శ్రీమద్భగవద్గీత - 304: 07వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 304: Chap. 07, Ver. 24


🌹. శ్రీమద్భగవద్గీత - 304 / Bhagavad-Gita - 304 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 24 🌴

24. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయ: |
పరం భావమజానన్తో మామవ్యయమనుత్తమమ్

🌷. తాత్పర్యం :

నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను(శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు.

🌷. భాష్యము :

దేవతలను పూజించువారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడినారు. నిరాకారవాదులు సైతము అదేవిధముగా ఇచ్చట వర్ణింపబడిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయరూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను నిరాకారవాదులు తమ అజ్ఞానకారణముగా భగవానుడు రూపరహితుడనియు వాదింతురు. శ్రీరామానుజాచార్యుల పరంపరలో నున్న పరమభక్తుడైన శ్రీయమునాచార్యులు ఈ విషయమున ఒక చక్కని శ్లోకమును ఇట్లు రచించియుండిరి.

త్వాం శీలరూపచరితై: పరమప్రకృష్టై:

సత్త్వేన సాత్త్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై: |

ప్రఖ్యాతదైవపరమార్థవిదాం మతైశ్చ

నైవాసురప్రకృతయ: ప్రభవన్తి బోద్ధుమ్

“హే ప్రభూ! వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవదేవుడవని ఎరిగియున్నారు. వేదవాజ్మయమును అవగాహన చేసికొనుట ద్వారా నీ గుణములను, రూపమును, కర్మలను తెలిసికొని మనుజుడు నిన్ను దేవదేవుడని అవగతము చేసికొనగలడు. కాని రజస్తమోగుణములందున్న దానవులు మరియు అభక్తులు మాత్రము నిన్నెన్నడును ఎరుగజాలరు. వారు నిన్ను అవగాహన చేసికొనజాలకున్నారు. అభక్తులైనవారు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేదవాజ్మయమును నిపుణతతో చర్చించినను ఆదిదేవుడవైన నిన్ను అవగాహన చేసికొనుట వారికి సాధ్యము కాదు.” (స్తోత్రరత్నము 12)

కేవలము వేదవాజ్మయమును అధ్యయనము చేయుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు తెలియబడడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి తెలియుట కేవలము అతని కరుణతోనే సాధ్యము కాగలదు. కనుకనే దేవతలను పూజించువారే బుద్ధిహీనులు కాడనియు, కృష్ణభక్తిరసభావనము అనునది ఏమాత్రములేక కేవలము వేదాంతచర్చ మరియు వేదవాజ్మయముపై ఊహాకల్పనలు చేయు భక్తిహీనులు సైతము బుద్ధిహినులేయనియు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అట్టివారికి భగవానుని స్వీయరూపమును అవగతము చేసికొనుట సాధ్యముకాని విషయము. పరతత్త్వము అనుననది నిరాకారమనెడి భావనలో నున్నవారు “అబుద్ధులు” అని వర్ణింపబడిరి. అనగా వారు పరతత్త్వపు నిజరూపము తెలియనివారని భావము. దివ్యానుభవము యనునది నిరాకార బ్రహ్మానుభూతిలో ప్రారంభమై పిదప పరమాత్మానుభూతికి పురోగమించుననియు, కాని పరతత్త్వపు చరమానుభవము శ్రీకృష్ణభగవానుడే యనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 304 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 24 🌴

24. avyaktaṁ vyaktim āpannaṁ manyante mām abuddhayaḥ
paraṁ bhāvam ajānanto mamāvyayam anuttamam


🌷 Translation :

Unintelligent men, who do not know Me perfectly, think that I, the Supreme Personality of Godhead, Kṛṣṇa, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know My higher nature, which is imperishable and supreme.

🌹 Purport :

Those who are worshipers of demigods have been described as less intelligent persons, and here the impersonalists are similarly described. Lord Kṛṣṇa in His personal form is here speaking before Arjuna, and still, due to ignorance, impersonalists argue that the Supreme Lord ultimately has no form. Yāmunācārya, a great devotee of the Lord in the disciplic succession of Rāmānujācārya, has written a very appropriate verse in this connection. He says,

tvāṁ śīla-rūpa-caritaiḥ parama-prakṛṣṭaiḥ
sattvena sāttvikatayā prabalaiś ca śāstraiḥ
prakhyāta-daiva-paramārtha-vidāṁ mataiś ca
naivāsura-prakṛtayaḥ prabhavanti boddhum

“My dear Lord, devotees like Vyāsadeva and Nārada know You to be the Personality of Godhead. By understanding different Vedic literatures, one can come to know Your characteristics, Your form and Your activities, and one can thus understand that You are the Supreme Personality of Godhead. But those who are in the modes of passion and ignorance, the demons, the nondevotees, cannot understand You. They are unable to understand You. However expert such nondevotees may be in discussing Vedānta and the Upaniṣads and other Vedic literatures, it is not possible for them to understand the Personality of Godhead.”

🌹 🌹🌹 🌹 🌹

21 Feb 2020