శ్రీమద్భగవద్గీత - 293: 07వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 293: Chap. 07, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 293 / Bhagavad-Gita - 293 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 13 🌴

13. త్రిభిర్గుణమయైర్భావైరేభి: సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్య: పరమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :

సమస్త విశ్వము సత్త్వరజస్తమో గుణములనెడి త్రిగుణములచే భ్రాంతికి గురియై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.

🌷. భాష్యము :

సమస్త ప్రపంచము త్రిగుణములచే మోహింపజేయబడియున్నది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురియైనవారు శ్రీకృష్ణభగవానుడు ప్రకృతికి పరమైనవాడని ఎరుగజాలరు.

భౌతికప్రకృతి ప్రభావము నందున్న ప్రతిజీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగియుండును. గుణముల ననుసరించి కర్మల యందు చరించు మనుజులు నాలుగురకములుగా నుందురు. సత్త్వగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు బ్రహ్మణులు. రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు క్షత్రియులు. రజస్తమోగుణములను కలిగియుండువారు వైశ్యులు, కేవలము తమోగుణము నందే యుండువారు శూద్రులు. శూద్రులకన్నను నీచులైనవారు జంతువులు లేక పశుప్రాయ జీవనులు అనబడుదురు.

కాని వాస్తవమునాకు ఈ ఉపాదులన్నియు అశాశ్వతములు. బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనను ఈ జీవితము తాత్కాలికమైనది. ఈ జీవతము తాత్కాలికమైనను దీని పిదప మనకు ఈ జన్మ లభించునో ఎరుగలేము. మాయావశమున దేహభావనకు లోబడియే మనలను మనము భారతీయులుగనో, అమెరికావాసులుగానో లేక బ్రాహ్మణులుగనో, హిందువులుగనో, మహమ్మదీయులుగనో భావించుచుందురు. ఈ విధముగా త్రిగుణములచే బంధితులమైనచో మనము ఆ గుణముల వెనుకనున్న భగవానుని మరతుము. కనుకనే త్రిగుణములచే మోహమునొందిన జీవులు భౌతిక నేపథ్యము వెనుక నున్నది తానేయనుచు ఎరుగజాలకున్నారని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.

మానవులు, దేవతలు, జంతువులాదిగాగల అనేకరకముల జీవుల ప్రకృతి ప్రభావము చేతనే నిర్గుణుడైన శ్రీకృష్ణభగవానుని మరచియున్నారు. రజస్తమోగుణముల యందున్నవారే గాక, సత్త్వగుణమునందున్నవారు కూడా పరతత్త్వము యొక్క నిరాకారబ్రహ్మభావమును దాటి ముందుకు పోజాలరు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, యశస్సు, వైరాగ్యములు సమగ్రముగా నున్న శ్రీకృష్ణభగవానుని దివ్యరూపముచే వారు భ్రాంతి నొందుదురు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట సత్త్వగుణమునందున్నవారికే సాధ్యము కాదన్నచో, రజస్తమోగుణము లందున్నవారికి ఏమి ఆశ మిగిలి యుండగలదు? కాని కృష్ణభక్తిరసభావనము ఈ త్రిగుణములకు పరమైనట్టిది. దాని యందు ప్రతిష్టితులైనట్టివారు నిజముగా ముక్తపురుషులు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 293 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 13 🌴

13. tribhir guṇa-mayair bhāvair ebhiḥ sarvam idaṁ jagat
mohitaṁ nābhijānāti mām ebhyaḥ param avyayam

🌷 Translation :

Deluded by the three modes [goodness, passion and ignorance], the whole world does not know Me, who am above the modes and inexhaustible.

🌹 Purport :

The whole world is enchanted by the three modes of material nature. Those who are bewildered by these three modes cannot understand that transcendental to this material nature is the Supreme Lord, Kṛṣṇa.

Every living entity under the influence of material nature has a particular type of body and a particular type of psychological and biological activities accordingly. There are four classes of men functioning in the three material modes of nature. Those who are purely in the mode of goodness are called brāhmaṇas. Those who are purely in the mode of passion are called kṣatriyas. Those who are in the modes of both passion and ignorance are called vaiśyas.

Those who are completely in ignorance are called śūdras. And those who are less than that are animals or animal life. However, these designations are not permanent. I may be either a brāhmaṇa, kṣatriya, vaiśya or whatever – in any case, this life is temporary. But although life is temporary and we do not know what we are going to be in the next life, by the spell of this illusory energy we consider ourselves in terms of this bodily conception of life, and we thus think that we are American, Indian, Russian, or brāhmaṇa, Hindu, Muslim, etc. And if we become entangled with the modes of material nature, then we forget the Supreme Personality of Godhead, who is behind all these modes. So Lord Kṛṣṇa says that living entities deluded by these three modes of nature do not understand that behind the material background is the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹

9 Feb 2020