శ్రీమద్భగవద్గీత - 306: 07వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 306: Chap. 07, Ver. 26


🌹. శ్రీమద్భగవద్గీత - 306 / Bhagavad-Gita - 306 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 26 🌴

26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగుదురు. కాని నన్నెవ్వరును ఎరుగరు.

🌷. భాష్యము :

సాకార, నిరాకారతత్త్వములకు సంబంధించిన వివాదము ఇచ్చట స్పష్టముగా విశదీకరింపబడినది. మాయావాదులు తలచురీతిగా శ్రీకృష్ణభగవానుని రూపము మాయ (భౌతికము) అయినచో, సాధారణజీవుల వలె అతడును దేహమును మార్చును గడచిన జన్మను మరచిపోవలెను. దేహదారులెవ్వరును గడచిన జన్మను గుర్తుంచుకొనుట, రాబోవు జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుతజన్మము యొక్క ఫలితమును ఊహించుట చేయలేరు. కనుకనే వారు భూత, భవిష్యత్, వర్తమానములును తెలియరని తీర్మానింపవచ్చును. భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందనిదే ఎవ్వరును భూత, భవిష్యత్, వర్తమానములను ఎరుగజాలరు.

సాధారణ మావవునకి భిన్నముగా శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను భూతకాలమున గడచిన సర్వమును, వర్తమానమున జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని సంపూర్ణముగా తెలియుదనిని స్పష్టముగా పలికియున్నాడు. లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునకు జ్ఞానోపదేశము చేసిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి యందుంచుకొనినట్లు మనము భగవద్గీత యొక్క చతుర్థాధ్యాయమున గాంచియున్నాము. సర్వజీవహృదయములలో పరమాత్మ రూపున నిలిచియున్నందున అతడు సర్వజీవులను సైతము ఎరిగియున్నాడు. కాని శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచియున్నను మరియు దేవదేవునిగా స్థితుడై యున్నను అల్పజ్ఞులైనవారు (నిరాకారబ్రహ్మానుభూతిని బడయగలిగినప్పటికిని) అతనిని పరమపురుషునిగా ఎరుగుజాలకున్నారు. నిక్కముగా శ్రీకృష్ణభగవానుని దేహము అవ్యయమైనది మరియు నశ్వరము కానిది. అతడు సూర్యుడైనచో మాయ మేఘము వంటిది.

భౌతికజగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును ఒక్కక్కమారు మేఘములు తాత్కాలికముగా కప్పివేసినను వాస్తవమునకు అది మన దృష్టిని కప్పివేయుటయే యగును. ఏలయన సూర్యచంద్రాదులు వాస్తవమునకు కప్పబడరు. అలాగుననే మాయ సైతము శ్రీకృష్ణభగవానుని కప్పలేదు. అతడే తన అంతరంగశక్తిచే అల్పజ్ఞులైనవారికి గోచరించక యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 306 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 26 🌴

26. vedāhaṁ samatītāni vartamānāni cārjuna
bhaviṣyāṇi ca bhūtāni māṁ tu veda na kaścana


🌷 Translation :

O Arjuna, as the Supreme Personality of Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and all things that are yet to come. I also know all living entities; but Me no one knows.


🌹 Purport :

Here the question of personality and impersonality is clearly stated. If Kṛṣṇa, the form of the Supreme Personality of Godhead, were māyā, material, as the impersonalists consider Him to be, then like the living entity He would change His body and forget everything about His past life. Anyone with a material body cannot remember his past life, nor can he foretell his future life, nor can he predict the outcome of his present life; therefore he cannot know what is happening in past, present and future. Unless one is liberated from material contamination, he cannot know past, present and future.

Unlike the ordinary human being, Lord Kṛṣṇa clearly says that He completely knows what happened in the past, what is happening in the present, and what will happen in the future. In the Fourth Chapter we have seen that Lord Kṛṣṇa remembers instructing Vivasvān, the sun-god, millions of years ago. Kṛṣṇa knows every living entity because He is situated in every living being’s heart as the Supersoul.

🌹 🌹 🌹 🌹 🌹

23 Feb 2020