passion) and therefore worship various demigods. Following the rules and regulations of worship, they are satisfied.

The worshipers of demigods are motivated by small desires and do not know how to reach the supreme goal, but a devotee of the Supreme Lord is not misguided.

🌹 🌹 🌹 🌹 🌹

16 Feb 2020